For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిర్ బిల్లింగ్ లో మా ఆయనతో గాలిలో రొమాన్స్ చేశా.. పక్షుల్లా తేలిపోయాం - #mystory174

మంచుతో నిండి ఉండే దౌలాదర్ పర్వత శ్రేణిలో నెలకొని ఉండే బిర్ బిల్లింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని చూడదగ్గ ప్రాంతాల్లో ఒకటి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జంపింగ్ స్పాట్. పారా గ్లైడింగ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

|

నాకు పెళ్లయి చాలా రోజులైనా మా ఆయనతో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి అయిన కొత్తలో మేము ఎలాగో హనీమూన్ వెళ్లలేదు. అందుకే ఈ సారి సమ్మర్ లో ఆఫీసులో నెల రోజులు లీవ్ తీసుకుని మా ఆయనను ఒప్పించి సరదాగా అలా విహరించాం.

ఆ మధ్య కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిర్‌ బిల్లింగ్‌ ప్రాంతంలో పారాగ్లిడింగ్‌కు వెళ్లిన పోస్ట్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది చూసి నేను కూడా మా ఆయనతో బిర్ బిల్లింగ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యాను. మొత్తానికి నేను మా ఆయనతో బిర్ బిల్లింగ్ కు వెళ్లాను. అక్కడ నాకు అన్నీ మంచి అనుభూతులే.

పక్షిలా తేలిపోవడం

పక్షిలా తేలిపోవడం

వందల అడుగుల ఎత్తులో పక్షిలా తేలిపోవడం, సముద్రపు అడుగున జలచరాలతో గడపడం, కారు చీకటి కొండ గుహల్లో నడక... అబ్బా ఇలా అన్నీ అడ్వెంచర్సే. నాకు మా ఆయనకు తెలియకుండా మాలో ఉన్న జేమ్స్‌ బాండ్స్ బయటకు వచ్చారు.

ఒళ్లు గుల్ల చేసుకోవడం

ఒళ్లు గుల్ల చేసుకోవడం

ఇలా దుంకడాలు గెంతడాల ద్వారా ఒళ్లు గుల్ల చేసుకోవడం తప్పిస్తే ఏం లాభం? అని కొందరు పెదవి విరిచేవాళ్లు ఉంటారు. కానీ ఆ సాహసంతో మనలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది, నూతనోత్సాహం పెల్లుబుకుతుంది.

బిర్ బిల్లింగ్

బిర్ బిల్లింగ్

మంచుతో నిండి ఉండే దౌలాదర్ పర్వత శ్రేణిలో నెలకొని ఉండే బిర్ బిల్లింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని చూడదగ్గ ప్రాంతాల్లో ఒకటి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జంపింగ్ స్పాట్. పారా గ్లైడింగ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అది ఒక్కటి మాత్రమే కాదు...ఇంకా మరెన్నో విశేషాలు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి.

కాంగ్రా జిల్లాలో

కాంగ్రా జిల్లాలో

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో చిన్న గ్రామం బిర్‌. బౌద్ధ మఠాలు, హిందూ దేవాలయాలతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. టిబెట్‌ సంస్కృతి తొంగి చూస్తుంటుంది. చుట్టూ మంచు పర్వతాలు.. మధ్యలో తీర్చిదిద్దినట్టున్న ఊరు. చాలా రోజలు మంచుకౌగిట బందీ అయ్యే బిర్‌ ఫిబ్రవరి నుంచి బాగుంటుంది.

బిర్ వేరు బిల్లింగ్‌ వేరు

బిర్ వేరు బిల్లింగ్‌ వేరు

ఇక ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో పర్వత పంక్తులపై బిల్లింగ్‌ అనే ప్రదేశం ఉంటుంది. పారాగ్లైడింగ్‌ కు ఇదే వేదిక. బిర్‌ సౌందర్యం, బిల్లింగ్‌ సాహసం రెండూ కలవడం వల్ల ఇది బిర్‌ బిల్లింగ్‌గా పేరుగాంచింది.

బౌద్ధ వాతావరణం

బౌద్ధ వాతావరణం

బిర్ లో బౌద్ధ వాతావరణం కనిపిస్తుంది. అందమైన బౌద్ధారామాలు, స్తూపాలు ఇక్కడి అందాలకు మరింత వన్నె తెస్తాయి. ఈ పట్టణంలో టిబెట్ శరణార్థుల సెటిల్మెంట్ ఉన్నది. స్థానికులు దీన్ని కాలనీగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ డ్రికుంగ్ డోజిన్ తెక్చో లింగ్ మోనాస్టరీ, పాల్ యుల్ చొకొహోర్లింగ్ మోనాస్టరీ, డీర్ పార్క్ ఇనిస్టిట్యూట్

టిబెటన్ హ్యాండీ క్రాఫ్ట్స్ సెంటర్, ట్రెక్కింగ్ ట్రయల్

వంటి సూపర్బ్.

బిర్ ఆరంభ కేంద్రం

బిర్ ఆరంభ కేంద్రం

చిన్న చిన్న ట్రెక్స్, ట్రయల్స్ లాంటివి బిర్ బిల్లింగ్ లో అడుగడుగునా ఉంటాయి. బిర్ నుంచి ట్రెక్కింగ్ ట్రయల్స్ సన్నటి కనుమల గుండా సాగుతాయి. వాటిని చూసి మేము ఎంతో ఆనందించాం. బారా బంగాల్, గోర్ నాలా, లడఖ్ రీజియన్ కు చెందిన జాన్స్ కర్ లోయలకు దారి తీసే ట్రెక్ లకు బిర్ ఆరంభ కేంద్రం. ఈ ప్రాంతం నుంచి రూపుదిద్దుకునే చిన్నా, పెద్ద ట్రెక్ లు హనుమాన్ గఢ్, చంబా లోయ, బరోత్ లోయ, రాజ్ గుందా అందమైన గ్రామానికి దారి తీస్తాయి.

ఈ లోయ ఎంతో వాలుగా ఉంటుంది

ఈ లోయ ఎంతో వాలుగా ఉంటుంది

షార్ట్ హైక్స్ మమ్మల్ని చౌగాన్ లోని తేయాకు తోటల మధ్య లోకి లేదా చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న అందమైన జనావాసాల్లోకి తీసుకెళ్లాయి. ఇక ట్రెక్ తాతాని కూడా చాలా బాగుంటుంది. ఇతరాలతో పోలిస్తే (బారా బంగాల్ మినహాయించి) దీనికి డిమాండ్ ఎక్కువే. ఈ లోయ ఎంతో వాలుగా ఉంటుంది. ఈ ట్రెక్ 6 కి.మీ.కు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ ట్రెక్ హైడ్రో ప్రాజెక్టు వద్ద మొదలవుతుంది ఇది మనల్ని తాతాని వేడినీటి బుగ్గల వద్దకు చేరుస్తుంది.

అందమైన గ్రామాలు

నగర జీవితానికి దూరం

నగర జీవితానికి దూరం

అందమైన జంట గ్రామాలు, రాజ్ గుందా, కులార్ గుందా అనేవి దట్టమైన గుందా (బిర్ కు 16-17 కి.మీ. దూరం)లో ఉంటాయి. నగర జీవితానికి ఇవి ఎంతో దూరంగా ఉంటాయి. మేము కూడా అక్కడికి వెళ్లాం. అక్కడ లోయల్లోని అందాలను, అందమైన ప్రకృతి దృశ్యాలను, వన్యప్రాణులను చూసి ఆనందంలో తేలిపోయాం.

క్యాంప్ ను ఏర్పాటు చేసుకోవచ్చు

క్యాంప్ ను ఏర్పాటు చేసుకోవచ్చు

బిర్ లోని పచ్చటి వాలు ప్రాంతాలు నక్షత్రాలతో నిండిన రాత్రుళ్ళు వాటి కింద మేము సేద తీరాం. మృదువైన గడ్డి పొరతో ఉండే ఈ ప్రాంతంలో 5 నిమిషాల్లో క్యాంప్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద చలిమంట వేసుకోవాలనుకునే కోరికను ఇక్కడ చక్కగా నెరవేర్చుకోవొచ్చు. మేము కూడా చలి మంట వేసుకున్నాం. వేసవిలో వెళ్లినా కూడా ఇక్కడ చలిగా ఉంటుంది.

ఎన్నో వేల అడుగుల ఎత్తులో

ఎన్నో వేల అడుగుల ఎత్తులో

ఇక ఇక్కడ సూర్యాస్తమయం భలే ఉంటుంది. మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంటుంది. ఈ పారాగ్లైడింగ్ సైట్ దిగువ భూములకు ఎన్నో వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. కాంగ్రా వ్యాలీలో ఒక చక్కటి సన్ సెట్ స్పాట్ ఇది. రాత్రి వేళ మీరు గనుక ఇక్కడే క్యాంప్ చేస్తే కొండల వెనుక నుంచి మొదలయ్యే అందమైన సూర్యోదయాన్ని చడవచ్చు. మేము అలాగే ఎంజాయ్ చేశాం.

పారా గ్లైడింగ్‌

పారా గ్లైడింగ్‌

నాకు బిర్‌ బిల్లింగ్‌ లో బాగా నచ్చింది పారా గ్లైడింగ్‌. అంతెత్తు కొండ మీద నుంచి దూకి, పక్షిలా కాసేపు ఆకాశంలో విహరించడమే పారా గ్లైడింగ్‌. చెప్పినంత సులువు కాదు చేయడం. వందల అడుగుల ఎత్తు నుంచి దూకుతుంటే గుండె జారిపోతున్న ఫీలింగ్‌ వస్తుంది.

రకరకాల పేర్లతో

రకరకాల పేర్లతో

స్పీడ్‌ ఫ్లైయింగ్‌, హ్యాంగ్‌గ్లైడింగ్‌ .. ఇలా రకరకాల పేర్లతో పారా గ్లైడింగ్‌ను బిర్‌ బిల్లింగ్‌ లో నిర్వహిస్తున్నారు. ఈ సాహస క్రీడకు ముందుగా శిక్షణ తీసుకోవడం అవసరం. అయితే, పైలెట్‌ (మీరే) గ్లైడింగ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోగలగాలి. అప్పుడే థ్రిల్‌. లేకుంటే గాలిలో ఎగురుతున్నా భయంతో ఊగిపోవాల్సి వస్తుంది. బిర్‌ బిల్లింగ్‌లో పారా గ్లైడింగ్‌ మేము ఫుల్ ఎంజాయ్ చేశాం.

ఆకాశవీధిల్లో చక్కర్లు కొట్టేశా

ఆకాశవీధిల్లో చక్కర్లు కొట్టేశా

బిర్‌ బిల్లింగ్ సముద్ర మట్టానికి 4,230 మీటర్ల ఎత్తున్న పర్వతం. అబ్బా అక్కడ గాలులు వీస్తే మొదట నాకు భయం వేసింది. నేను మా ఆయన ఊగిపోయాం. కొండ నుంచి కిందికి చూసి భయపడ్డా. పారాగ్లైడింగ్‌ మొదలు పెట్టాక నేను కళ్లు మూసుకొని దూకేశా. గాలివాటున నేను ఎటో వెళ్లానో తెలియదు. తర్వాత నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఆకాశవీధిల్లో చక్కర్లు కొట్టేశాను. మొత్తానికి పారాగ్లైడింగ్‌ మాత్రం సూపర్బ్.

రొమాన్స్ చేసుకున్నాం

రొమాన్స్ చేసుకున్నాం

పారాగ్లైడింగ్‌ చేసేటప్పుడు నేను పక్షిలాగా విహరింంచాను. నా పక్కనే మా ఆయన కూడా విహరిస్తూ వచ్చాడు. ఇద్దరం అవతార్ సినిమాలో హీరో హీరోయిన్ల మాదిరిగా గాలిలోనే రొమాన్స్ చేసుకున్నాం. రొమాన్స్ మరీ మీరు ఎక్కువగా ఊహించుకోండి. ఏదో ఇద్దరం ప్రేమగా కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకున్నాం.

టెంట్‌ హౌసుల్లో హాయిగా సేదతీరవచ్చు

టెంట్‌ హౌసుల్లో హాయిగా సేదతీరవచ్చు

దాదాపు 5000 మీటర్ల మేము ఎగురుతూ ఆనందించాం. బిర్‌లో పారాగ్లైడింగ్‌తో పాటు మరెన్నో ఆటలాడొచ్చు. రాక్‌క్లైంబింగ్‌తో గుట్టలు ఎక్కేయొచ్చు. మౌంటెయిన్‌ బైక్‌లపై దూసుకుపోవచ్చు. ఈ సాహసాలు మన ఒంటికి సరిపోవనుకుంటే... బిర్‌ వ్యాలీలో టెంట్‌ హౌసుల్లో హాయిగా సేదతీరవచ్చు.

ధర్మశాల వెళ్లాం

ధర్మశాల వెళ్లాం

బిర్‌ బిల్లింగ్‌ చేరుకునేందుకు మేము ముందుగా పఠాన్‌కోట్‌ వెళ్లాం. అక్కడి నుంచి ధర్మశాల వెళ్లాం. ధర్మశాల నుంచి బిర్‌ 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక పఠాన్‌కోట్‌ నుంచి ధర్మశాలకు రైలులో వెళ్లాం. అక్కడి నుంచి ట్యాక్సీలో గానీ బిర్‌ చేరుకున్నాం. బిర్ కు చే సమీప రైలు కేంద్రం అజు (పఠాన్ కోట్, జోగిందర్ నగర్ వయా కాంగ్రాల మధ్య నేరో గేజ్ పై ఉంది) ఇది బిర్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉంటుంది.

గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు

గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు

నీ దగ్గర ఎంత డబ్బుంది, నువ్వెంత సంపాదిస్తున్నావు, ఎంత వెనకేస్తున్నావు.. అన్నది కాదు. నీకెన్ని గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు ఉన్నాయన్నదే నీ ఆనందానికి కొలమానం. సాహసక్రీడలు జ్ఞాపకాల బోషాణం పెట్టెలు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చెయ్యాలి.

English summary

my memories of trip to bir billing valley

my memories of trip to bir billing valley
Story first published:Saturday, May 26, 2018, 12:18 [IST]
Desktop Bottom Promotion