మెక్సికో ఫుట్‌బాల్ ప్లేయర్స్ వేశ్యలతో ఎంచక్కా ఎంజాయ్ చేశారు.. 30 మంది అమ్మాయిలతో 9 మంది గడిపారు

Subscribe to Boldsky

మరో వారంరోజుల్లో ఫిపా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో ప్రపంచమంతా ఇప్పుడు ఫుట్‌బాల్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఈ నెల 14న రష్యాలో ప్రారంభమయ్యే ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన జట్లు పాలుపంచుకోనున్నాయి. అలాంటి జట్లలో మెక్సికో ఒకటి. ఈ టోర్నీ కోసం యూరప్‌కు మెక్సికో జట్టు సభ్యులు బయలుదేరారు.

వేశ్యలతో ఎంచక్కా ఎంజాయ్

వేశ్యలతో ఎంచక్కా ఎంజాయ్

అయితే అందరిలాగా తమ జట్టు సాదాసీదాగా బయలుదేరితే అందులో మజా ఏముందని అనుకున్నారో ఏమోగానీ.. మెక్సికో జట్టు సభ్యులను వేశ్యలతో ఎంచక్కా ఎంజాయ్ చేయించి మజా చేయించారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు ఈ విషయమే వైరల్ అవుతోంది.

సెక్స్‌ స్కాండల్‌

సెక్స్‌ స్కాండల్‌

అయితే ఫిఫా వరల్డ్‌ కప్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సెక్స్‌ స్కాండల్‌ మెక్సికో ఫుట్ బాల్ జట్టును కుదిపేసింది. రష్యాకు బయలుదేరే ముందు ఆటగాళ్ల దగ్గరకి వేశ్యలను పంపిన విషయం వెలుగులోకి రావటంతో మెక్సికో ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌(ఎంఎఫ్‌ఏ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేకంగా వీడ్కోలు

ప్రత్యేకంగా వీడ్కోలు

యూరప్‌కు బయలుదేరి వెళ్లే ముందు తమ దేశపు ఆటగాళ్లకు మెక్సికో కాస్త ప్రత్యేకంగా వీడ్కోలు పలకాలనుకుంది. మామూలుగా అయితే వరల్డ్‌కప్ ఆడటం కోసం వెళ్తున్న టీమ్‌లకు వీరతిలకం దిద్ది పంపడం మనకు అలవాటు. కానీ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో ఆడటం కోసం వెళ్తున్న మెక్సికోకు చెందిన 9 మంది టీమ్‌ సభ్యుల కోసం 30 మంది వేశ్యలను తీసుకొచ్చారు.

నోటాస్‌ మాగ్జైన్‌ కథనం

మెక్సికోకు చెందిన టీవీ నోటాస్‌ మాగ్జైన్‌ కథనం ప్రకారం.. గత శనివారం అజ్‌టెక్‌ స్టేడియంలో స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో జట్టు విజయం సాధించింది. అనంతరం 9 మంది ఆటగాళ్లను ఓ ప్రైవేట్‌ రిసార్ట్స్‌కు తరలించి, సుమారు 30 మంది వేశ్యలను వారి వద్దకు అధికారులు పంపారు.

అమ్మాయిలను పిలిపించారట

అమ్మాయిలను పిలిపించారట

ఓ ప్రైవేటు రిసార్ట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా అమ్మాయిలను పిలిపించారట. దీంతో చివరి వామప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 1-0తో గెలిచిన తర్వాత రష్యాకు బయలుదేరే ముందు టీమంతా వేశ్యలతో కలిసి ఎంజాయ్ చేసింది.

తీవ్ర విమర్శలు

తీవ్ర విమర్శలు

టీవీనొటాస్ అనే మ్యాగజైన్ ఈ ఫొటోలను పబ్లిష్ చేసింది. ‘ఆటగాళ్లకు అద్భుతమైన ఫేర్‌వెల్‌' అంటూ సదరు మాగ్జైన్‌ ఫోటోలతో సహా ఓ కథనం ప్రచురించింది. దీంతో ఎంఎఫ్‌ఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వార్తలపై స్పందించిన అధికారులు, ఖాళీగా ఉన్న సమయంలో వారు పార్టీ చేసుకున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండవని వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రాక్టీస్‌కు హాజరయ్యారు

ప్రాక్టీస్‌కు హాజరయ్యారు

‘వారు ప్రాక్టీస్‌కు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఫ్రీ టైమ్‌లోనే ఏకాంతంగా గడిపారు. రిప్రెష్‌మెంట్‌ కోసమే ఈ పని చేశాం. కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవు' అని మెక్సికన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ ప్రకటించింది. సెలవు రోజున వారి వ్యక్తిగత స్వేచ్ఛ వారిదేనని మెక్సికన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌చెప్పడం ఈ వార్తలను నిజం చేస్తున్నాయి. దీంతో ఆటగాళ్లు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

గతంలో అమ్మాయిలతో గడపగా

గతంలో అమ్మాయిలతో గడపగా

మెక్సికో టీమ్ ప్రస్తుతం కోపెన్‌హాగన్‌లో ఉంది. అక్కడ డెన్మార్క్‌తో ఓ ఫ్రెండ్లీ గేమ్ ఆడిన తర్వాత రష్యా బయలు దేరుతుంది. ఈ మధ్య కాలంలో మెక్సికో టీమ్‌పై ఇలాంటి ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. గతంలో(సెప్టెంబర్‌ 2010) ఆటగాళ్లు ఇదే రీతిలో అమ్మాయిలతో గడపగా.. క్రమశిక్షణ నియమావళి కింద ఇద్దరు ఆటగాళ్లు తాత్కాలిక నిషేధం ఎదుర్కున్నారు.

Image Credit (all images)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    prostitute scandal jolts mexico football team ahead of fifa world cup 2018

    prostitute scandal jolts mexico football team ahead of fifa world cup 2018
    Story first published: Wednesday, June 6, 2018, 16:37 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more