Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
బంధువు అని నమ్మితే వ్యభిచారం చేయించింది, ఒంగోలు అమ్మాయిని 20 వేలకు కొని ఇష్టానుసారంగా వాడుకున్నారు
ఒంగోలు మండలానికి చెందిన ఓ యువతిని మద్దిపాడు మండలానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే తరుచూ భర్త ఆమెతో గొడవపెట్టుుకునేవాడు. ఒంగోలు వ్యభిచారం : బంధువు అని నమ్మితే వ్యభిచారం చేయించింది.
ఆమెకు భర్తతో విబేధాలు వచ్చాయి. తర్వాత పుట్టింటికి చేరింది. బతుకుదెరువు కోసం ఏవో చిన్నచిన్నపనులు చేసేది. కాస్త బాగా బతుకుదామనుకుని సమీప బంధువుని సలహా అడిగింది. ఆమె ఇచ్చిన సలహా మనస్సుకు నచ్చకున్నా కూడా పాటించింది.

భర్త ఆమెతో గొడవపెట్టుుకునేవాడు
ఒంగోలు మండలానికి చెందిన ఓ యువతిని మద్దిపాడు మండలానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే తరుచూ భర్త ఆమెతో గొడవపెట్టుుకునేవాడు. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పుట్టింట్లో ఆమె మరిన్ని కష్టాలు ఏర్పడ్డాయి. ఆర్థికంగా ఆమె చాలా ఇబ్బందులుపడాల్సి వచ్చింది. ఏదో ఒక పని చేసుకుని బతకాలనుకుంది.

ఓ కుర్చీల ఫ్యాక్టరీలో కూలి పనికి
గ్రోత్‌సెంటర్‌లోని ఓ కుర్చీల ఫ్యాక్టరీలో కూలి పనికి చేరింది. అయినా ఆర్థికంగా ఆమెకు కష్టాలు తీరలేదు. ఇంకా కాస్త బాగా సెటిల్ అయితే బాగుండని అనుకుంటూ ఉండేది. ఫ్యాక్టరీలో ఆమెకు సమీప బంధువైన మరో మహిళ కూడా పని చేసేది. ఆ బంధువు పేరు కనపర్తి రమాదేవి.

లేనిపోని ప్రేమ ఒలకబోసేది
రమాదేవికి రోజూ ఆమె తన కష్టాలు చెప్పుకునేది. రమాదేవి కూడా ఆమెపై లేనిపోని ప్రేమ ఒలకబోసేది. నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేనమ్మా నేను నీకు దారి చూపిస్తాను అంటూ ఆ యువతిని నమ్మబలికింది.

కష్టాలు తీరతాయంటూ నమ్మించింది
ఒంగోలులో తన సోదరి ఉందని, అక్కడకు వెళ్తే కష్టాలు తీరతాయంటూ ఆమె నమ్మించింది రమాదేవి. పొట్ట కూటికోసం ఏ పని చేసినా తప్పు లేదంటూ ఆమెకు నీతి సూత్రాలు చెప్పింది ఆమె. వ్యభిచారం చేస్తే తప్పులేదంటూ మాయమాటలు చెప్పి ఆమెను ఆ రొంపిలోకి దించింది రమాదేవి, ఆమె అక్క.

రూ.20 వేలు వెచ్చించి కొనుగోలు చేశా
అయితే కూతురు కొన్ని రోజులుగా తమకు దూరంగా ఉండడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చింది. తన కూతురికి ఏమైందోనని కంగారు పడింది. ఒంగోలు ఒన్‌టౌన్ పరిధిలోని ఓ ఇంట్లో తన కుమార్తె ఉందని ఆ యువతి తల్లి తెలుసుకుంది. వెంకటరత్నం అనే మహిళ వద్దకు వెళ్లి తన కుమార్తెను అప్పగించమని కోరింది. తాను రూ.20 వేలు వెచ్చించి కొనుగోలు చేశానని, కనీసం రూ.10 వేలు ఇస్తే తప్ప పంపనని వెంకటరత్నం మొండికేసింది.

హరిబాబు వ్యభిచారం వృత్తిలోకి దింపాడు
ఇక ఆ యువతని ఆమె ఒంగోలులో కాకుండా తనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న తిరుమలశెట్టి శ్రీనివాసులునాయుడు ద్వారా సింగరాయకొండకు చెందిన హరిబాబు అనే వ్యక్తి వద్దకు పంపింది. అక్కడ హరిబాబు ఆమెను వ్యభిచారం వృత్తిలోకి దింపాడు. హరిబాబు ఆ యువతి ద్వారా డబ్బు సంపాదించేందుకు నానా రకాల పనులు ఆమెతో చేయించాడు.

మసాజ్‌లు చేయించడం పాటు వికృత పనులు
తన తెలిసిన మగవారికి ఆ యువతితో మసాజ్‌లు చేయించడం పాటు ఇతర వికృత పనులను కూడా ఆమెతో బలవంతంగా చేయించాడు హరిబాబు. ఆ రొంపి నుంచి బయటకు రావడానికి యువతి నానా రకాలుగా ప్రయత్నించినా బెదిరింపులకు తలొగ్గి అక్కడే మగ్గిపోయింది.

పోలీసులు రంగంలోకి
చివరకు యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులు రంగంలోకి దిగి కేసు విచారించారు. రమాదేవితో పాటు యరజర్లకు చెందిన ఆటో డ్రైవర్ తిరుమలశెట్టి శ్రీనివాసులునాయుడు, కలికవాయి బిట్రగుంటకు చెందిన చేవూరి హరిబాబు, వెంకటరత్నంలను సీఐ ఫిరోజ్ అరెస్టు చేశారు. తర్వాత వారిని విచారిస్తే అన్ని నిజాలు చెప్పారు.

యువతి జీవితం ఎన్నో మలుపులు
అలా యువతిని ఆ రొంపి నుంచి రక్షించారు. భర్తతో ఏర్పడ్డ తగాదాలు, ఆర్థిక పరిస్థితులు, తప్పుడు మనుషుల పరిచయంతో ఆ యువతి జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. అయిన వారు కదా అని బంధువును నమ్మింది. ఆమెనేమో తన సోదరి కష్టాలు తీరుస్తుందని, ఆమెను నమ్ముకుంటే మంచిరోజులు వస్తాయని నమ్మించింది.

ఒక్కసారి తప్పటడుగు వేస్తే జీవితాంతం కష్టాలు
అనంతరం ఆమెను వ్యభిచారకూపంలోకి దింపి క్యాష్ చేసుకుంది. ఆ యువతి మాత్రం చాలా కష్టాలు అనుభవించింది. తెలియక రొంపిలోకి దిగినా తర్వాత బయటకు వచ్చేందుకు ఆమెకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. జీవితంలో ఒక్కసారి తప్పటడుగు వేస్తే జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications
