రియల్ లైఫ్ స్టోరీస్: తన కొడుకును తెల్లగా మార్చేందుకు రోజూ రాయితో రుద్దుతున్న మహిళ

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

తెల్లటి చర్మం కోసం ఆరాటపడే వారు మార్కెట్లో లభ్యమయ్యే అనేక ఫెయిర్నెస్ క్రీమ్స్ ను ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఫెయిర్ స్కిన్ కోసం ఆరాటపడే తత్త్వంలో విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతామని ఈ ఇన్సిడెంట్ స్పష్టం చేస్తోంది.

చదువుకున్న మహిళ ఫూల్ లా బిహేవ్ చేస్తూ తెల్లటి చర్మం కోసం ఆచరించిన పద్ధతులు ఒళ్ళు గగుర్పొడుస్తాయి. ఆ సంఘటనను మీకిప్పుడు వివరిస్తున్నాము.

Mum Used Stone To Scrub Her Sons Skin To Make Him Fair

ఫెయిర్ గా మార్చేందుకు తన కొడుకు ముఖాన్ని రాయితో స్క్రబ్ చేసిన మహిళతన కొడుకును తెల్లగా మార్చేందుకు తన కొడుకు ముఖాన్ని నల్లటి రాయితో రుద్దుతూ వస్తోంది. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు మీకోసం.

ఇండియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది

ఇండియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది

ఈ వింత సంఘటన భోపాల్ లో చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఐదేళ్ల కుమారుడిని ప్రతి రోజూ నల్లటి రాయితో రుద్దుతోంది. ఆ బాలుడిని తెల్లగా మార్చేందుకు తాపత్రయపడుతోంది.

దత్తతపుత్రుడు

దత్తతపుత్రుడు

ఆ బాలుడు ఆ మహిళకు స్వంత కుమారుడు కాదు. ఉత్తరాఖండ్ కు చెందిన ఒక జంట వద్ద నుంచి ఈ బాలుడిని ఈ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ బాలుడిని దత్తత తీసుకున్నప్పటి నుంచి దత్తత తీసుకున్న పెంపుడు తల్లి సంతోషంగా లేదు. బాలుడి కాంప్లెక్షన్ విషయమై ఈవిడ ఆవేదన చెందుతూ ఉండేది. ఎలాగైనా, ఈ బాలుడిని తెల్లగా మార్చాలని ఆశపడుతూ ఉండేది.

బాలుడిని తెల్లగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేసింది

బాలుడిని తెల్లగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేసింది

కొన్ని నెలల నుంచి ఈ బాలుడి స్కిన్ టోన్ ని లైట్ గా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈలోపు ఒక వ్యక్తి నుంచి ఈమెకు ఈ సలహా అందింది. నల్లటి రాయితో రుద్దితే తెల్లగా మారతారని భావించిన ఈ మహిళ అప్పటినుంచి బాలుడిని ప్రతి రోజూ నల్లటి రాయితో రుద్ది హింసిస్తోంది.

ఆమెను అరెస్ట్ చేశారు

ఆమెను అరెస్ట్ చేశారు

ఈ మహిళ యొక్క మేనకోడలు ఈ సంఘటనను చూసి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియచేసింది. పోలీసుల దృష్టికి ఈ విషయం రావడంతో ఈ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడిని మానసికంగా అలాగే శారీరకంగా హింసించడం వలన దత్తత తీసుకున్న మహిళ జైలుపాలైంది. ఆ బాలుడి ఒంటినిండా ఉన్న బొబ్బలు ఇంకా ఆమె అరాచకాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి.

ఇటువంటి మరొక సంఘటన

ఇటువంటి మరొక సంఘటన

తమ చిన్నారి తెల్లగా ఉండాలని ప్రయత్నిస్తున్న వారు విచక్షణాహీనంగా ప్రవర్తిస్తున్నారని అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి భయంకరమైన సంఘటనే మరొక చోట చోటుచేసుకుంది. చిన్నారిని సంరక్షించవలసిన కేర్ టేకర్ చిన్నారిని వాషర్ లో పడేసి స్పిన్నర్ ని రన్ చేశాడు. అలా చేస్తే చిన్నారి తెల్లగా మారుతుందని భావించాడట. అయితే, ఈ సంఘటనలో చిన్నారికి అనేక ఫ్రాక్చర్స్ జరిగాయి.

ఇండియాలో ఫెయిర్ నెస్ కై ఎందుకు ప్రాకులాడుతున్నారు?

ఇండియాలో ఫెయిర్ నెస్ కై ఎందుకు ప్రాకులాడుతున్నారు?

ఇటువంటి బాధాకరమైన సంఘటనలు మనసును దిగులుపరుస్తాయి. ఫెయిర్ స్కిన్ కోసం ఇంతగా పాకులాడటం ఎందుకన్న ఆలోచనను కలిగిస్తాయి. తెల్లటి చర్మం కోసం పడే ఆరాటం వలెనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. కిందనున్న కామెంట్ సెక్షన్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

English summary

Mum Used Stone To Scrub Her Son's Skin To Make Him Fair

We Indians are so obsessed with fair skin that we wish to try the latest product to seem fair. No wonder, the fairness crème markets are booming throughout the year! Here, we bring to you a weird case of a woman who is educated and yet proved to be a fool when it came to her fair skin obsession!