For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనకు సంతృప్తి ఉన్న లింగంలోకి కావాల్సినన్నీ సార్లు మారారు

నాకు నచ్చినట్లుగా ఉండడం తప్పా. నేను ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు కదా. మరీ నాతో మాట్లాడడానికి మా వాళ్లకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు.

By Bharath
|

ప్రతి వ్యక్తి ఇప్పుడు తనకు నచ్చినట్లుగానే బతుకుతున్నాడు. దేవుడు మనల్ని సృష్టినట్లుగా కాకుండా రూపాన్ని మార్చుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్లు ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఆకారాలు మార్చుకుంటున్న విషయం మనందరికీ తెలుసు.

మూడుసార్లు మార్చుకున్నారు

మూడుసార్లు మార్చుకున్నారు

అయితే ఒక వ్యక్తి ఏకంగా మూడు సార్లు తన జెండర్ ను మార్చుకున్నాడు. అతని పేరు రియా కూపర్. బ్రిటన్ చెందిన రియా మొదట మహిళగా మారారు. తర్వాత మళ్లీ జెండర్ మార్చుకున్నారు. మళ్లీ తర్వాత లింగమార్పిడి చేయించుకున్నారు. మూడు సార్లు ఇలా లింగమార్పిడి చేయించుకుని వార్తల్లో నిలిచారు. అసలు రియా కూపర్ కథ ఏమిటో ఒకసారి చూడండి.

మొదట ఆడ లక్షణాలు

మొదట ఆడ లక్షణాలు

12 ఏళ్ళ వయస్సులో రియాలో ఆడ లక్షణాలు మొదలయ్యాయి. ఆడవారిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఇతను. ఆడవారిలాంటి దుస్తులు వేసుకోవాలనుకునేవాడు. అచ్చం ఆడవారిలా మారాలనుకున్నాడు. దానికోసం సర్జరీ చేయించుకుందామనుకున్నాడు.

ఆడ నుంచి మగ వ్యక్తిలా

ఆడ నుంచి మగ వ్యక్తిలా

15 ఏళ్ల వయస్సులో రియా మగ నుంచి ఆడమనిషిలా మారేందుకు సర్జరీ చేయించుకున్నాడు. అంతేకాకుండా హార్మోన్ల చికిత్స కూడా చేయించుకునన్నాడు. ఆడవారిలాగానే తన శరీరంలో అన్ని మార్పులు కలిగిలే చేయించుకున్నాడు. మొత్తానికి సంపూర్ణంగా ఆడమనిషిలాగా మారిపోయాడు రియా.

గే లాగా మారాలనుకున్నాడు

గే లాగా మారాలనుకున్నాడు

అయితే తన 18వ ఏట ఇతను మరో నిర్ణయం తీసుకున్నాడు. తాను ఆడమనిషిలాగా కూడా పనికిరానని నిర్దారించుకున్నాడు. తాను "గే" లా మారాలనుకున్నాడు. ఆడ, మగకాకుండా ఉండే మధ్యలో ఉండే జెండర్ లోకి తాను వెళ్లాలనుకున్నాడు. తనకు ఆ జెండరే కరెక్ట్ అనుకున్నాడు రియా.

గే నుంచి మళ్లీ మహిళగా

గే నుంచి మళ్లీ మహిళగా

గే లాగా రియా కూపర్ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. మళ్లీ తాను మహిళగా మారాలనుకున్నాడు. అందుకోసం మళ్లీ సర్జరీ చేయించుకుని ఆడమనిషిలాగా మారుదామనుకున్నాడు. వెంటనే సర్జరీ చేయించుకుందామనుకున్నాడు.

మొత్తానికి మూడుసార్లు

మొత్తానికి మూడుసార్లు

మళ్లీ డాక్టర్లని సంప్రదించి తనను మహిళగా మార్చమని కోరాడు. దీంతో గే నుంచి అతన్ని మళ్లీ ఆడమనిషిగా మార్చారు. మొత్తానికి మూడు సార్లు ఇలా ఒక వ్యక్తి లింగాన్ని మార్చుకున్నారు. మొదట ఈయన పుట్టినప్పుడు మగ వ్యక్తి. తర్వాత ఆడమనిషిగా మారాడు. అనంతరం ఆడ నుంచి గే లా మారాడు. గే నుంచి మళ్లీ ఆడమనిషిగా మారాడు.

ఎంతో ఆనందంగా ఉన్నా

ఎంతో ఆనందంగా ఉన్నా

ఇప్పుడు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని రియా కూపర్ చెప్పారు. అయితే ఒకవేళ మళ్లీ ఎప్పుడైనా తనకు తన జెండర్ విషయంలో అసంతృప్తి కలిగితే ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు.

ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు

ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు

అయితే ఇంట్లో వారు తనని ఇలా చూడడం ఇష్టం లేక తనతో మాట్లాడడం లేదన్నారు. తాను మాత్రం తనకు నచ్చినట్లుగానే ఉంటున్నానని చెప్పారు. తమ ఇంట్లో వారు మాత్రం తనను ఒక పురుషుడిగానే చూడాలని భావిస్తున్నారన్నారు.

నాకు నచ్చిన జెండర్ లో బతుకుతున్నా

నాకు నచ్చిన జెండర్ లో బతుకుతున్నా

నేను నాకు నచ్చిన జెండర్ లోకి మారేందుకు ఇప్పటి వరకు మూడుసార్లు సర్జరీలు చేయించుకున్నాను. ఇలా చేయించుకోవడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ మా ఇంట్లో వారికి, మా బంధువులకు ఫ్రెండ్స్ కు మాత్రం నేను ఇలా ఆపరేషన్లు చేయించుకోవడం అస్సలు నచ్చలేదు.

నేను ఏమి అన్యాయం చేశాను

నేను ఏమి అన్యాయం చేశాను

నాతో ఎవ్వరూ కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. నేను కూడా ఒక మనిషినే కదా. నాకు నచ్చినట్లుగా ఉండడం తప్పా. నేను ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు కదా. మరీ నాతో మాట్లాడడానికి మా వాళ్లకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు.

ఎవరికి నచ్చినట్లుగా వారు ఉండొచ్చు

ఎవరికి నచ్చినట్లుగా వారు ఉండొచ్చు

ఈ సమాజంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండొచ్చు. అందులో తప్పు ఏముంది. నాకు నచ్చినట్లుగా నా డబ్బులతో సర్జరీలు చేయించుకుంటే వాళ్లకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. మీరన్నా నన్ను అర్థం చేసుకోండి. ఒకవేళ నాకు ఈ జెండర్ ఆనందాన్ని ఇవ్వకపోతే నేను మళ్లీ పురుషుడిలా మారొచ్చు.

All Images Source :https://www.instagram.com/ria_coop/

English summary

ria cooper britains youngest transgender patient changed gender for the third time

ria cooper britains youngest transgender patient changed gender for the third time
Desktop Bottom Promotion