Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
యువతిపై మూడురోజుల పాటు అత్యాచారం చేసిన రౌడీ షీటర్
వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ అమీర్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. ఆటో నడుపుతుంటాడు. అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న..తన ఇంటికి సమీపంలో ఉండే యువతిపై అత్యాచారం.
యువతిపై మూడు రోజులపాటు అత్యాచారం చేశాడు ఓ రౌడీషీటర్ తర్వాత పోలీసు స్టేషన్ ఎదుటే హల్‌చల్ చేశాడు. అతనికి భయపడి ఇంట్లోనే కుమిలిపోతున్న బాధితురాలు స్థానికులిచ్చిన మనోధైర్యంతో డీసీపీకి ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పరారీలో ఉండటంతో అతని బావను స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఫూటుగా మద్యం తాగి
ఈ విషయం తెలుసుకున్న అమీర్ ఫూటుగా మద్యం తాగి స్టేషన్‌కు వచ్చాడు. ఓ చేతిలో బ్లేడు పట్టుకుని ఠాణా ఎదుటే మద్యం తాగుతూ పోలీసులను దుర్భాషలాడాడు. బ్లేడుతో చేయి కోసుకున్నాడు. అరెస్టు చేస్తే గొంతు కోసుకుంటానని బెదిరిస్తూ..మూడు గంటలపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. మొత్తానికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

వివాహమై ముగ్గురు పిల్లలున్నారు
వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ అమీర్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. ఆటో నడుపుతుంటాడు. అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న..తన ఇంటికి సమీపంలో ఉండే యువతిని తనను పెళ్లి చేసుకోమని వేధించేవాడు. లేదంటే తల్లిదండ్రులను చంపేస్తానంటూ యువతికి తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసేవాడు.

తల్లి కళ్లెదుటే యువతిపై అత్యాచారం
ఆమె మాట వినకపోయేసరికి ఇంట్లోకి ప్రవేశించి యువతి తల్లిపై దాడి చేశాడు. ఆ తల్లి కళ్లెదుటే యువతిపై అత్యాచారం చేశాడు. ఇలా 3 రోజులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎదురుతిరిగిన యువతి తల్లిని కొట్టాడు.

2016 నుంచి వేధింపులు
కాగా అమీర్‌పై పలు కేసులుండటంతో అతడిపై చిలకలగూడ పోలీసులు రౌడీషీట్‌ను తెరిచారు. 2015లో పీడీ యాక్ట్ కేసులో జైలుకెళ్లిన అమీర్ తిరిగి 2016లో వచ్చాడు. అప్పటి నుంచి యువతిని తీవ్రంగా వేధిస్తున్నాడు.

స్థానికులు ఇంట్లోకి వచ్చారు
వరుసగా మూడు రోజులుగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ అతడు ఇటీవల మళ్లీ ఇంట్లోకి ప్రవేశించడంతో పెంపుడు కుక్క అరిచింది. ఆగ్రహంతో అమీర్ దాన్ని కొట్టడంతో కుక్క అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వచ్చారు. దీంతో అక్కడి నుంచి అమీర్ జారుకున్నాడు.

చంపేస్తానంటూ యువతికి బెదిరింపులు
స్థానికులతో కలిసి బాధిత యువతి చిలకలగూడ ఠాణాకెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును నమోదు చేసి.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తర్వాత కాగా కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తానంటూ యువతిని అమీర్ ఫోన్లో బెదిరించాడు. యువతి తనపై తప్పుడు కేసు బనాయించిదని ఆరోపిస్తూ స్టేషన్ ఎదుట మద్యం తాగుగూ తన చేతులను బ్లేడ్‌తో కోసుకున్నాడు. మొత్తానికి పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.



Click it and Unblock the Notifications
