For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి సమాధి పేరుతో సంజయ్ దత్ 308 మందితో సెక్స్ చేశాడు, అందరినీ నలిపేశాడు, ఆరుగురి టాఫ్ హీరోయిన్లనూ!

|
sanjay dutt would take his 308 girlfriends to mother’s fake grave that is his trick

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంతటా మారిపోతున్న పేరు.. సంజయ్ దత్‌. సంజయ్ దత్ బయోపిక్ సంజు మూవీ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. ఇక సినిమా కూడా బాగుందని మంచి టాక్ వచ్చింది. సంజ్ లో రణబీర్ కపూర్ తనకు 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని చెబుతారు. దాంతో ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది.

రాకీ’తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌

రాకీ’తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌

సంజయ్‌ దత్‌ జీవితమే ఓ పక్కా కమర్షియల్‌ సినిమా. ఎందుకంటే సునీల్‌దత్‌ వారసుడిగా సులువుగా చిత్రసీమలో అడుగుపెట్టడం, తొలి చిత్రం ‘రాకీ'తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సంజయ్‌‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, గెలుపోటములు చవిచూడాల్సి వచ్చింది. సినిమాల పరంగా మాత్రంగానే కాదు చాలా విషయాల్లో సంజయ్ దత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

మత్తుకు అలవాటుపడ్డాడు

మత్తుకు అలవాటుపడ్డాడు

మాదకద్రవ్యాలకు అలవాటుపడటంతో సంజయ్‌ జీవితం తలకిందులుగా మారిపోయింది. ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడిగా ఎదుగుతూ..వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న తరుణంలో సంజయ్‌ మత్తుకు అలవాటుపడ్డాడు. దాని నుంచి బయటపడటానికి ఆయన పడిన పాట్లు చాలానే ఉన్నాయి.

యుధాలు కలిగున్న కేసు

యుధాలు కలిగున్న కేసు

ఆ అలవాటు నుంచి బయటపడ్డాక అక్రమ ఆయుధాలు కలిగున్న కేసు సంజు మెడకు చుట్టుకుంటుంది. ఇలా తన నిజజీవితంలో సంజయ్ దత్ ఎన్నో కష్టాలు అనుభవించాడు. ముంబై పేలుళ్ల కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. ఇక సంజయ్ దత్ గర్ల్స్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే..

ఆరుగురితో డేటింగ్

ఆరుగురితో డేటింగ్

సంజయ్ దత్‌కు మొదటి గర్ల్ ఫ్రెండ్ టినా మునిమ్. వీళిద్దరూ చాలాకాలం పాటు డేటింగులో వున్నారు. ఆ తర్వాత రియా పిళ్లైతో కొన్నాళ్లు కలిసి వున్నాడు. ఆ తర్వాత అతడి జీవితంలోకి రిచా శర్మ వచ్చింది. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు.

సంజ్ కు ఎఫైర్

సంజ్ కు ఎఫైర్

ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటీమణులతో లింకులున్నట్లు గాసిప్స్ కూడా వచ్చాయి. మాధురీ దీక్షిత్, లిసా రాయ్, రేఖలతో కూడా సంజ్ కు ఎఫైర్ ఉంది. మొత్తానికి ఆరుగురు బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో అప్పట్లో సంజుకు ఎఫైర్ ఉండేది. చివరిగా మాన్యతా దత్ ను పెళ్లాడి గర్ల్ ఫ్రెండ్స్ లిస్టుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

308 మంది అమ్మాయిలు పడిపోయారా

308 మంది అమ్మాయిలు పడిపోయారా

అయితే కొన్ని రోజుల క్రితం సంజయ్‌ దత్‌ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి అందరి మనసుల్లో ఒకటే అనుమానం...ఏం చూసి ఈ ‘ఖల్‌నాయక్‌'కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా అని. అయితే ఈ సందేహాలకు ‘సంజు' చిత్ర దర్శకుడు రాజ్‌ కుమార్‌ హీరానీ సమాధానం చెప్పారు.

తన తల్లి సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు

తన తల్లి సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు

తనతో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని సంజయ్‌ ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్‌ అయ్యి సంజయ్‌కు మరింత దగ్గరయ్యేది.

వదిలేసిన అమ్మాయిల మీద పగ

వదిలేసిన అమ్మాయిల మీద పగ

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ సమాధి సంజయ్‌ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు' అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్‌కుమార్‌ హీరానీ. తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్‌.

కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట

కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట

ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్‌ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్‌ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్‌ చేసి ఉంది. సంజయ్‌ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్‌ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్‌ సంబంధాలు నడిపాడంట. వీరిలో కొందరు హీరోయిన్లు సంజయ్‌ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు.

ఎవ్వరినీ వదల్లేదట

ఎవ్వరినీ వదల్లేదట

సంజయ్ దత్ తనలో పరిచయం ఉన్న ఏ హీరోయిన్ ని కూడా వదలలేదట. హీరోయిన్ లను , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను , సీనియర్ నటీమణులను అలాగే డ్యాన్సర్ లను , సినిమా అంటే ఇష్టం ఉన్న అందమైన భామలను , మోడల్ లను ఎవరినీ వదలలేదట మొత్తంగా మూడు వందల ఎనిమిది మంది తో రొమాన్స్ చేశాడట.

పెద్ద హీరోయిన్లను కూడా

పెద్ద హీరోయిన్లను కూడా

తనకంటే చాలా పెద్ద వాళ్ళైనా హీరోయిన్ లను , కుర్ర హీరోయిన్ లను అస్సలు విడిచి పెట్టలేదట. మొత్తానికి వాళ్ళని ఇంప్రెస్ చేసి బెడ్ వరకూ తీసుకెళ్లి అనుభవించాడట సంజయ్ దత్ . సెక్స్ కి మాత్రమే కాకుండా డ్రగ్స్ కి కూడా బాగా ఎడిక్ట్ అయ్యాడు సంజయ్ దత్ . అయితే ఇదంతా ఇప్పుడు కాదు. సంజయ్ దత్ మంచి స్టార్ డమ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి.

డ్రగ్స్ వల్లే అక్రమ సంబంధాలు

డ్రగ్స్ వల్లే అక్రమ సంబంధాలు

ఇక తన భార్యతో కాకుండా వేశ్యలతో కలిపి సుమారు 350 మందికి పైగా సెక్స్ లో పాల్గొన్నాడట సంజయ్. అయితే తనకు మాత్రం 308 మందితో సెక్స్ లో పాల్గొన్నట్లు గుర్తుంది అని సంజ్ మూవీలో సంజయ్ గురించి చూపిస్తారు.

అక్రమ సంబంధాలు

అక్రమ సంబంధాలు

సంజయ్‌ దత్‌ డ్రగ్‌ అడిక్ట్‌ అన్నది నిజమే. ఈ విషయాన్ని సంజయ్‌ దత్‌ కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకున్నాడు. 'అమ్మాయిలతో అక్రమ సంబంధాలు' కూడా ఆ డ్రగ్స్‌ కారణంగానే ఏర్పడ్డాయని చెబుతాడు.

నా భర్త చాలా మంచోడు

నా భర్త చాలా మంచోడు

అయితే సంజయ్ దత్ భార్య మాన్యతా దత్‌ మాత్రం " నా భర్త చాలా మంచోడు' అని సమాధానమిస్తుంది. ఏ వ్యక్తీ పూర్తిగా నిజాయితీపరుడని చెప్పలేం. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులుంటాయి. నా భర్త కూడా అంతే. సినీ పరిశ్రమలో హీరోయిన్లతో సన్నిహిత సంబంధాలు సహజమే. డేటింగ్‌ వంటివి సినీ పరిశ్రమలో మామూలే. సినిమా వాళ్ళకే కాదు. డేటింగ్‌ అనేది సర్వసాధారణమే. ఈ విషయంలో సంజయ్‌ దత్‌ని మాత్రమే తప్పుడు వ్యక్తిగా చూడడం మంచిది కాదు " అని మాన్యత కొన్ని రోజుల క్రితం అన్నారు.

అందరి మగాళ్ల మాదిరిగానే ప్రవర్తించాడు

అందరి మగాళ్ల మాదిరిగానే ప్రవర్తించాడు

"నా భర్త సంజయ్‌ దత్‌ ఎలాంటోడో నాకు తెలుసు. నాకే కాదు, బాలీవుడ్‌లో అందరికీ తెలుసు. కేసుల గురించి మాట్లాడను. కొన్ని పొరపాట్లు సంజయ్‌ దత్‌ చేసిన మాట వాస్తవం. చేసిన పొరపాట్లకీ, చెయ్యని తప్పులకీ శిక్ష అనుభవించేశాడు. సంజయ్‌ దత్‌కి సంబంధించి నాకు తెలియని సెక్సీ సీక్రెట్స్‌ అంటూ ఏమీ లేవనే అనుకుంటున్నాను." అని మాన్యత చెప్పింది. ఇలా తన భర్త సంజయ్ దత్ అందరి మగాళ్ల మాదిరిగానే ప్రవర్తించాడు.. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని మాన్యత వెనకోసుకొచ్చింది.

English summary

sanjay dutt would take his 308 girlfriends to mother’s fake grave that is his trick

sanjay dutt would take his 308 girlfriends to mother’s fake grave that is his trick
Story first published: Friday, June 29, 2018, 16:44 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more