Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..
సోనాలి బింద్రేపై ఇంత ప్రేమనా? మీ ప్రేమతోనే ఆమె మళ్లీ కచ్చితంగా కోలుకుంటుంది! నాగార్జున కూడా ట్వీట్
సినీ సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
సినీ సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులనుద్దేశించి చెప్పారు. తనకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా సపోర్ట్‌గా ఉన్నారనే విషయం కూడా తెలిపింది. సోనాలి క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే చేదు నిజం తెలుసుకున్న అభిమానులు షాక్ లో ఉన్నారు. కాగా పలువురు ప్రముఖులు ఆమె కోలుకోవాలని కోరుతూ ట్వీట్స్ చేశారు. అక్కినేని నాగార్జున, రితేశ్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహర్, అర్జున్ కపూర్, మధుర్ బండార్కర్, దివ్య, సోఫియా, నేహా ధూపియా, వివేక్ ఒబేరాయ్ ఇలా చాలా మంది ప్రముఖులు ట్వీట్ చేశారు.
కేన్సర్ బారిన పడింది
తెలుగువారంతా ప్రేమించిన అపరంజి బొమ్మ సోనాలీ బెంద్రే (43) కేన్సర్ బారిన పడింది. అభిమానులందరి కంట తడి పెట్టించే ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. తాను హై గ్రేడ్ కేన్సర్‌తో బాధపడుతున్నానని.. అది శరీరమంతా పాకిందని.. ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నానని పేర్కొంది.
అభిమానులంతా షాక్ కు గురయ్యారు
సోనాలి బింద్రే కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలియడంతో ఆమె అభిమానులంతా షాక్ కు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్న సోనాలి.. మురారి, ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.
అందమైన హీరోయిన్
ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో టాప్ హీరోయిన్ గా నిలిచిన ఆమె చూడచక్కని అందం, అభినయంతో ఆకట్టుకుంది. సొనాలి బింద్రే వివాహనాంతరం సినిమాలకు దూరమైయ్యారు. సినిమాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
గోల్డీ బెహల్‌ని పెళ్లి చేసుకున్నారు
2002లో హిందీ దర్శక-నిర్మాత గోల్డీ బెహల్‌ని పెళ్లి చేసుకున్నారు సోనాలి. ఆ తర్వాత చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్' (2004)లో నటించారు. హీరోయిన్‌గా సోనాలి చేసిన చివరి సినిమా ఇదే. ఆ తర్వాత మరాఠీలో ‘అగ్ బాయీ అరేచ్చా', హిందీలో ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా' (2013) చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. ప్రస్తుతం ‘ఇండియాస్ బెస్ట్ డ్రేమ్‌బాజ్' అనే హిందీ టీవీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అనుకోని ఈ సంఘటన వల్ల ఈ షోని ఆమె డిస్‌కంటిన్యూ చేయాల్సి వస్తుంది.
క్యాన్సర్ సోకిందని తెలుసుకొని
ఇక ఆమెతో నటించిన స్టార్స్, సన్నిహితులు సోనాలికి క్యాన్సర్ మహమ్మారి సోకిందని తెలుసుకొని చింతించారు. క్యాన్సర్ మహమ్మారి నుంచి సోనాలి పూర్తిగా బయటపడి, ఆరోగ్యంగా ఇండియా తిరిగి రావాలని ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.త్వరలో ఆమె కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. క్యాన్సర్‌తో పోరాడి ఎలా అయిన గెలుస్తావని మేము నమ్ముతున్నాము. దేవుడు నీకు ఆ ఆత్మస్థైర్యము ఇవ్వాలని కోరుతున్నాము అంటూ పలువురు సెలబ్స్ ట్వీట్స్ చేశారు.

సోనాలి ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఫ్యామిలీతో న్యూయార్క్‌లో ఉండగా, విషయం తెలుసుకున్న ఆయన సోనాలి ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి ఆమెని పరామర్శించారట. సోనాలి ఫైటర్ అని నాకు తెలుసు. తప్పకుండా మంచి ఆరోగ్యంతో మనల్ని పలకరిస్తుంది అని అన్నారు అక్షయ్.
నాగార్జున స్పందించారు
సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడటంపై నాగార్జున స్పందించారు. ‘నువ్వు త్వరగా కోలుకోవాలని, నీ ఆత్మస్థైర్యానికి ఇంకా బలం చేకూరాలని ఆశిస్తున్నా'నంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరు కలిసి మన్మథుడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
న్యూయార్క్‌లో చికిత్స చేయించుకోవడం ద్వారా
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలా, అలనాటి తెలుగు హీరోయిన్ గౌతమి, లీసారేలు క్యాన్సర్ బారిన పడినా.. న్యూయార్క్‌లో చికిత్స చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను జయించారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. ఇదే తరహాలో సోనాలీ కూడా చికిత్స ద్వారా క్యాన్సర్‌ను జయించి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిద్దాం..



Click it and Unblock the Notifications
