అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అది చెయ్యాల్సిందే

Written By:
Subscribe to Boldsky

పెళ్లి పద్దతులు ఒక్కోప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటాయి. కొన్ని వివాహా ఆచారాలు చూస్తే నవ్వుకుంటాం. మరికొన్ని పెళ్లి పద్దతులను చూస్తే ఆశ్చర్యానికి గురవుతాం. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

భిన్న పద్ధతులు

భిన్న పద్ధతులు

అయితే ఎవరి ఆచార పద్ధతులను బట్టి వారు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. వివాహం జరిపించే విషయాల్లో భిన్న పద్ధతులను పాటిస్తుంటారు. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోరకంగా ఉంటుంది.

పెద్దలకు సెంటిమెంట్

పెద్దలకు సెంటిమెంట్

తరతరాలుగా తాము పాటిస్తున్న ఆచారాన్ని పాటించడం వల్ల దంపతులిద్దరూ సుఖంగా, సంతోషంగా ఉంటారని పెద్దలకు సెంటిమెంట్ ఉంటుంది. పెళ్లిలో పాటించే ఒక వింత ఆచారం గురించి తెలిస్తే.. ఇలాంటి ఆచారం కూడా ఉంటుందా అని అనుకుంటాం.

ఒక విషయంలో మెప్పించాలి

ఒక విషయంలో మెప్పించాలి

ఫిజీ దేశంలో తబువా అనే పేరుతో ఒక ఆచారం ఉంటుంది.

ఈ వివాహ తంతు కాస్త విచిత్రంగా వుంటుంది. ఫిజీ దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తండ్రిని ఒక విషయంలో మెప్పించాలి.

తిమింగలం దంతాన్ని ఇవ్వాలి

తిమింగలం దంతాన్ని ఇవ్వాలి

పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అతిపెద్ద తిమింగలం దంతాన్ని ఆ అమ్మాయి తండ్రికి అంటే కాబోయే మామగారికి ఇస్తేనే వారి పెళ్లి అవుతుంది. ఈ ఆచారాన్ని ఫిజీ దేశంలో తరతరాలుగా పాటిస్తున్నారు.

ఎంత ప్రేమ ఉందో అని...

ఎంత ప్రేమ ఉందో అని...

కాబోయే అల్లుడు తిమింగలం దంతాన్ని ఇస్తే తన కూతురు జీవితం బాగుంటుందని పెళ్లి కూతురు తల్లిదండ్రులు భావిస్తారు.

అలాగే చేసుకోబోయే భార్యపై అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో కూడా తెలుసుకునేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు.

అష్టకష్టాలు

అష్టకష్టాలు

దీంతో ఫిజీలోని యువకులు పెళ్లి చేసుకోవాలంటే తిమింగలం దంతాన్ని సంపాదించేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. తబువా పేరుతో కొనసాగే ఈ ఆచారం ఫిజీలో బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది.

అభినందనల్లో ముంచెత్తుతారు

అభినందనల్లో ముంచెత్తుతారు

తిమింగలం దంతాన్ని పెళ్లి కుమార్తె తండ్రికి ఇవ్వకపోతే పెళ్లి జరగదు. అందువల్ల ఫిజీలో పెళ్లి చేసుకునే యువకుల ముందుండే లక్ష్యం.. తిమింగల దంతం సంపాదించడం. ఇక పెళ్లిలో తిమింగలం దంతాన్ని వరుడు తన మామకు ఇస్తుంటే అందరూ వరుడిని అభినందనల్లో ముంచెత్తుతారు. ఒక్కొక్కరి ఆచారం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మనం తప్పుబట్టాల్సిన అవసరం కూడా లేదు.

Image Source

English summary

tabua or whale tooth a gift to the brides father from the groom

tabua or whale tooth a gift to the brides father from the groom
Story first published: Monday, April 9, 2018, 11:30 [IST]