For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవుడా! ఇతడు కనుగుడ్లు మరియు నోటి లోపల కూడా ఇంకు తో నింపేసాడు

By R Vishnu Vardhan Reddy
|

ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది సంచలనాల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. వికారమైన పనులు చేస్తూ , తమను తామే వికారంగా మలుచుకొని అందర్నీ ఆశ్చర్య పరచాలని ఉవ్విలూరుతున్నారు. ఇలా చేసేటప్పుడు వారు ఒక్కసారి కూడా ఆలోచించారా ? అని వారిని చూస్తే ఎవ్వరికైనా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులను ఈ మధ్య కాలంలో తరచూ అంతర్జాలంలో చూస్తూనే ఉన్నాం. వారిని చూసినప్పుడు మొదట ఆశ్చర్యపోయి, ఆ తర్వాత అసలు వీరికి ఏమైంది అని అనిపించకమానదు.

అటువంటి విషయం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎలి ఇంక్ అనే వ్యక్తి తన వికారమైన పనుల ద్వారా ప్రపంచానికే మతిపోయేలా చేసాడు. తన యొక్క కనుగుడ్లు మరియు నోటిలోపల ఇంకు తో నింపేసాడు.

ఎలి ఇంక్ :

ఎలి ఇంక్ :

శరీరం పై టాటూల ను వేయించుకోవడమే అతనికి ఒక వ్యసనంలా మారింది. దీంతో అతడు తన శరీరం మొత్తానికి నల్లటి ఇంకు తో వివిధరకాల బొమ్మలను వేపించుకున్నాడు. అందులో భాగంగానే కనుగుడ్లు, నోటి లోపల కూడా ఇంకు తో నింపేసాడు.

మరికొన్ని విషయాలు ఏమిటంటే :

మరికొన్ని విషయాలు ఏమిటంటే :

ఎలి చిన్నగా ఉన్నప్పుడే అతడిలో ఈ రకమైన వింత కోరిక ఎక్కువైంది.

ఇంగ్లాండ్ దేశంలోని బ్రిగ్టోన్ ప్రాంతానికి చెందిన ఎలి, ఒక బొమ్మలు వేసే కళాకారుడు. తన శరీరాన్ని మార్చుకోవాలని కోరిక అతడికి చాలా చిన్నవయసు నుండే ప్రారంభం అయ్యింది. అందుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇతని సమీప బంధువు ఒకాయన స్పెయిన్ నుండి తిరిగి వస్తూ ఒక పెద్ద గిరిజన బొమ్మని తన శరీరం పై వేయించుకున్నాడు. దీంతో ఎలి కూడా అలానే ఏదైనా చేయాలని భావించాడు.

10 సంవత్సరాలకు ముందు నుండి తనలో ఈ పరివర్తన మొదలైంది :

10 సంవత్సరాలకు ముందు నుండి తనలో ఈ పరివర్తన మొదలైంది :

ఎలి లో ఈ పరివర్తన 10 సంవత్సరాలకు ముందు నుండే మొదలైంది. ఈ ప్రపంచంలో తాను తప్ప మరే వ్యక్తిగాని శరీరంలో జరిగే మార్పును అర్ధం చేసుకోలేడని తరచూ చెబుతుంటాడు.

ఇతడు తన శరీరం పైనే పనిచేస్తూ ఉంటాడు :

ఇతడు తన శరీరం పైనే పనిచేస్తూ ఉంటాడు :

నివేదికల ఆధారంగా తెలిసిన విషయం ఏమిటంటే, గత పది సంవత్సరాలుగా ఇతను తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చి దిద్దుకొనే పనిలో భాగంగా రూపాంతరం చెందుతున్నాడు. తన మొత్తం శరీరాన్ని ఇంకుని ఉపయోగించి వివిధరకాలుగా మార్చేయాలని భావించినా, అది పూర్తిగా పూర్తి అవ్వలేదు. కానీ, తన ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఫలితాలు మాత్రం ఎందరినో ఆశ్చర్యపరిచేవిలా ఉన్నాయి.

తనకు తానే బొమ్మలు వేసుకున్నాడు :

తనకు తానే బొమ్మలు వేసుకున్నాడు :

నల్లటి ఇంకుని ఉపయోగించి తన శరీరం పై వివిధరకాల బొమ్మలను వేసుకోవడం జరిగింది. అంతే కాకుండా తన కనుగుడ్లకు కూడా డై వేసుకున్నాడు. వీటికితోడు ముక్కు మరియు క్రింది పెదవికి అమర్చిన స్ట్రెచర్లు ను పెట్టుకున్నాడు.

పికాసో కి ఇతడు ఒక గొప్ప అభిమాని :

పికాసో కి ఇతడు ఒక గొప్ప అభిమాని :

తాను పికాసో కి ఒక గొప్ప అభిమాని అని ప్రపంచానికి ఎప్పుడు ఎలి చెబుతూ ఉంటాడు. తన శరీరం పై తాను చేసుకున్న కళాత్మక పనులన్నీ కూడా పికాసో ని చూడటం ద్వారా పొందిన ప్రేరణ వల్ల ఇదంతా చేయగలిగామని చెబుతాడు.

కంటికి టాటూ వేసుకోవడం చాలా ప్రమాదకరం :

తన నోటి లోపల మరియు కనుగుడ్ల కు ఎలి ఇంకు ని ఉపయోగించి మొత్తం నల్లగా మార్చేశాడు. కానీ, కను గుడ్లకు టాటూ లను వేయడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇలా చేస్తున్న సమయంలో కంటి లోని రెండు పొరల మధ్య ఇంకుని ఎక్కించాల్సిన అవసరం ఉంది. అలా చేసిన తర్వాత, ఆ ఇంకు కంటి లోపల వ్యాపిస్తుంది. కానీ, ఈ వ్యవహారం చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు.

ఈ వికారమైన మనిషిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ? మీకు ఇతడు నచ్చాడా లేక బయపెడుతున్నాడా ? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మరచిపోకండి.

Instagram

Read more about: life bizarre weird facts లైఫ్
English summary

Man Who Got Himself Inked Completely

Eli Ink, 27, has tattooed most of his body black, including his eyeballs and mouth. According to reports, he wishes to cover his body black before adding white over it. He said, "I want to look like an abstract character in one of Picasso's paintings!" And he further added that he will "never be finished" and wants to look "beautiful!"
Story first published: Thursday, March 8, 2018, 17:30 [IST]