అతను బిక్షగాడే.. కానీ నెలకు ముప్పై వేల ఆదాయం.. ముగ్గురు భార్యలు

Written By:
Subscribe to Boldsky

అది జార్కండ్ లోని చక్రాధర్పూర్ రైల్వే స్టేషన్. అక్కడ రోజూ వేలాది మంది వ్యక్తులు మనకు కనపడుతుంటారు. అక్కడికి వచ్చేవారంతా ప్రయాణికులే ఉంటారు. కానీ రోజూ అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతూనే ఉంటాడు. అతనే చోటు బరిక్.

బిక్షగాడైనా స్మార్ట్ మొబైల్

బిక్షగాడైనా స్మార్ట్ మొబైల్

అతని మెడలో ఒక సంచి, జేబులో ఒక స్మార్ట్ మొబైల్ ఉంటుంది. అంతేకాదు ఒక కార్పొరేట్ ఉద్యోగికి వచ్చేం జీతం అతనికి వస్తుంది.

మరి రోజూ రైల్వే స్టేషన్ లో అతడు ఏం చేస్తాడనే కదా మీ డౌట్.. అతను అక్కడ భిక్షాటన చేస్తాడు. అన్నిరకాలుగా మొత్తానికి నెలకు రూ. 30,000 ఆదాయం అతనికి వస్తుంది.

ముగ్గురు భార్యలు

ముగ్గురు భార్యలు

అతనికి ముగ్గురు భార్యలు. అంతేకాదు అతనికి చిన్న దుకాణం కూడా ఉంది. ఇతను వెస్టేజ్ అనే సంస్థలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఇది ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ సంస్థ.

ఫోన్ లోనే మెయింటైన్

ఫోన్ లోనే మెయింటైన్

ఈ 40 ఏళ్ల వ్యక్తి బిక్షాటనే కాదు.. తన చిన్నపాటి వ్యాపారం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు మధ్యమధ్యలో అతని కుటుంబ సభ్యులతో టచ్ లో ఉంటాడు. వారికి ఎప్పటికప్పుడూ ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటాడు.

నాలుగు లక్షల ఆదాయం

నాలుగు లక్షల ఆదాయం

మొత్తానికి ఏడాదికి రూ. 4 లక్షల దాకా ఇతను సంపాదిస్తాడు. ఇక తన ఆదాయంతో సిమ్దేగా జిల్లాలోని బండి గ్రామంలో ఒక చిన్న స్టీల్ సామాన్లు, కిచెన్ కు అవసరమైన వస్తువుల షాప్ ను ఓపెన్ చేశాడు. దాన్ని ఈయన ముగ్గురు భార్యలలో ఒక ఆమె నిర్వహిస్తూ ఉంది.

ఫ్యామీలీ హ్యాపీ

ఫ్యామీలీ హ్యాపీ

మొత్తానికి ఈయన, ఈయనపై ఆధారపడిన వారంతా హ్యాపీగా బతుకుతున్నారు. వెస్టేజ్ కు ఇతను డీలర్ కూడా. నువ్వు నిజంగానే డీలర్ వా అని అడిగితే అవునని తన దగ్గరున్న ఐడీ కార్డు కూడా చూపుతాడు.

నిజాయితీగా బతుకుతున్నా

నిజాయితీగా బతుకుతున్నా

వ్యక్తిగతంగా చాలా పద్ధతులు పాటిస్తాడు చోటు. తాను ఎలాంటి తప్పు చేయకుండా నిజాయితీగా జీవిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాడు చోటు. తన భార్యలను, పిల్లలను చాలా బాగా చూసుకుంటానంటున్నాడు ఈయన.

జీవితాన్నిచ్చిన రైల్వే ప్లాట్ ఫామ్

జీవితాన్నిచ్చిన రైల్వే ప్లాట్ ఫామ్

వికలత్వం కారణంగా ఏ పని చేయలేక చిన్నప్పుడే బిక్షాటన లోకి దిగానన్నారు. అంతేకాకుండా తాను చాలా పేదరికంలో పుట్టానని.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైల్వే ప్లాట్ ఫామ్ తన జీవితానికి భరోసానిచ్చిందంటారు ఈయన.

రోజుకు వెయ్యి

రోజుకు వెయ్యి

చాలా ఏళ్లుగా తాను ఇదే రైల్వే స్టేషన్ లో యాచిస్తున్నానన్నారు. ఇక అతని రోజువారీ ఆదాయం ఇప్పడు రూ. 1,000. తన ముగ్గురు భార్యల ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు చోటు. తాను తరుచుగా ఇంటికెళ్లి భార్యల మంచిచెడ్డలు చూసుకుంటానన్నాడు.

ఇతనే ఆదర్శం

ఇతనే ఆదర్శం

అన్నీ అవయవాలు సక్రమంగా.. అవకాశాలుండి కూడా చాలా మంది చేసే వృత్తిపై, పనిపై ధ్యాస పెట్టకుండా పక్కన వాడి గురించి ఆలోచిస్తూ బతికే వారికి చోటు ఆదర్శం. మనం అలా బతకాలని కాదు మన వృత్తి ఏదైనా అందులో శ్రద్ధ పెట్టి చేస్తే అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. ఎంతసేపు పక్కనోడి గురించి ఆలోచిస్తే నష్టపోయేది మనమే.

English summary

the indian beggar who earns 30000 monthly and he has 3 wives

the indian beggar who earns 30000 monthly and he has 3 wives