Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
లక్కీ ఫెలో..స్పైడర్ మన్ లా బిల్డింగ్ ఎక్కి ప్రాణం కాపాడాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు బంఫర్ ఆఫర్ ఇచ్చాడు
ఉత్తర పారిస్‌లోని ఓ భవంతి నాలుగో అంతస్తు నుంచి ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడడాన్ని ప్రజలు గమనించారు. మమౌడూ గస్సామా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు. మాలి దేశస్థుడు, స్పైడర్ మ్యాన్, మమౌడూ గస్సామా
ఒక్కోసారి మన కళ్ల ముందు ప్రమాదం జరుగుతున్నా మనం ఏమీ చేయలేని స్థితిలో ఉంటాం. మరికొందరు ఒక నిండు ప్రాణం పోతున్నా కూడా కళ్లప్పగిచ్చి చూస్తూ ఉంటారు. ఇంకొందరు ఆ ప్రాణం ఎలా పోతుందో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు తప్ప కాపాడడానికి ప్రయత్నించరు. ఇలాంటి ఘటనలు మనం కోకొల్లలు చూస్తూ ఉంటాం.

ఎలా స్పందించాలో తెలియదు
చాలా మందికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం. కానీ, కొందరు మాత్రం సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు.

ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ
నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదకరంగా వేలాడుతున్న నాలుగేళ్ల చిన్నారి.. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. ఇంతలో క్షణాల్లో ఓ యువకుడు స్పైడర్‌మ్యాన్‌లా చకచకా నాలుగు అంతస్తులను ఎక్కి ఆ చిన్నారి కాపాడిన తీరు అక్కడున్న వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

చిన్నారిని కాపాడి సూపర్
సినిమా సాహసాల్ని తలదన్నేలా ఉన్న ఈ ఫీట్ పారిస్‌లో చోటుచేసుకుంది. ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి సూపర్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉత్తర ప్యారిస్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.

ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం
ఉత్తర పారిస్‌లోని ఓ భవంతి నాలుగో అంతస్తు నుంచి ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడడాన్ని ప్రజలు గమనించారు.
ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు వేలాడటంతో కొందరు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అంచుల నుంచి వేలాడుతున్న ఈ చిన్నారి ఎప్పుడైనా కిందపడి పోయేలా పరిస్థితి నెలకొంది.

హాహాకారాలు
కింద జనం చేరి హాహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మమౌడూ గస్సామా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేవలం చేతులతోనే ఒక్కో అంతస్తు ఎక్కుతూ పైకి చేరుకున్నాడు.గబగబా పైకి భవనం ఎక్కడి ఆ పిల్లాడిని కాపాడే యత్నం చేశాడు. ఆ సమయంలో పక్క ప్లాట్‌లోని వ్యక్తి చిన్నారి జారకుండా ఒకచేత్తో అదిమి పట్టుకున్నాడు.

నిమిషం వ్యవధిలోనే
ఇక నిమిషం వ్యవధిలోనే పైకి ఎక్కేసిన గస్సామా.. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు. కాసేపటికి వచ్చిన అధికారులు చిన్నారి సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఆ యువకుడిని అభినందించి వెళ్లిపోయారు.

సోషల్ మీడియాలో హీరోగా
గస్సామా సాహసంపై పారిస్ మేయర్ ప్రశంసలు గుప్పించగా, సోషల్ మీడియాలో అతన్ని హీరోగా, స్పైడర్ మ్యాన్‌గా అభివర్ణిస్తున్నారు. మాలి నుంచి పారిస్‌లో స్థిరపడదామని వచ్చిన అతనికి అన్ని తోడ్పాట్లు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

తల్లిదండ్రులిద్దరూ లేరు
ఇక సంఘటన జరిగిన సమయంలో చిన్నారి తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. చిన్నారిని ఒంటరిగా ఇంట్లో వదిలివెళ్లిన తండ్రిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బతుకుదెరువు కోసం గత సెప్టెంబర్‌లో గస్సామా మాలి నుంచి పారిస్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం వలసదారుల హాస్టల్‌లో ఉంటున్నారు.

వీడియో వైరల్‌గా మారి
గస్సామా సాహసాన్ని చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్‌గా మారి లక్షలాది మందికి చేరింది. దేశాధ్యక్షుడి ఫేస్‌బుక్ పేజీలోనూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో గస్సామా ఒక్కసారిగా జాతీయ హీరో అయ్యారు.
ప్యారిస్ మేయర్
మరోవైపు గస్సామా ప్రదర్శించిన హీరోయిజంపై ప్యారిస్ మేయర్ అన్నే హిడాల్గో సంభ్రమాశ్చర్యం వ్యక్తం చేశారు. అతడు ఫ్రాన్స్‌లో స్ధిరపడేందుకు ప్యారిస్ అన్ని విధాలా సహాయం చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా అతడితో మాట్లాడాననీ.. సాహసం చేసి పిల్లాడిని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పానని హిడాల్గో పేర్కొన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్ సైతం ఇవాళ గస్సామాను ఎలిసీ ప్యాలెస్‌కు రప్పించుకుని మరీ అభినందించారు. ఫ్రాన్స్ పౌరసత్వంతో అతడిని గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. గస్సామాకు సాహస పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్వయంగా అందజేసి అభినందించారు. ఫ్రెంచ్ ఫైర్ సర్వీస్‌లో చేరాలని ఆహ్వానించారు. గస్సామాకు ఫ్రాన్స్ పౌరసత్వాన్ని ఇస్తామని ప్రకటించారు.
నా మనసు ఆగలేదు
మరి స్పైడర్ మ్యాన్‌లా నాలుగు అంతస్తులు పాక్కుంటూ ఎక్కి చిన్నారి ప్రాణాలను ఎలా కాపాడావు... అంత సాహసం ఎలా చేశావని గస్సామనాను మీడియా అడిగితే... ‘‘అతడు ఓ పసిపిల్లాడు... కాబట్టే నా మనసు ఆగలేదు. నేను ఏదోవిధంగా ఎక్కగలిగాను.. అతడిని కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు..'' అని గస్సామా పేర్కొన్నాడు. కాగా ఉద్యోగం కోసం తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్నక్రమంలో గస్సామా ఈ సాహసం చేశాడంట.



Click it and Unblock the Notifications











