For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బాలుడు ఇలా మారుతాడని ఎవ్వరూ ఊహించలేదు – వైద్య శాస్త్ర అద్భుతాల్లో ఇది కూడా ఒకటి

ఈ బాలుడు ఇలా మారుతాడని ఎవ్వరూ ఊహించలేదు – వైద్య శాస్త్ర అద్భుతాల్లో ఇది కూడా ఒకటి

|

సైన్స్ రోజురోజుకీ సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ రోజుకో వింతకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతూ ఉన్న ఈ కాలంలో, సాధారణ మనిషి సైతం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోగల రోజులు వచ్చాయి.

వేర్వేరు అవసరాలకు వివిధ రకాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. కొన్ని సౌందర్యం కోసం కాగా, కొన్ని ఆరోగ్య సంబందాన్ని కలిగి ఉంటాయి.

ఇక్కడ, మనం క్రోజోన్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్న ఒక బాలునికి సంబంధించిన, ప్రత్యేకమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాము.

వివరాలు వెల్లడి కాని ఈ బాలుడు పుట్టుకతోనే క్రోజోన్ సిండ్రోం అనే భయంకరమైన జన్యు లోప సంబంధిత వ్యాధితో జన్మించాడు.

"క్రౌజోన్ సిండ్రోమ్" ఏమిటో తెలియని వారికి : ఇది అసాధారణమైన పుర్రెను కలిగి, ముఖ రూపాన్నే వికృతంగా మార్చేయగల వ్యాధి. మనిషి రూపమే పూర్తిగా మారిపోయి, సాధారణ జీవన శైలికి అడ్డంగా పరిణమిస్తుంది.

The Transformation Of This Boy Will Leave Everyone Surprised!

Image Source
ఈ ఫోటోలో మీకు కనపడుతున్న బాలునిలోని మార్పులు 9 సంవత్సరాలలో, నెలల వ్యవధిలోనే చేసిన 25 ఆపరేషన్లలోని వివిధ దశలు.

ఈ జన్యు లోప సంబంధిత వ్యాధి కారణంగా ముఖoలోని ఎముకల కూర్పు ఒక సాధారణ నమూనాలో పెరగడానికి అనుమతించబడవు, తద్వారా ఇది వైకల్యానికి దారితీస్తుంది.

గ్రీస్ లోని ఏథెన్స్ నగరంలో హెలెనిక్ క్రనోయోఫేషియల్ సెంటర్ (హెచ్.హెచ్.సి) లో పని చేస్తున్న “అలెగ్జాండర్ స్ట్రాటౌడకిస్” అనే వైద్యుడు ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా చికిత్సను అందిస్తున్నారు. అతని వెబ్సైట్లో పొందుపరచిన ఈ బాలుడి వివరాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగింది. తద్వారా ఇటువంటి సమస్యలతో భాద పడుతున్న అనేకులకు ఊరటలా అనిపించింది.

ఈ వ్యాధి యొక్క రోగ నిర్ధారణ గర్భధారణ సమయంలోనే జెనెటిక్ సైటోలజీ పరీక్ష ద్వారా, లేదా శిశువు జన్మించిన తర్వాతనే, లేదా పుట్టిన మొదటి సంవత్సరంలో కానీ బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ, దురదృష్టవశాత్తు, నివేదించబడిన అనేక కేసులలో, ముఖ కవళికలలోని మార్పులు 2 సంవత్సరాల వయస్సులో కనుగొనబడింది. అందుచేత వైద్యం కూడా ఆలస్యమయ్యేది.

ఈ చిన్న పిల్లవాడి సర్జరీలో భాగంగా ముఖంలోని అనేక ఎముకలను సర్దుబాటు చేయవలసి వస్తుంది. ఆపరేషన్ తర్వాత, "ఆస్టియోజెనిక్ డిస్ట్రాక్టర్" అని పిలువబడే పరికరాన్ని ఉంచుతారు, ఇది ఎముకల పెరుగుదలను ఉత్తేజపరచటానికి మరియు ఒక ఆకృతిలో ఎముకలు పెరగడానికి తద్వారా వాటిని క్రమబద్దీకరించడానికి దోహదపడుతుంది.

ఆపరేషన్ తర్వాత, బాలునిలో శ్వాస పీల్చుకునే సామర్ధ్యం, దృష్టిలో కూడా గణనీయమైన పురోగతి కనిపించింది.

ఈ పరిస్థితితో బాధపడుతున్న అనేక మంది, తరచుగా నిద్ర పోతున్న సమయంలో శ్వాసను అందించే ఒక పరికరాన్ని ధరించవలసి ఉంటుంది. మరియు దృశ్య లోపం కూడా అధికంగా ఉంటుంది. వీరిలో కొందరికి కంటి చూపు మందగించగా, కొంతమందిలో ఒక వస్తువు రెండు వస్తువులుగా కూడా కనిపిస్తుంది.

ఈ బాలుని రూపాంతర ఫలితాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఈ బాలుడు ప్రస్తుతం అందరిలా తన రూపాన్ని కలిగి ఉండడం, శ్వాస మరియు దృశ్య సంబంధిత సమస్యల నుండి బయటపడడం ఎంతో సంతోషించ దగ్గ విషయం. ఈ ఆపరేషన్లో భాగస్వామ్యం అయిన వైద్యులందరికీ, మరియు శాస్త్ర సాంకేతిక అభివృద్దికి ధన్యవాదాలు తెలపాల్సిందే.

వైకల్యం అనేది మనిషిలో ఉండదు, ఆలోచించే మనసులో ఉంటుంది అనేది పెద్దల మాట. ఇతరులతో ఎల్లప్పుడూ తమను పోల్చి చూస్కుంటూ, తాము అందరిలో అందంగా, ఎత్తుగా కనపడాలన్న కుతూహలంతో ఆరోగ్యకర దేహాన్ని కూడా సర్వ నాశనం చేసుకుంటూ ప్రాణాలను సైతం పణంగా పెట్టే అనేక మంది, ఇటువంటి సమస్యలతో భాద పడుతున్న వారిని చూసైనా, అటువంటి పరిస్థితి తమకు లేదు అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కోసారి వారి ఆలోచనా విధానం ఆర్ధిక, మరియు కుటుంబ పతనానికి కూడా హేతువులుగా పరిణమిస్తున్నాయి అనడంలో ఆశ్చర్యంలేదు.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

The Transformation Of This Boy Will Leave Everyone Surprised!

The Transformation Of This Boy Will Leave Everyone Surprised!,With a lot of evolution happening in the field of science, there have been new technologies that have been getting introduced to an ordinary man. Different types of surgeries are performed for different purposes. While some are cosmetic, others are health re
Story first published:Wednesday, June 27, 2018, 16:55 [IST]
Desktop Bottom Promotion