Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఈ చైనీస్ మహిళ సిక్కుల కన్నా స్పష్టంగా పంజాబీ మాట్లాడ్తుంది చూడండి !
ఈ చైనీస్ మహిళ సిక్కుల కన్నా స్పష్టంగా పంజాబీ మాట్లాడ్తుంది చూడండి !
మనం ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటగా, ఆహారం నుండి భాషల దాకా, అన్నిటా లోకల్ స్టఫ్ కోల్పోయామన్న భావనకు లోనవుతుంటాం అవునా ? ముఖ్యంగా ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సిన అవసరం ఏర్పడినప్పుడు.
ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎంత క్యూట్ గా ఉందో ?
ఒక పంజాబీ వ్యక్తి , పంజాబీ భాషను మాట్లాడుతున్న చైనీస్ అమ్మాయితో మాటలు కలిపిన ఈ వీడియో ఇప్పుడు ఒక వైరల్. ఫన్నీగా ఉంది కదా.

ఈ వీడియోని రికార్డ్ చేసిన వ్యక్తి పేరు, రిషివంత్ సింగ్ రంధ్వా, వయసు 43. పంజాబీ మాట్లాడుతున్న ఈ చైనీస్ మహిళ “లిమ్” తో జరిపిన సంభాషణను వీడియోని తీసి తన ఫేస్బుక్ ఫ్రెండ్స్ తో పంచుకున్నాడు. క్రమంగా ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ముఖ్యంగా పంజాబీ భాష తెల్సిన వాళ్ళ సోషల్ ఫీడ్స్ నిండా ఈ వీడియోనే .
కానీ ఈ వీడియో ఇలా వైరల్ అవుతుందని తీసిన వ్యక్తి, ఆ చైనీస్ మహిళ ఇద్దరూ ఊహించలేదు. చివరికి ఆశ్చర్యకరంగా ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది లిమ్. ముఖ్యంగా ఈవిడ మాట్లాడే పంజాబీ శైలి, ఇతర పంజాబీ వ్యక్తులతో సమానంగా ఉండడం, ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా స్పష్టంగా ఉండడం ఆశ్చర్యకరంగా తోచింది.
రిషివంత్ సింగ్ ఒక రెస్టారెంట్లో టీ సేవిస్తున్న సమయంలో, అతన్ని లిమ్ పలకరించింది, అది కూడా పంజాబీ భాషలో. ఆశ్చర్యానికి లోనైన రిషివంత్ సింగ్ వెంటనే వీడియో రికార్డ్ చేయాలని సంకల్పించాడు. పైగా ఆవిడ మాట్లాడే పంజాబీ భాష శైలి, ఇతర పంజాబీలు ముక్కున వేలేసుకునేలా ఉంది.
ఇంత స్పష్టంగా, అచ్చుతప్పులు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు పంజాబీ భాషని, అని అడుగగా, తనకు ఒక పంజాబీ ఫ్రెండ్ ఉందని, 5 సంవత్సరాలుగా తనతో మాట్లాడుతున్నానని, క్రమంగా పంజాబీ మాట్లాడడం నేర్చుకున్నానని తెలిపింది.
సంభాషణ మద్యలో భాగంగా, పంజాబీ వ్యక్తిని పెళ్ళిచేసుకుంటావా అని రిషివంత్ సింగ్ అడుగగా, “చూద్దాం ఏం జరుగుతుందో అది జరుగుతుంది” అని సమాధానం ఇచ్చింది లిమ్ షైలీ.
రిషివంత్ సింగ్ కాస్త ఫన్నీ నేచర్ కలవాడు, ఆ క్రమంలో తన పంజాబీ ఫ్రెండ్స్ కు, నంబర్ ఇవ్వవలసినదిగా లిమ్ షైలీని అడుగగా, నంబర్ ఇవ్వడం సమస్యలను సృష్టిస్తుంది అని సున్నితంగా తిరస్కరించింది.
ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ? మీకు కూడా ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా తారసపడ్డారా? మీ సమాధానం అవును అయితే, దిగువ వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
