2018లో ఈ మూడు రాశుల వారికే ఎందుకు అంతా మంచే జరుగుతుంది?

Written By:
Subscribe to Boldsky

2018లో కొన్ని రాశుల్లోకి కొన్ని గ్రహాలు రావడం వల్ల ఒక మూడూ రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వృశ్చికంలోకి బృహస్పతి (గురుడు) రావడం వల్ల ఈ రాశితో పాటు మరో రెండు రాశుల వారికి కూడా చాలా మేలు జరుగుతుంది. అసలు ఎలాంటి విషయాల్లో ఈ మూడు రాశుల వారికి మేలు జరుగుతుందనేది మీరు తెలుసుకోండి. ఒకవేళ మీ రాశి కూడా అందులో ఉంటే మీరు కూడా అదృష్టవంతులే.

మేషం

మేషం

మేషరాశికి ఈ ఏడాది చాలా వరకు మేలు జరుగుతుంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. బృహస్పతి వృశ్చికంలోని రావడం వల్ల మేషరాశికి వారికి కొన్ని లాభాలు చేకూరుతాయి. వారు ఏ పని ప్రారంభించినా అది విజయంవంతం కావడానికి అవకాశం ఉంటుంది.

ప్రయత్న లోపం వద్దు (మేషం)

ప్రయత్న లోపం వద్దు (మేషం)

మీకు ఇది చాలా మంచి సమయం. మంచి ఆలోచనా విధానంతో ముందడుగువేయండి. మీరు చేసే పనుల్లో వెంటనే విజయం లభిస్తుంది. అయితే మీరు ప్రయత్నించి వదిలేయకండి. ప్రయత్నలోపం ఉంటే మాత్రం మీ పని ముందుకెళ్లదు. మీకు ఇది రాజయోగ కాలం. మీరు అనుకున్న చాలా పనులు త్వరలోనే నెరవేరతాయి. మీ సన్నిహితుల వద్ద మీకు తెలిసిన వారి వద్ద మీకు మంచి గౌరవం లభిస్తుంది.

శత్రుత్వం వద్దు (మేషం)

శత్రుత్వం వద్దు (మేషం)

మీరు చాలా మంచి పనులు చేయనున్నారు. చాలా మంది ద్వారా మీరు ప్రశంసలు అందుకోనున్నారు. అయితే మీరు కాస్త అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకూ ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవొద్దు. గొడవలకు దూరంగా ఉండండి.

మంచి రోజులే (మేషం)

మంచి రోజులే (మేషం)

మీరు శివున్ని ఆరాధిస్తే చాలా వరకు మేలు జరుగుతుంది. మొత్తానికి మీకు ముందున్నవన్నీ మంచి రోజులే. ఈ రాశికి వారికి చాలా అదృష్టాలు వరిస్తాయి. మీరు మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మాత్రం కచ్చితంగా విజయపథంలోకి దూసుకెళ్తారు.

తులరాశి

తులరాశి

ఈ సంవత్సరం మీరు ఊహించని ఎన్నో విజయాలు మీ దరికి చేరుతాయి. వరుణుడు ఆకస్మికంగా మార్పు చెందడం.. మీ రాశిలో ఎనిమిదో స్థానంలోకి చేరడం వల్ల మీరు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటారు. మీకు మంచి అదృష్టయోగం ఉంటుంది.

స్నేహితులు అండగా నిలుస్తారు (తుల)

స్నేహితులు అండగా నిలుస్తారు (తుల)

మీరు చాలా ఆసక్తితో ఏదైనా పనులు చేపడితే వాటి వల్ల మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీకు సమాజంలో కూడా మంచి

గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. మీ స్నేహితులు మీకు చాలా విషయాల్లో అండగా నిలుస్తారు. వారి సహకారంతో మీరు కొన్ని విషయాల్లో బాగా రాణిస్తారు.

వారితో జాగ్రత్త (తుల)

వారితో జాగ్రత్త (తుల)

అయితే మీకు కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మిమ్మల్ని నమ్మించి ఆర్థికంగా నష్టపరిచే వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిమ్మల్ని అనవసరంగా ఏదో ఒకటి అనాలని అంటూ ఉంటారు.

మాట పట్టింపులకువెళ్లొద్దు (తుల)

మాట పట్టింపులకువెళ్లొద్దు (తుల)

మీపై బురదజల్లే కార్యక్రమాలు చాలానే ఉంటాయి. వాటి విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మాటపట్టింపులకు వెళ్లి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజలు చేపడితే కాస్త మంచిది.

వృశ్చికం

వృశ్చికం

బృహస్పతి వృశ్చికంలోని రానుండడంతో మీకు చాలా మేలు జరగనుంది. మీ రాశిలో బృహస్పతి మొదటి స్థానంలో ఉంటాడు. మీరు చేపట్టే పనులు చాలా వరకు విజయం అవుతాయి. మీరు ఎక్కువగా ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బృహస్పతి అంటే గురుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు.

పట్టుదలతో చేయండి (వృశ్చికం)

పట్టుదలతో చేయండి (వృశ్చికం)

మీరు ఏ పనైనా పట్టుదలతో చేయండి. మీరు ఒక పని చేపట్టినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. అయితే మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురికాకండి. మీరు ఎప్పుడూ ఉత్సాహం తగ్గకుండా పని చేయండి.

ఆటంకాలు వస్తాయి (వృశ్చికం)

ఆటంకాలు వస్తాయి (వృశ్చికం)

మీకు ఎన్ని ఆంటకాలు ఎదురైనా కూడా మీరు చేస్తున్న పనిని మాత్రం వదలకండి. మీకు కచ్చితంగా అధిగమించే శక్తి లభిస్తుంది. కొన్ని రకాల తొందరపాటు చర్యల వల్ల మీకు నష్టాలు కలుగుతాయి.

సహనం అవసరం (వృశ్చికం)

సహనం అవసరం (వృశ్చికం)

మీ పక్కన ఉన్న వారు, మీరు నమ్మిన వారు చాలా రకాలుగా మీకు తప్పుడు సలహాలు ఇస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి.

మీరు తీసుకునే కొన్ని రకాల సొంత నిర్ణయాలే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. మీకు సహనం చాలా అవసరం. మీరు గణపతి ఆరాధిస్తే మంచిది.

English summary

This Will Be A Big Year For These 3 Zodiac Signs, Here's Why

This Will Be A Big Year For These 3 Zodiac Signs, Here's Why
Story first published: Friday, January 5, 2018, 10:16 [IST]