Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
మహిళను అసభ్యకరంగా తాకిన పోలీస్... మహిళలకి భద్రత కరువేనా?
మహిళను అసభ్యకరంగా తాకిన పోలీస్... మహిళలకి భద్రత కరువేనా?
మహిళల భద్రత విషయంపై అనుమానాలు రేకెత్తిన ఒక వీడియో ఈ ఇటీవల వైరల్ గా మారింది.
ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మిగతా పాసెంజర్స్ లాగానే ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతని పక్కనే కూర్చున్న మహిళా ప్రయాణీకులు కూడా వారెక్కవలసిన ట్రెయిన్ కోసం ఎదురుచూస్తున్నారు. బుద్ది వక్రీకరించి ఆ వ్యక్తి ఆ వ్యక్తి తన పక్కన కూర్చున్న ప్రయాణీకురాలిని అసభ్యకరంగా తాకాలని నిశ్చయించుకున్నాడు.

మహిళను అసభ్యకరంగా తాకిన పోలీస్
ఈ వీడియోను గమనిస్తే, సదరు పోలీస్ ఆ మహిళ వెనుక భాగాన్ని ఎన్నో సార్లు అసభ్యకరంగా తాకాడు.
ఈ వీడియో చూసిన వారెవరికైనా మహిళల భద్రత విషయం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అన్ని సార్లు ఆ మహిళను పోలీస్ మ్యాన్ తాకినప్పుడు ఆ మహిళ ముందుగానే ఎందుకు ఎదురుతిరగలేదు. పోలీస్ కాబట్టి ఆ వ్యక్తిని చూసి భయపడిందా? పొరపాటున చేయి తగిలిందని భావించి ఉండవచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ అదే విధంగా అసభ్యకరంగా తాకిడిగి గురయినప్పుడు ఆమె ఎదురుతిరిగే ప్రయత్నం చేయలేదు.

ఈ వీడియో చూస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.
ఆ మహిళ ఆ పోలీస్ ను ఎందుకు ధైర్యంగా ఎదుర్కొనలేకపోయింది? మహిళను ఇష్టమొచ్చినట్టు తాకడానికి ఆ పోలీస్ కు ధైర్యం ఎలా వచ్చింది?
ఈ వీడియో మొత్తంలో, నిద్రిస్తున్నట్టు నటిస్తూ మహిళను తాకుతూ రాక్షసానందాన్ని పొందుతున్న పోలీస్ ను గమనించవచ్చు.
ఈ వీడియోను చూసిన వారికి ఒక సందేహం కలుగుతుంది. ఈ వీడియోలో పోలీస్ మహిళను అనేక సార్లు అసభ్యకరంగా తాకాడు. ఆ మహిళ మొదటి సారే గట్టిగా కేకలు పెడితే అక్కడున్న వారు స్పందించి వెంటనే ఆ పోలీస్ కు దేహశుద్ది చేసేవారు. ఆమె అంత ధైర్యం చేయలేకపోయింది. తన గురించి తాను ఒక అడుగు ముందుకు వేయలేకపోయింది.

అయితే, బాధితురాలు తన గోడును సున్నితంగా
అయితే, బాధితురాలు తన గోడును సున్నితంగా తన పక్కనున్న మహిళకు చేరవేసినట్టుంది. వెంటనే, ఆవిడ చేయి తీయమని పోలీస్ ను గదమాయిస్తూ ఉండగా పోలీస్ పక్కనే ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని గమనించి పోలీస్ ను చెంపదెబ్బ కొట్టాడు. పోలీస్ అని భయపడకుండా ఒక పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించాడు.

పోలీస్ ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి గురించి వివరాలు వెల్లడికాలేదు.
పోలీస్ ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి గురించి వివరాలు వెల్లడికాలేదు. అయితే, ఆ వ్యక్తి పోలీస్ కు చెంపదెబ్బ కొట్టడంతో మహిళల పట్ల అతనికున్న గౌరవం తేటతెల్లమవుతోంది.
ఇంతలో జనసమూహము ఆ పోలీస్ ను చుట్టూ ముట్టి గదమాయించడం మొదలుపెట్టారు. ఆ బాధితురాలు జరిగిన సంఘటనకు షాక్ లో మునిగిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా ఉండిపోయింది.
పోలీస్ ను ఎదురించేందుకు ఆమె ముందుగానే ధైర్యంగా ఎదురుతిరిగుంటే ఆమె అన్ని సార్లు వేధింపులకు గురవ్వాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన.

అయితే, పోలీస్ లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటన
అయితే, పోలీస్ లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటన ఇదొక్కటే కాదు. ఇంతకు ముందు కూడా ఇటువంటి సంఘటలను జరిగాయి. అవన్నీ వార్తల్లోకి ఎక్కాయి కూడా. కొంతమంది డ్యూటీలో ఉండగానే ఫుట్ మసాజ్ లను అలాగే ఫుల్ బాడీ మసాజ్ లను చేయించుకోవడం జరిగిందని వార్తా పత్రికల కథనం.
ఈ వీడియోని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడం ద్వారా మహిళల భద్రత విషయంలో ఒక అవెర్నెస్ ను కలిగించవచ్చు. అలాగే, తమ కళ్ళెదురుగా మహిళలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించాలన్న భావనని కూడా కలిగించాలి.
ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ సెక్షన్స్ ద్వారా మాకు తెలియచేయండి.



Click it and Unblock the Notifications