Latest Updates
-
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.!
శవపేటికలోని ఎర్రటి ద్రావణం తాగుతాం, చనిపోయినా ఫర్వాలేదు, దాన్ని తాగితే శక్తులు వస్తాయి, మీకు తిక్కనా
అలెగ్జాండ్రియాలో ఆర్కియాలజీ వింగ్ కు చెందిన ముస్తఫా వాజిరీ డేర్ చేసి ఒక నల్ల శవపేటికను ఓపెన్ చేశారు. మొదటి ఇది అశుభంగా భావించిన జనాలు ఇప్పుడు మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. శవ పేటిక మొత్తం ఎర్రటి ద్రావణం
కొన్ని రోజుల క్రితం ఈజిప్ట్ లో ఒక బ్లాక్ సార్కోఫాగస్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇది సుమారు 2000 సంవత్సరాల కింది నాటిది. ఈజిప్టు లోని అలెగ్జాండ్రియా నగరంలో దీన్ని ఓపెన్ చేశారు. ఒక నల్లబండ ఆకారంలో 16 అడుగుల లోతులో ఉన్న దీనిపై పరిశోధకులు కొన్ని రోజులుగా పరిశోధనలు చేసి దీన్ని తెరిచారు. ఇది 10 అడుగుల పొడువు, 30 టన్నుల వెయిట్ తో ఉంది.

తెరవకూడదని చెప్పారు
మొదట ఈ శవపేటికను తెరవకూడదని జనాలంతా చెప్పారు. అలా తెరిస్తే అరిష్టం కలుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడి ఆస్ట్రాలజీ అధికారులు మాత్రం పట్టుబట్టి దీన్ని తెరిచారు. దీన్ని తెరవగానే ఒక రకమైన వాసన వచ్చింది. ఆ వాసన వల్ల తమకు ఏమైనా అవుతుందేమోనని పరిశోధకులు, సిబ్బంది అంతా బయపడ్డారు.
నమ్మకాలు చాలా ఎక్కువ
ఎందుకంటే ఈజిప్ట్ లో ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ.
గతంలో అక్కడ చనిపోయే వాళ్లకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చేవారు. అందువల్లే మృతదేహాలను భద్రంగా దాచేందుకు రకరకాల విధానాలను అనుసరించేవారు. అలాగే మృతదేహాల్లోని కొన్ని అవయవాలను తీసివేసి మమ్మీలను కూడా తయారు చేసేవారు. వాటిని సార్కోఫాగస్‌లలో భద్రపరిచేవారు.

భూకంపాలు వచ్చినా కూడా భద్రంగా
గొప్పగొప్ప కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే ఇలా చేసేవారు. చనిపోయిన వారిని భారీ శవపేటిల్లో ఉంచి అందులో రకరకాల ద్రావణాలు వేసి పూడ్చేవారు. ఇక ఆ శవపేటికలు భూకంపాలు వచ్చినా కూడా భద్రంగా ఉండేలా రూపొందించేవారు. అలాంటి సార్కోఫాగస్ లను తెరవడం వారు అరిష్టంగా భావిస్తారు.

రెడ్ లిక్విడ్ తాగితే శక్తులు వస్తాయి
అయితే ఇటీవల అలెగ్జాండ్రియాలో ఆర్కియాలజీ వింగ్ కు చెందిన ముస్తఫా వాజిరీ డేర్ చేసి ఒక నల్ల శవపేటికను ఓపెన్ చేశారు. మొదటి ఇది అశుభంగా భావించిన జనాలు ఇప్పుడు మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. శవ పేటిక మొత్తం ఎర్రటి ద్రావణంతో నిండిపోయింది. అలాగే అందులో మూడు మమ్మీల పుర్రెలు కూడా దొరికాయి. వాటిపైన అధికారులు పరిశోధనలు చేస్తున్నారు.
17,645 మంది
అయితే 17,645 మంది ఆ ఎర్రటి ద్రావణాన్ని తాము తాగుతామని ముందుకొచ్చారు. తాము ఆ ద్రావణాన్ని తాగేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మమ్మీలకు సంబంధించిన రెడ్ లిక్విడ్ తాగితే తమకు కొన్ని రకాల శక్తులు వస్తాయని వారి వాదన. change.org అనే వెబ్ సైట్ ద్వారా వీరంతా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది తాగిన తర్వాత చనిపోయినా ఫర్వాలేదు అంటున్నారు.
మీకు ఏమన్నా తిక్కనా
ఈ విషయం తెలుసుకున్న ఈజిప్ట్ ఆర్కియాలజీ అధికారులు "మీకు ఏమన్నా తిక్కనా... అది మీరు అనుకుంటున్నట్లు ఏదో శక్తులున్న ద్రావణం కాదు. అది మురుగు నీరు. ఎన్నో ఏళ్ల క్రితం మృతదేహాలను అలాగే ఉంచడం వల్ల ఆ శరీర భాగాల నుంచి ద్రవం తయారైంది. దాన్ని తాగితే శక్తులు రావు.. వ్యాధులు వచ్చి చనిపోతారు. ఆ ద్రావణం మొత్తం వైరస్ లతో నిండి ఉంది". అని అన్నారు.



Click it and Unblock the Notifications