For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెంపును ఎవరు ధరించవచ్చు ?

|

కెంపు ఎరుపు రంగులో ఉండే రత్నం. నవరత్నాలలో ఒకటైన కెంపు గులాబీరంగు నుండి ముదురు ఎరుపు రంగు వరకు ఉంటుంది. ఈ రత్నాన్ని ధరించిన వారికి సానుకూల ఫలితాలు ఎదురై జీవితంలో అత్యుత్తమ మార్గాలలో పయనిస్తారని చెప్పబడినది.

ఈ సానుకూల శక్తులు, ప్రతికూల శక్తుల ప్రభావాలను దరికి రానివ్వకుండా చేసి ధరించిన వ్యక్తిని అనేక పరిస్తితులనుండి కాపాడుతుంది. ఈ రత్నం గౌరవానికి, అధికారానికి మరియు ఆత్మస్థైర్యానికి సూచించబడినది. తద్వారా ఈ కెంపును ధరించిన వారు, అంతులేని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేయగలరని, తద్వారా అనేక సత్ఫలితాలను, సమాజంలో గౌరవాన్ని పొందగలరని చెప్పబడినది.

WHO SHOULD WEAR A RUBY/MANIK

ఏది ఏమైనా, ఈ రత్నాల సానుకూల ప్రతికూల ఫలితాలు రాశి చక్రాన్ని, మరియు జన్మ కుండలిలోని గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. కావున ఎటువంటి రాత్నాన్నైనా ధరించాలి అన్న ఆలోచనలు చేసే వారు ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రవేత్తను సంప్రదిoచవలసినదిగా సూచించడమైనది. తద్వారా వారు మీ జన్మకుండలిని అనుసరించి, నిర్ధారణకు వస్తారు.

సూర్యునికి సంబంధించినది :

కెంపు సూర్యునికి సంబంధించినది. ఈ సూర్యుడు, ధైర్యానికి, శక్తికి మరియు సమాచార నైపుణ్యాలకు, ఆరోగ్యానికి సంబంధించిన గ్రహం.

జన్మ కుండలిలో అనువుగా సూర్యుడు ఉన్న ఎడల, ప్రాభల్యం అధికంగా పెరుగుతుంది. మరియు ఆత్మ స్థైర్యం పెంపొందుతుంది కూడా. ఈ గ్రహం, ఆత్మకు సంబంధించిన ప్రధాన అంశంగా ఉంటుంది. తద్వారా ధైర్య సాహసాలకు, నాయకత్వపు లక్షణాలకు ప్రతీకగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అధికారిక స్థానాలలో ఉన్న వారికి సరిపోతుంది. ఇప్పటికే రాజకీయాల్లో మరియు ప్రభుత్వంలో ఉన్నవారు ఈ కెంపును జన్మకుండలిని అనుసరించి ధరించిన ఎడల అనేక విజయాలను పొందగలరని, తద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయని చెప్పబడినది.

ఒకవేళ సూర్యుడు కనుక నీచ స్థితిలో ఉన్నా, లేదా అనుకూల స్థానంలో లేని ఎడల అనేక ఆర్ధికపరమైన సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు కలుగుతాయి. ఒక్కోసారి ఉద్యోగపరమైన సమస్యలను కూడా తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు.

మీకు తెలుసా కొన్ని రోగాలను కూడా తగ్గించగలదని :

సూర్యుడు జీవితాన్ని ప్రభావితం చేయు గ్రహాలలో ప్రధానంగా ఉండు గ్రహం. మరియు కెంపు ఈ గ్రహానికి అనుకూలమైన రత్నం. గ్రహం అనుకూలత దృష్ట్యా ఈ రత్నాన్ని ధరించడం వలన కొన్ని సమసిపోని రోగాలు సైతం తగ్గుముఖం పడుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

గ్రహాల నీచ స్థితి కారణంగా అనేక రోగాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తపోటు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, కంటి చూపు తగ్గడం, ఆత్మ విశ్వాసం లోపించడం, చిత్త చాపల్యం మొదలైన సమస్యలు ఈ గ్రహాల నీచ స్థితి కారణంగా తలెత్తుతుంటాయి.

ఏది ఏమైనా నిపుణుల సూచనల ప్రకారం సరైన సమయంలో కెంపును ధరించడం కారణంగా, ఇలాంటి అనేక రోగాలు తగ్గుముఖం పడుతాయి.

రాహువు, కేతువు, శని గ్రహాలు సూర్యునితో కలిసి ఉచ్ఛ స్థితిన ఉన్న ఎడల కెంపును ఖచ్చితంగా దరించ వచ్చు. మరియు సూర్యుని స్థానం 6, 8 లేదా పదవ గృహంలో ఉన్న ఎడల కెంపును ధరించవచ్చు.

మహిళల విషయానికి వస్తే, ఈ కెంపు అభిరుచులని ప్రోత్సహించేలా మరియు నూతన శక్తిని ఇచ్చేలా తోడ్పడుతుంది. ఏది ఏమైనా పురుషులైనా, స్త్రీలైనా గ్రహాల స్థితులని మాత్రమే అనుసరించి రత్నాలను దరించవలసి ఉంటుంది.

రాశి చక్రాల ప్రకారం కెంపును ధరించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

మేష రాశి :

మేష రాశి :

జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 5, 6 మరియు 11 వ స్థానాలలో ఉన్న ఎడల, మేష రాశి వారు కెంపును ధరించడం ద్వారా అనేక సానుకూల ఫలితాలని పొందగలరు. సూర్యుడు 11 వ స్థానంలో ఉన్న ఎడల, కనీసం 3 రోజులైనా కెంపును ధరించవలసినదిగా సూచించడమైనది. తద్వారా ఆర్ధిక పరమైన లాభాలనే కాకుండా సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

వృషభ రాశి :

వృషభ రాశి :

నిజానికి సూర్యుడు వృషభ రాశి వారికి సానుకూలమైన గ్రహం కానేరదు. కావున వీరు ధరించకపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తుంటారు. వృషభ రాశి వారికి సానుకూల గ్రహంగా శుక్రుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు, ఈ శుక్ర గ్రహం సూర్యునికి శత్రువుగా చెప్పబడుతుంది. జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం, అత్యవసరమైన పరిస్థితులలోనే కెంపును ధరించవలసి ఉంటుంది. లేనిచో మీకు కెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించడం జరగదు.

మిధున రాశి :

మిధున రాశి :

జన్మ కుండలి ప్రకారం సూర్యుడు 3 లేదా 11 వ స్థానాలలో ఉన్న ఎడల, మిధున రాశికి చెందిన వారు ఎటువంటి ఆలోచనా చేయకుండా ధరించవచ్చు. బుద్ధ-ఆదిత్య యోగం 3,4 మరియు 11 వ స్థానాలలో ఉన్న ఎడల, కెంపును ధరించడం మూలంగా అత్యదిక సానుకూల ఫలితాలను పొందగలరని, అదృష్టం వరిస్తుందని జ్యోతిష్యనిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కెంపు మాత్రమే కాదు పచ్చ లేదా మరకతాన్ని కూడా ధరించవచ్చు.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

జన్మ కుండలిలో సూర్యుడు 5, 9 మరియు 10 స్థానాలలో ఉన్న ఎడల, కర్కాటక రాశికి చెందినవారు నిర్భయంగా కెంపును ధరించవచ్చు. మిగిలిన స్థానాలలో మాత్రం సూచిoచదగినది కాదు. ఒక వేళ ధరించవలసి వస్తే, జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మేలు. లేనిచో ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి :

సింహ రాశి :

జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 9 , 5, 11 వ స్థానాలలో ఉన్న ఎడల సింహ రాశి వారు కెంపును ధరించవచ్చని సూచించడమైనది. మరియు మహర్దశ జరుగుతున్న సమయంలో ధరించిన ఎడల, మరియు ముఖ్యంగా 3,6 స్థానాలలో సూర్యుడు ఉన్న పక్షంలో సింహరాశి వారికి కెంపు అనేక ఫలితాలను ఇవ్వడమే కాకుండా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగేలా సహాయం చేయగలదు.

కన్యా రాశి :

కన్యా రాశి :

కన్యా రాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కెంపును ధరించరాదు. కానీ జన్మ కుండలి ప్రకారం 12 వ స్థానంలో సూర్యుడు ఉన్న ఎడల జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం ధరించవచ్చు. ఎటువంటి ఆలోచన లేకుండా కెంపును ధరించడం మూలంగా సామాజిక ఆర్ధిక పరమైన నష్టాలనే కాకుండా మానసిక శారీరిక సమస్యలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

తులా రాశి :

తులా రాశి :

జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 2, 7, 11 వ స్థానాలలో ఉన్న ఎడల, తలా రాశి వారు కెంపును ధరించవచ్చు. ఇది కూడా శుక్రుడు లేదా శని అనుకూల స్థానాలలో లేని ఎడల ధరించవచ్చు. మరియు జన్మ కుండలిని అనుసరించి సూర్యుని మహర్దశ జరుగు సమయంలో ధరించవచ్చు. తద్వారా అనేక సానుకూల ఫలితాలను పొందగలరు.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 5,6,9 లేదా 10 వ స్థానాలలో ఉన్న ఎడల, వృశ్చిక రాశికి చెందిన వారు కెంపును ధరించవచ్చని సూచించడమైనది. మిగిలిన స్థానాలలో ఉన్న ఎడల కెంపును ధరించక పోవడమే మేలు.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 5 లేదా 9 వ స్థానంలో ఉన్న ఎడల, ధనుస్సు రాశికి చెందిన వారు కెంపును ధరించవచ్చు. మరియు సూర్య మహర్దశ జరుగుతున్న సమయంలో, ముఖ్యంగా సూర్యుడు 2, 3, 4, 7, 8 లేదా 10 వ స్థానాలలో ఉన్న ఎడల కెంపును ధరించడం ఎంతో మంచిది. కానీ 6, 8, 11 స్థానాలలో ఉన్నప్పుడు మాత్రం కెంపును దరించరాదు.

మకర రాశి :

మకర రాశి :

మకర రాశి అధిపతి శని. శని సూర్యునికి విరోధి కావున, మకర రాశికి చెందినవారు కెంపును ధరించరాదని సూచించబడినది. కొన్ని ముఖ్యమైన పరిస్థితులలో జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు మాత్రమే జన్మ కుండలిని అనుసరించి ధరించవలసి ఉంటుంది. సొంతగా ఆలోచన లేకుండా ధరించడం మూలంగా అనేక సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తుంటారు.

కుంభ రాశి :

కుంభ రాశి :

జన్మ కుండలిని అనుసరించి శుక్రుని స్థానాన్ని చూశాక, సూర్యుడు 3 , 7, 10,11 స్థానాలలో ఉన్న ఎడల మహర్దశ సమయంలో మాత్రమే ధరించవలసినదిగా సూచించడమైనది.

మీన రాశి :

మీన రాశి :

జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 6, 2 స్థానాలలో ఉన్న ఎడల, మీన రాశి వారు ధరించవచ్చు. కానీ మిగిలిన స్థానాలలో ఉన్న ఎడల జ్యోతిష్యుని సూచనల మేరకు మాత్రమే ధరించడం మంచిది. లేనిచో ఆర్ధిక, సామాజిక, మానసిక సంబంధిత సమస్యలను చూడవలసి ఉంటుంది.

English summary

WHO SHOULD WEAR A RUBY/MANIK

Ruby is the red gemstone, associated with the planet Sun. Sun is defined with qualities such as courage, authority and leadership. Those who have either the planet Sun placed at favourable places or those of the Sun's compatible planets so placed, they must should wear this gemstone. Others can wear it only under special cases.
Desktop Bottom Promotion