Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అమ్మాయి దుస్తులు విప్పించి.. నగ్న ఫొటోలు తీసి.. వాట్సాప్ లో షేర్ చేసి రేప్ చేయబోయిన క్యాబ్ డ్రైవర్
బెంగళూరుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ (26) విమానాశ్రయానికి వెళ్లేందుకు అర్ధరాత్రి దాటాక ఓలా క్యాబ్‌ను బుక్ చేసింది.బెంగళూరు క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, క్యాబ్ డ్రైవర్ రేప్, దుస్తులు విప్పించిన క్యాబ్ డ్రైవర్
బెంగళూరులో పెద్దగా మోసాలు, క్రైమ్ జరగదని అందరూ అనుకుంటారు. కానీ సిలికాన్ సిటీలో కూడా ఈ మధ్య దారుణాలు ఎక్కువై పోయాయి. ఒంటరిగా ఒక అమ్మాయి వెళ్తే ఆమెను రకరకాలు వేధించే వారు ఎక్కువై పోయారు. ఇక క్యాబ్ లో ఒంటిరిగా ఎటైనా ప్రయాణించాలంటే తాజాగా జరిగిన ఒక సంఘటనతో అమ్మాయిలు చాలా భయపడుతున్నారు.

డ్రైవర్ టార్గెట్ చేశాడు
బెంగళూరులో తాజాగా క్యాబ్‌లో ప్రయాణిస్తున్న యువతిని ఒక డ్రైవర్ టార్గెట్ చేశాడు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికురాలిపై ఓలా డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

ఓలా క్యాబ్‌ను బుక్ చేసింది
బెంగళూరుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ (26) విమానాశ్రయానికి వెళ్లేందుకు అర్ధరాత్రి దాటాక ఓలా క్యాబ్‌ను బుక్ చేసింది. తాను ప్రయాణించాల్సిన విమానం ఉదయం 2 గంటలకు ఉండటంతో.. దాన్ని అందుకోడానికి ఆమె అర్ధరాత్రి తర్వాత క్యాబ్ బుక్ చేసుకుంది. ఒంటరిగా బయలుదేరిన యువతిపై క్యాబ్ డ్రైవర్ కన్నేశాడు.

అడ్డదారిలో
ఈ క్రమంలో టోల్ గేటు సమీపంలోకి రాగానే అడ్డదారి గుండా ట్యాక్సీని పోనిచ్చాడు డ్రైవర్. ఇదేంటని ఆమె ప్రశ్నించింది. ఫ్లైట్ కు టైమ్ అవుతుంది కదా.. అందుకే అడ్డదారిలో వెళ్తున్నా. ఇలా అయితే వేగంగా వెళ్లొచ్చు అన్నాడు.

మౌనంగా ఉండిపోయింది
ఆమె కూడా డ్రైవర్ చెప్పేది నిజమేననుకుని మౌనంగా ఉండిపోయింది. అనంతరం విమానాశ్రయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపాడు డ్రైవర్. ఇక్కడ ఎందుకు ఆపాడో అని ఆమె ఆలోచించే లోపే డ్రైవర్ ఆమెను బంధించాడు. డోర్స్ లాక్ చేశాడు.

దుస్తులు విప్పు
ఆమె మొబైల్‌ను లాక్కున్నాడు. అరిచేందుకు ప్రయత్నిస్తే స్నేహితులను పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడతామని బెదిరించాడు. నీ దుస్తులు విప్పు అని బెదిరించాడు. ఆమె ప్రతిఘటించటంతో ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. రేప్ చేస్తానన్నాడు.

దుస్తులు విప్పాల్సి వచ్చింది
ఆమె ఏం చేయాలో పాలుపోక చివరకు బలవంతంగా దుస్తులు విప్పాల్సి వచ్చింది. ఆమె నగ్న ఫొటోలు తన మొబైల్ లో తీసుకున్నాడు. అనంతరం వాటిని ఆమె ఎదుటే వాళ్ల ఫ్రెండ్స్ కు వాట్సాప్‌లో షేర్ చేశాడు. విషయం బయటికి చెబితే ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో వైరల్ చేస్తానని బెదిరించాడు.

ఎవరితోనూ చెప్పను
అయితే అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ విషయం ఎవరితోనూ చెప్పనని, తనను ఎయిర్‌పోర్టులో విడిచిపెట్టాలని బాధిత మహిళ అభ్యర్థించింది. దీంతో చివరికి ఆమెను విమానాశ్రయంలో వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు.

పోలీసులకు ఫిర్యాదు
అనంతరం బాధిత మహిళ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం వేట ప్రారంభించారు. మూడంటే మూడు గంటల్లో డ్రైవర్ అరుణ్‌ను అరెస్ట్ చేశారు.

ఓలా యాజమాన్యానికి నోటీసులు
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరుణ్‌ని.. డ్రైవర్‌గా నియమించినందుకు ఓలా యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. డ్రైవర్ వెరిఫికేషన్‌ను ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ధైర్యంగా తమకు ఫిర్యాదు చేసిన మహిళను అభినందిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి సీమంత్ కుమార్ పేర్కొన్నారు.

డ్రైవర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాం
కాగా, ఓలా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇదో దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. డ్రైవర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు చెప్పారు. తమ వైపు నుంచి కూడా అతనిపై చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇప్పుడేం కొత్తకాదు
క్యాబ్ లలో అత్యాచారాలు, బెదిరింపులు అనేవి ఇప్పుడేం కొత్తకాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా వీటిని పూర్తి రూపు మాపడంలో పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది.

హైదరాబాద్ లో కూడా
గతంలో హైదరాబాద్ లో ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి.. అత్యాచారానికి యత్నించిన క్యాబ్ డ్రైవర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2018 జనవరి 5న రాత్రి 10.50 నిమిషాల సమయంలో ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుంది. అయితే అటు వెళ్తున్న క్యాబ్ డ్రైవర్.. ఆ మహిళను చూసి లిఫ్ట్ ఇస్తానని ఆమెకు చెప్పాడు.

అత్యాచారం చేసేందుకు..
కారులో మహిళ ఎక్కిన తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దారి మరల్చిన డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. కాపాడంటూ ఆవిడ గట్టిగా కేకలు వేయడంతో బాధితురాలని రోడ్డుపైనే వదిలి పారిపోయాడు.

అత్యాచార యత్నానికి పాల్పడ్డారు
అలాగే గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో విజయవాడకు చెందిన ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. విజయవాడ వెళ్లేందుకు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో నిల్చున్న ఆ యువతికి మహేష్, నికోలస్ అనే క్యాబ్ డ్రైవర్లు మాయమాటలు చెప్పి క్యాబ్‌లో ఎక్కించుకున్నారు. పంతంగి టోల్‌గేట్ దాటిన తర్వాత ఆ యువతిపై వీళ్లిద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ బృందం మహేష్, నికోలస్ అనే క్యాబ్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుంది.

భోపాల్ లో..
అలాగే గతంలో భోపాల్ లో ఓ క్యాబ్ డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ క్యాబ్ లో ఇంటికి బయలుదేరింది. అయితే మార్గం మధ్యలో క్యాబ్ అపిన డ్రైవర్ దీపక్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పైగా ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాధితురాలు విషయాన్ని భర్తకు చెప్పింది. మొత్తానికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

సరైన భద్రత లేకపోవడంతో
అయితే అమ్మాయిలకు సరైన భద్రత లేకపోవడంతో ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లాలంటే అమ్మాయిలు జంకుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది. మెట్రో సిటీల్లో కూడా అమ్మాయిలకు సరైన భద్రత లేక భయం గుప్పిట్లో అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా క్యాబ్ ల్లో ప్రయాణించే అమ్మాయిలకు గట్టి భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.



Click it and Unblock the Notifications











