For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రబ్బర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ; యశ్ షా గురించి తెలుసుకోండి

  |

  యోగా చేస్తే మనందరికీ అన్పిస్తుంది శరీరాన్ని ఎంత విచిత్రమైన పొజిషన్ లో అయినా వంచటం సులభమని. కానీ ప్రాక్టీసు చేస్తుంటే నిజంగా తెలుస్తుంది ఈ వ్యాయామం ఎంత కష్టమైనదో!

  అదేవిధంగా, మనం ఎవరన్నా యోగా చేస్తుంటే చూస్తే మనకి కూడా సులభమైనదనే అన్పిస్తుంది, ఇదిగో ఇలాంటి విచిత్ర పనిని ప్రయత్నిస్తే తప్ప!

  ఇక్కడ, ఈ కేసులో మీకు మేమొక యువకుడు యశ్ షా కథ చెప్పబోతున్నాం, ఇతను అందరికన్నా ఫ్లెక్సిబుల్ వ్యక్తిగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.

  ఈ యువకుడు ఇదివరకే కొన్ని రికార్డులు దాటేసాడు, ఇప్పుడు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి ఎదురుచూస్తున్నాడు.

  Yash Shah: The Rubber Man Of India

  ఈ వ్యక్తి కథలో అన్నిటికన్నా ప్రేరణనిచ్చే విషయం అతను కేవలం ఆన్ లైన్ లో వీడియోలను చూసి ప్రేరణపొంది తన కలలను నెరవేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు!

  యువతకి ప్రేరణగా మారిన ఈ యువకుడి గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ కింద చదివి తెలుసుకోండి.

  అతని కథ చదవండి

  చిన్నప్పటి జీవితం

  యశ్ షా భారతీయుడు, గుజరాత్ లోని సూరత్ లో పుట్టి పెరిగాడు. టీనేజ్ మొదట్లో, యోగా ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాడు. 17ఏళ్ళప్పుడు, అమెరికన్ కంటోర్షనిస్ట్ అయిన డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ ను చూసి ప్రేరణపొందాడు.

  అతని ప్రేరణను అనుసరించాడు

  యశ్ మొదట్లో ఆన్ లైన్లో స్మిత్ వీడియోలు చూస్తూ యోగా ప్రాక్టీసు చేయటం మొదలుపెట్టాడు. ఒక ఏడాదిపాటు సుదీర్ఘంగా, లోతుగా ప్రాక్టీసు చేసాక యశ్ ఫ్లెక్సిబుల్ గా మారిపోయాడు. ప్రస్తుతం అతనికి 2 ప్రపంచ రికార్డులు, 1 జాతీయ రికార్డు ఉన్నాయి.

  తాతయ్య ప్రోత్సాహం ఇచ్చారు

  యశ్ షా తాతగారు రామ్ లాల్ కన్యాలాల్ యశ్ ను కంటోర్షనిస్టుగా అవమని ప్రోత్సహించారు. ఆయన యశ్ తీవ్రంగా ప్రాక్టీసు చేసేలా చూసారు. నిజమైన కోచ్ లాగా, తాతగారు వివిధ కంటోర్ టెక్నిక్కులన్నీ చూపించే ఆసనాలను యశ్ నేర్చుకునేలా చేసారు.

  అతని నైపుణ్యాల గురించి

  గట్టి ప్రాక్టీసుతో యశ్ కి చాల ఫ్లెక్సిబుల్ శరీరం వచ్చేసింది. అతని ఫ్లెక్సిబులిటీ ఏ స్థాయిలో ఉందంటే అతను సులభంగా తన తలను 180° వెనక్కి తిప్పగలడు. అతను రెండు భుజాల నుంచి వేరు కూడా చేసుకోగలడు. ఇదేకాక, అతని ఫ్లెక్సిబులిటీతో తన ఛాతీని కూడా 180° వెనక్కి తిప్పగలడు, చేతులను 360° కన్నా ఎక్కువగా గుండ్రంగా తిప్పగలడు. ఈ రబ్బర్ మ్యాన్ కి తన కాళ్ళను కూడా 360° తిప్పగలడు కాబట్టి అధునాతనంగా ముందు వైపు శరీరం కూడా ఫ్లెక్సిబుల్ గా మారింది!

  అతన్ని అందరూ రబ్బర్ బాయ్ అని పిలుస్తారు

  అతని ఫ్లెక్సిబులిటీ, శరీరాన్ని ఎటుపడితే అటు వంచే తీరు అద్భుతంగా ఊళ్ళో ప్రజలను సమ్మోహపరిచాయి. ఇలా చాలా విచిత్రంగా శరీరాన్ని వంచే నైపుణ్యంతో, యశ్ ను ఊళ్ళో అందరూ రబ్బర్ బాయ్ అని పిలవటం మొదలుపెట్టారు. అతను ఈ రబ్బరులాగా కాళ్ళని వంచే నైపుణ్యాలను చిన్నప్పటి నుంచే ప్రాక్టీసు మొదలుపెట్టాడు కాబట్టి అతని ఫ్లెక్సిబులిటీ స్థాయి మరింత పెరిగింది. యశ తన శరీరాన్ని మొత్తం ఒక టెన్నిస్ రాకెట్ లోంచి కూడా బయటకి తీయగలడు!

  ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉండటం అంత సులభమేమీ కాదు

  నిజం చెప్పాలంటే యశ్ ను అడిగినప్పుడు, అతను కొత్తగా ప్రాక్టీసు మొదలుపెట్టినప్పుడు ఎంత నొప్పి కలిగేదో వివరించాడు. కానీ సమయం గడిచేకొద్దీ నొప్పి,బాధ తగ్గిపోయాయని చెప్పాడు.

  అతని ఆరోగ్య చరిత్ర

  డాక్టర్ రాజీవ్ చౌదరి అనే పేరు కల వ్యక్తి యశ్ ఒక జన్యులోపంతో బాధపడుతున్నాడని దానివలనే అతను ఎక్కువగా ముఖ్యంగా కాలి ఎముకల దగ్గర ఫ్లెక్సిబుల్ గా మారాడని తెలిపారు. యశ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు, డాక్టర్ అతని శరీరం ప్రత్యేకంగా ఉందని గుర్తించారు, అలా కొద్దిమందిలోనే కన్పిస్తుంది.

  అతని ప్రత్యేక నైపుణ్యాలు ఇంకా ఏంటంటే

  యశ్ మిగతావాళ్ళ కన్న వేరు, తన శరీరాన్ని ఎటుపడితే అటు వంచగలడని వాళ్ళ అమ్మగారు చాలా గర్వపడతారు. అతని ఈ ఫ్లెక్సిబులిటీ దేవుడి వరంగా భావిస్తారు. వాళ్ళ అమ్మనే మొదట సూరత్ లో ఉన్న ప్రతి యోగా టీచర్ దగ్గరకీ వెళ్ళి తన బిడ్డకి ఇంకా మెరుగైన శిక్షణనిమ్మని కోరేవారు. కానీ అన్నిచోట్లా యశ్ కి అన్ని టెక్నిక్కులు ఇంతకు ముందే వచ్చు అని జవాబు వచ్చేది. అతని తల్లిదండ్రులు ఇప్పుడు యశ్ లో ఈ నైపుణ్యాలను సానబెట్టే కోచ్ కోసం శిక్షణకోసం వెతుకుతున్నారు.

  జీవితంలో ఆశయం ఏంటంటే

  యశ్ జీవిత లక్ష్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డు బద్దలు కొట్టి తన పేరు చేర్చడం. అలాగే ఇప్పటివరకు భారతదేశంలోనే అందరికన్నా ఫ్లెక్సిబుల్ వ్యక్తి టైటిల్ ఉన్న లూథియానాకి చెందిన 17ఏళ్ళ అబ్బాయి జస్ప్రీత్ సింగ్ రికార్డును గెలవటం. అతను 'మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఇండియన్’ బిరుదును,పేరును పొందాడు. ప్రస్తుతం యశ్ తన చదువును కొన్నాళ్ళు ఆపి తన ఆసక్తిపై శ్రద్ధ పెడుతున్నాడు.ఒక రోజు ప్రపంచంలోనే ఫేమస్ కావాలన్న కలకి కష్టపడుతున్నాడు.

  యశ్ ఇప్పుడు తన ప్రత్యేక నైపుణ్యంతో పెద్ద పత్రికలు, వార్తాపత్రికలపై కూడా కన్పిస్తున్నాడు. మనం ఇక్కడ బోల్డ్ స్కైలో కూడా తన భవిష్యత్తు ప్రయత్నాలలో అదృష్టం కలిసిరావాలని కోరుకుంటున్నాం.

  ఇలాంటి ప్రేరణనిచ్చే కథలు మరిన్ని చదవాలనుందా? అయితే,మీ ఆలోచనలను మాతో పంచుకోండి, మా సెక్షన్ లో వాటిని ప్రచురిస్తాం.

  English summary

  Yash Shah: The Rubber Man Of India

  Yash Shah is a contortionist who was born to Mr. Shah and Mrs. Kamini Shah and lives in Kamrej, Surat district in Gujarat. He is a very flexible teen who has the ability to turn his neck to 180 degrees and bends his limbs to 360 degrees. He is popularly known as the Rubber Man of India.He Is The Rubber Man Of India
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more