Latest Updates
-
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.!
39 మంది భార్యలతో ఎంజాయ్ చేస్తున్న భారతీయుడు, తెగ విస్తరించాలనే తాపత్రయంతో అలా, నిజంగా మగాడే
జీయోనా చానాది మిజోరం. అక్కడి బక్త్వాంగ్ విలేజ్ లో ఈయన ఉంటున్నాడు. జీయోనా చానాకు పదిహేడవో ఏటనే వివాహమైంది. ఇక్క అప్పటి నుంచి ఒక లక్ష్యం ఏర్పరుచుకున్నాడు.
ఈ ప్రపంచంలో అంత పెద్ద ఫ్యామిలీ ఏ వ్యక్తికి ఉండదేమో. ఒక వేళ ఉన్నా దూరపు బంధువులతో కలిపి ఉంటుందిగానీ ఇలా ఒకే వ్యక్తికి సంబంధించిన కుటుంబం మాత్రం లేదు.ఈ వరల్డ్ లో కుటుంట సభ్యుల విషయంలో, భార్యల విషయంలో ఆయనే ఫస్ట్. అసలు ఎవరు ఈయన అనుకుంటున్నారా? ఆయన పేరు జీయోనా చానా. పేరు చదివి చైనా వాడు అనుకునేరు. మన భారతీయుడే ఈ రికార్డ్ నెలకొల్పాడు.
జీయోనా చానాది మిజోరం. అక్కడి బక్త్వాంగ్ విలేజ్ లో ఈయన ఉంటున్నాడు. జీయోనా చానాకు పదిహేడవో ఏటనే వివాహమైంది. ఇక్క అప్పటి నుంచి ఒక లక్ష్యం ఏర్పరుచుకున్నాడు. పెళ్లిళ్లు చేసుకోవడం భార్యల ద్వారా ఎంత సాధ్యమైతే అంత పిల్లలు కనేలా చేయడమే పనిగా పెట్టుకున్నాడు.

పదిహేడో ఏట నుంచే పెళ్లిళ్లు
ఈయన తన పదిహేడో ఏట నుంచి మొన్నటి దాకా పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు. ఏడాదికి ముగ్గురు నలుగురు చొప్పున్న భార్యలను ఈయన పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈయనమకు మొత్తం 39 మందిని చేసుకున్నాడు. 90 మందికి పైగా ఈయన పిల్లలున్నారు. ఇక ఈయన కొడుకులు, కోడళ్లు, మనువళ్లు అందిరితో కలిపితే 200 మందికి పైగా ఉంటారు.

ఎంతమంది భార్యలనైనా పెళ్లి చేసుకోవొచ్చు
వీళ్లంతా ఒకే ఇంట్లో ఉండడం విశేషం. ఈయన 1945లో పుట్టారు. జీయోనా చానా క్రిస్టియన్. అయితే వీరి తెగ ప్రకారం ఎంతమంది భార్యలనైనా పెళ్లి చేసుకోవొచ్చు. తన కుటుంబం అంతా ఒకే చోట నివసించడానికి చానా నాలుగు అంతస్థుల బిల్డిండ్ నిర్మించుకున్నాడు. వందకు పైగా రూమ్స్ అందులో ఉన్నాయి.

74 వ బర్త్ డే
జీయోనా తాజాగా 74 వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులందరితో ఇప్పటికీ జియోనా చానా ఎంతో సంతోషంగా గడుపుతున్నాడు. ఇక ఈ కుటుంబం మొత్తం నాన్ వెజిటేరియన్ తినాలంటే రెండు మూడు యాటలు తెగాల్సిందే. కోడి కూర తినాలనుుకుంటే యాభై అరవై దాకా కోళ్లను వండుకుంటారు.

చీట్ చేసి పెళ్లి చేసుకోలేదు
రోజూ అదరూ తినే అన్నం కోసం సుమారు అరవై కేజీలకు పైగా బియ్యాని వినియోగిస్తారు. వీళ్లు రోజూ ఆలు కర్రీనే తింటారు. అందుకోసం నిత్యం వంద కేజీల ఆలగడ్డలను కొంటూ ఉంటారు. జియోనా తన భార్యల్లో ఎవరినీ కూడా చీట్ చేసి పెళ్లి చేసుకోలేదు. జీయోనా చానా తన భార్యలతో గడపడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తాడు. భార్యలంతా కలిసి తమ భర్తతో ఈ రోజు ఎవరు గడపాలి అని నిర్ణయించుకుని అతనితో గడుపుతారు. భార్యల మధ్య గొడవలు కూడా తలెత్తవట.

స్వయం ఉపాధినే నమ్మకుని బతుకుతున్నారు
ఇంటికి వచ్చే బంధువుల కోసం ప్రత్యేకంగా ఒక గెస్ట్ హౌస్ కూడా చానా నిర్మించాడు. తమ పిల్లలంతా చదువుకునేందుకు వీలుగా ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేశాడు. అందులో చానా కుటుంబ సభ్యులే టీచర్లు. అలాగే జీయోనా కుటుంబ సభ్యులంతా కూడా స్వయం ఉపాధినే నమ్మకుని బతుకుతున్నారు. వ్యవసాయం చేస్తూ వారి ఆహారాన్ని వాళ్లే సమకూర్చుకుంటున్నారు. అలాగే కోళ్లను, పందులను పెంచుతూ బతుకుతున్నారు.

అత్యధిక కుంటుంబ సభ్యులు కలిగినవ వక్తిగా రికార్డ్
అలాగే రకరకాల పనులు కూడా జీయోనా కుటుంబ సభ్యులు చేస్తూ ఉంటారు. జీయోనా చానా ప్రపచంలోనే అత్యధిక కుంటుంబ సభ్యులు కలిగినవ వక్తిగా రికార్డ్ సాధించాడు. తమ తెగ సంప్రదాయం ప్రకారమే తాను అత్యధిక వివాహాలు చేసుకున్నానని తనకు పెళ్లిళ్లంటే మోజు లేదని చెబుతాడు జీయోనా చానా.

తెగను విస్తరించాలనే తలంపుతోనే
తన తెగను అత్యధికంగా విస్తరించాలనే తలంపుతోనే ఇలా చేశానంటున్నాడు. ఇక మిజోరం ఎలక్షన్ సమయంలో జియోనా ఛనా కుంటుంబం వద్ద రాజకీయ నాయకుల సందండి ఉంటుంది. జియోనా చనాతో స్థానిక నేతలు ఆ సమయంలో ఎక్కువ మంతనాలు చేస్తారు.

ఓటు వేయించాలని
జియోనా చనా ఉండే గ్రామం తుయ్ కుమ్ నియోజకవర్గం కిందకు వస్తుంది. దీంతో ఆ నియోజవర్గంలోని నాయకులంతా చనాను అతని కుటుంబ సభ్యులచే తమకే ఓటు వేయించాలని కోరుతుంటారు.

ప్రజలంతా అతని మాటే వింటారు
చానా చెబితే అతని కుటుంబంతో పాటు బక్త్వాంగ్ గ్రామంలోని ప్రజలంతా వింటారు. అందుకే అతనికి ఆ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక అంత పెద్ద కుటుంబాన్ని అంతమంది భార్యల్ని మెయిన్ టెన్ చేస్తున్నాడే నిజంగా అతను గట్స్ ఉన్న మగాడే అంటున్నారు జనాలంతా.
Image credit All pics:http://www.northeastindia24.com/



Click it and Unblock the Notifications
