Latest Updates
-
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.!
2019లో మీ రాశి ప్రకారం ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి, ఆ రాశులవారికి ఇష్టపడ్డవారు దగ్గరవుతారు
ప్రేమకు సంబంధించిన విషయాల్లో 2019లో కాస్త బలంగా ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ప్రేమలో గెలుపొందాలనుకుంటారు. ప్రేమకు సంబంధించి మీరు చాలా తెలివిగా దూసుకెళ్తారు. క్లిష్టపరిస్థితులను కూడా ఎదుర్కొంటారు
2019లో మీ రాశి ప్రకారం ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి, ఆ రాశులవారికి ఇష్టపడ్డవారు దగ్గరవుతారు
2019 కొన్ని రాశుల వారి జీవితం సెట్ కానుంది. వారి లైఫ్ పార్టనర్ వాళ్లకు దగ్గరకానున్నారు. మీ రాశిని బట్టి 2019లో మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మేషం (మార్చి 21 నుండి ఏప్రిల్ 19)
మేషరాశి వారు ప్రేమకు సంబంధించిన విషయాల్లో 2019లో కాస్త బలంగా ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ప్రేమలో గెలుపొందాలనుకుంటారు. ప్రేమకు సంబంధించి మీరు చాలా తెలివిగా దూసుకెళ్తారు. క్లిష్టపరిస్థితులను కూడా ఎదుర్కొంటారు.

వృషభం (ఏప్రిల్ 20 నుండి మే 21 వరకు)
వృషభరాశి వారు 2019 లో కుటుంబంపరంగా ఎలాంటి సమస్యలకు గురికారు. అలాగే మీరు కొనసాగించే ప్రేమబంధానికి కూడా మీ ఇంట్లో వాళ్లు సపోర్ట్ ఇస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.

మిథునరాశి (మే 22 నుంచి జూన్ 21 వరకు)
2019లో మిథునరాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకునేందుకు ఇది సరైన సమయం. అందువల్ల ఆలస్యం చేయకుండా త్వరపడి పెళ్లి చేసుకోండి.

కర్కాటక రాశి (జూన్ 22 నుంచి జూలై 22)
కర్కాటక రాశి వారు గతంలో ఎవరితోనైనా ప్రేమాయాణం నడిపించి ఆ బంధం తెగిపోయి ఉంటే మళ్లీ ఇప్పుడు బలపడుతుంది. ఇక మీరు ప్రేమించిన వారితో సోషల్ మీడియాటచ్ లో ఉంచడానికి ప్రయత్నించండి. మొత్తానికి మీ పాత బంధాలు మళ్లీ కలుస్తాయి.

సింహరాశి (జూలై 23 నుండి ఆగష్టు 22)
ఇప్పటి వరకు ప్రేమలో పడకుండా సింగిల్ గా ఉన్న
సింహరాశి వారు 2019లో ప్రేమలో పడతారు. మీకు తగిన జోడి దొరుకుతుంది. ఇక త్వరలో మీకు నచ్చిన వారితో వివాహం కూడా జరగనుంది.

కన్య రాశి (ఆగష్టు 23 నుంచి సెప్టెంబర్ 22)
ప్రేమపరంగా కన్య రాశి వారికి 2019 చాలా మంచి సంవత్సరం. వారు కోరుకున్న వ్యక్తితో ప్రేమ కొనసాగించే అవకాశం దక్కుతుంది. మీరు అనుకున్నవన్నీ అయ్యే అవకాశం ఉంది.

తులరాశి (సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22)
తులరాశి వారికి ప్రేమపరంగా ఈ ఏడాది అనుకూలం.
మీరు గతంలో ఎవరితోనైనా ప్రేమ నడిపినా, లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుని చేసుకోలేకపోయినా ఈ ఏడాది కచ్చితంగా వారు మీకు దగ్గరవుతారు.

వృశ్చికం (అక్టోబర్ 23 నుంచి నవంబరు 22 వరకు)
వృశ్చికరాశి వారు వారిని ప్రేమించే మనుషులకు దగ్గరవుతారు. మీ ప్రేమ మరింత బలపడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల మీ ప్రేమలో ఏదైనా ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు రాశి (నవంబర్ 23 నుంచి డిసెంబర్ 21 వరకు)
ధనుస్సు రాశి వారికి కూడా వారు ప్రేమించిన వారు మరింత దగ్గరవుతారు. ఏదైనా కారణం చేత మీ ప్రేయసి లేదంటే ప్రేమికుడు మీకు దూరం అయినట్లయితే ఇప్పుడు మళ్లీ వారిని కలవడానికి అవకాశం ఉంటుంది.

మకరం 2019 లవ్ (డిసెంబర్ 22 నుంచి జనవరి 20)
మకరరాశి వారు కూడా 2019 లో మంచి ప్రేమను పొందుతారు. మీ భాగస్వామి ఏదైనా గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటే, వెంటనే దాన్ని పరిష్కరించండి.

కుంభరాశి (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 18 వరకు)
కుంభరాశి వారు ఈ సంవత్సరం వారి ప్రేమించిన వారి ప్రేమను పొందుతారు. మీరిద్దరూ కలిసేందుకు చాలా అవకాశాలు వస్తాయి. కొన్ని అకేషన్స్ లో మీరిద్దరూ తరుచూ కలుస్తారు. అలా మీ మధ్య ప్రేమ పెరిగిపోతుంది.

మీనరాశి (ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు)
జూన్ 2019 లో మీనరాశి వారు మీకు నచ్చిన వారితో కొన్ని రకాల అడ్వెంచర్స్ కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మీరిద్దరి మధ్య బంధం బలపడుతుంది. మీరు ప్రేమించే వారు మీకు మరింత దగ్గరవుతారు. మిమ్మల్ని ఎవరూ విడదీయరు.



Click it and Unblock the Notifications