Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే, మరణ భయంతో అలా చేస్తారు
మరణం దగ్గరపడే కొద్దీ మీ శరీరం ఆకారం తీరు కూడా మారుతుంది. రక్తపోటు పెరిగిపోతుంది. చర్మం పాలిపోతుంది. నీలం-ఊదా రంగులోకి మారిపోతుంది. ఇక మూత్రం రంగు కూడా మారిపోతుంది. బ్రౌన్, రస్ట్ కలర్ లోకి మారతుంది. జ
ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. కొందరు అకస్మాకికంగా మరణిస్తుంటారు. మరికొందరు వృద్దాప్యం వరకు జీవించగలుగుతారు. అయితే వృద్దాప్యంలోకి వెళ్లిన తర్వాత చావు దగ్గరపడుతుంది అని ప్రతి మనిషికి తెలుస్తుంది.
ప్రవర్తన తీరును బట్టి
అలాంటి వ్యక్తులు కొన్ని రకాల సూచనలను కూడా అవతలి వ్యక్తులకు అందిస్తుంటారు. వారి ప్రవర్తన తీరును బట్టి వారు మరణానికి దగ్గరకు ఉన్నారని కూడా మనం తెలుసుకోవొచ్చు.

భౌతిక మార్పులు
మరణం దగ్గరపడే కొద్దీ మీ శరీరం ఆకారం తీరు కూడా మారుతుంది. రక్తపోటు పెరిగిపోతుంది. చర్మం పాలిపోతుంది. నీలం-ఊదా రంగులోకి మారిపోతుంది.

మూత్రం రంగు
ఇక మూత్రం రంగు కూడా మారిపోతుంది. బ్రౌన్, రస్ట్ కలర్ లోకి మారతుంది. జుట్టు, దంతాలు చాలా బలహీనంగా మారుతాయి. వాటి రంగు మొత్తం మారిపోతుంది.

ఆకలి తగ్గిపోతుంది
వృద్దాప్యంలో , చావు చివరి రోజుల్లో దేనిపై ఆసక్తి ఉండదు. అన్నం తినాలనే ధ్యాసే ఉండదు. మంచి భోజనం తీసుకొచ్చి ముందుపెట్టినా తినబుద్ది కాదు. ఏదీ తాగాలనిపించదు.

నీరసం
దీంతో శరీరం మొత్తం నీరసంగా మారుతుంది. మీపై ప్రేమతో గోరు ముద్దులు తినిపించాలనుకునేవారిపై కూడా కోప్పడుతారు. అలా అన్నం సరిగ్గా తినకపోవడంతో పోషణ తక్కువై బాగా చిక్కిపోతారు.

బాగా నిద్రపోవాలనిపిస్తుంది
ఒకవైపు శరీరం నీరసంగా మారినా కూడా మరోవైపు గంటల తరబడి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. బాగా నిరుత్సాహంగా మారుతారు.

అలసట
మరణ సమయం దగ్గరపడే కొద్దీ శరీరంలో జీవక్రియ తగ్గుతుంది. అలాగే ఎప్పుడూ అలసటకు గురవుతూ ఉంటారు.

శ్వాస సమస్య
మరణం దగ్గరపడే కొద్దీ శ్వాస సమస్యలు కూడా ఎక్కువైపోతాయి. ఒక్కోసారి శ్వాస వేగంగా తీసుకోవడం, మరోసారి శ్వాస చాలా నెమ్మదిగా తీసుకోవడం జరుగుతాయి. శ్వాస తీసుకునే ప్రతిసారి ఇబ్బందిపడాల్సి వస్తుంది. చావు దగ్గర పడిందనడానికి ఇది ఒక హెచ్చరిక.

అసహనం
జీవితం చివరి దశలో ప్రతి వ్యక్తి అసహనం పెరిగిపోతుంది. తాను నిరాశ్రయుడని ఆందోళన చెందుతూ ఉంటాడు. మనస్సు అంతా గందరగోళంగా ఉంటుంది. కట్టుకున్న వస్త్రాల్లోనే టాయ్ లెట్ చేసుకుంటూ ఉంటారు.

మనుషులకు దూరం అవుతూ ఉంటారు
చావు దగ్గర పడే కొద్దీ మనుషులకు దూరం అవుతూ ఉంటారు. ఎప్పటికైనా తాను ఒంటిరిగానే మట్టిలో కలిసిపోవాలని బోధపడుతుంది. తాము బాగా ఇష్టపడే వ్యక్తులకు కూడా దూరంగా ఉంటారు. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు.

కనపడని వ్యక్తులతో మాట్లాడుతుంటారు
మరణం సమీపించే సమయంలో కొందరు ఎదుట ఒక వ్యక్తి ఉన్నట్లు ఊహించుకుని అతనితో తన గోడు మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే చిత్రవిచిత్రమైన కలలు వారికి వస్తుంటాయి.

అందరికీ గుడ్ బై చెప్పడం
చావు చివరి రోజుల్లో ప్రతి వ్యక్తి తనను చూడడానికి వచ్చిన వారికి గుడ్ బై చెబుతూ ఉంటాడు. మీరందరూ బాగుండండి అని సూచనలు ఇస్తారు. త్వరలో నేను ఎలాగో చనిపోతాను అని మనస్సులో అనుకుంటూ ఉంటారు.

జాగ్రత్తలు చెబుతూ ఉంటారు
అందరికీ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ చావు చివర రోజుల్లో వ్యక్తుల్లో ఎక్కువగా కనపడుతుంటాయి.



Click it and Unblock the Notifications
