Latest Updates
-
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే.. -
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు.. -
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ! -
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు! -
భార్యతో రోజూ గొడవనా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే హ్యాపీగా ఉంటారు! -
శని ప్రదోషం, అనురాధ నక్షత్రం కలయిక: ఈ 5 రాశుల వారికి కెరీర్లో ఊహించని అదృష్టం! -
జీర్ణశక్తిని పెంచే అల్లం కొత్తిమీర చట్నీ.. వేడి వేడి అన్నం, టిఫిన్స్ లోకి అమృతంలా,, -
శనివారం అనురాధ నక్షత్రం: ఈ పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహంతో మీ కష్టాలు తీరుతాయి! -
వేదాలు చెప్పే సంతోషకరమైన జీవితానికి 7 మూల సూత్రాలు -
శని ప్రదోషం: ఈరోజు శివారాధనతో మీ కష్టాలు మాయం.. రాశి ప్రకారం పరిహారాలు ఇవే!
ధనస్సులోకి కేతువు వస్తున్నాడు అన్ని రాశులపై ప్రభావం, చాలా రాశులకు చెడ్డ రోజులే
వీరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే వీరు అనుకునే పనులు అంత త్వరగా పూర్తికావు. పెట్టుబడుల విషయంలో చాలా ఇబ్బందులుపడుతారు. వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నల్ల నువ్వులను ద
రాహువు, కేతువు గురించి మన అందరికీ తెలుసు. కేతువు ప్రభావం ఈ ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోండి మరి. ఈసారి మకరంలో కేతువు ప్రవేశించాడు. ప్రతి రాశిలో రాహు కేతువులు 18 నెలల పాటు ఉంటారు.
2019 మార్చి 7 న ధనుస్సు రాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు. సెప్టెంబరు 23 2020న మళ్లీ వృశ్చికరాశిలోకి వెళ్తాడు. అయితే కేతువు 2019లో చాలా రాశులపై తన ప్రభావంచూపుతాడు. కొన్ని రాశులకు మంచి చేస్తే మరికొన్ని రాశులకు చెడు చేస్తాడు. కొన్ని రాశుల జీవితాల్లో కేతువు సంతోషాన్ని నింపనున్నాడు.

మేషరాశిపై కేతువు ప్రభావం
మేషరాశిపై కేతువు ప్రభావం ఇలా ఉండనుంది.
మేషరాశిలో థమంలో కేతువు ఉంటాయి. మార్చి తర్వాత నవమంలో కేతువు మేశరాశిలోకి వస్తాడు. దీంతో మేషరాశిపై కేతువు ప్రభావం కొంత మేరకు ఉంటుంది.

ఆర్థికంగా చాలా సమస్యలు
వీరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే వీరు అనుకునే పనులు అంత త్వరగా పూర్తికావు. పెట్టుబడుల విషయంలో చాలా ఇబ్బందులుపడుతారు. వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి
ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ తండ్రి తో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. మీ తండ్రిగారి ఆరోగ్యపరిస్థితి కాస్త బాగుండకపోవొచ్చు. మీరు ఎవరికైనా సరే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి దీని వల్ల మీరు కష్టాల నుంచి బయటపడొచ్చు.

వృషభరాశి
వృషభరాశిపై కూడా కేతు ప్రభావం ఉంటుంది. వృషభరాశి వారికి ఈ ఏడాది కాస్త గడ్డుకాలమే. వాహనాలు నడిపే విషయంలో గ్రత్తగా ఉండండి. మీకు ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి.

నువ్వుల నూనె
కొందరు వ్యక్తుల చెడు ప్రవర్తన మీకు ఇబ్బందికలిగిస్తుంది. మీరు కాస్త ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి. మీ కుటుంబంలో కొన్ని రకాల ఆటంకాలు కలగొచ్చు. స్నేహితులతో విభేదాలు రావొచ్చు. మీరు నువ్వు నూనెను దానంగా ఇవ్వండి.

మిథునం
మిథునరాశి వారిపై కూడా కేతువు ప్రభావం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ భార్య లేదా భర్తతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు రావొచ్చు. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉంండండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వినాయకుడికి గరికతో పూజ చేయండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశిపై కూడా కేతువు ప్రభావం ఉంటుంది. మీరు పని చేసే ప్రాంతంలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే డబ్బు సంపాదించే విషయంలో కూడా సమస్యలు తలెత్తొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగకండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు హనుమంతునికి పూజలు చేస్తే కాస్త కష్టాల నుంచి గట్టెక్కుతారు.

సింహరాశి
సింహరాశి పై కేతువు ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఆర్థికవిషయాల్లో జాగ్రత్త అవసరం.
పెట్టుబడులు, ఆస్తి సంబంధిత నిర్ణయాల విషయాల్లో ఒకట్రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇది మీకు అనుకూలమైన సమయం కాదు. మీ పిల్లలు అనారోగ్యం బారిన పడొచ్చు. భైరవ్ దేవ్ ఆలయంలో మీరు నల్ల రంగు జెండాను పెడితే మంచిది.

కన్య రాశి
కన్యరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులుపడతారు. మీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. మీ కుటుంబంలో చాలా వివాదాలు తలెత్తుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళనలు ఎక్కువవుతాయి. మీ తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పలు దేవాలయాలలో నీలం రంగు పుష్పాలతో పూజలు చేయండి.

తులరాశి
తులరాశి వారికి కేతువు చాలా ప్రయోజనాలు చేకూర్చనున్నారు. మీరు పర్యటనలు, ప్రయాణాలు చేయడం వల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. కొత్త వ్యక్తులు స్నేహితులు అవుతారు. మంచి మర్యాద ఉన్న వారు మీ ఫ్రెండ్స్ అవుతారు. ప్రస్తుత ఉద్యోగంలో మీరు ప్రమోషన్ పొందొచ్చు. అలాగే ఆర్థికంగా కూడా మీరు హ్యాపీగా ఉంటారు.

వృశ్చికరాశి
వృశ్చికరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆఫీస్ లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు ఏర్పడొచ్చు. ఖర్చులు పెరగొచ్చు. అనారోగ్యం బారినపడతారు. మీరు నీలం రంగు పూలతో ఆలయాల్లో పూజలు చేయండి.

ధనస్సు రాశి
ధనస్సు రాశిపై కేతువు ప్రభావం ఉంటుంది. మీ వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు మీ భార్యతో పెద్దపెద్ద గొడవలు వచ్చి కొన్ని రోజుల పాటు మాట్లాకుండా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులుపడతారు. అనారోగ్యాల బారినపడతారు. చికిత్సలు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు.

మకరరాశి
మకరరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులుపడతారు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోవొచ్చు. మీ ఆఫీస్ లో అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడొచ్చు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కొన్ని రకాలఅనారోగ్యాలను ఎదుర్కోవచ్చు. మీరు పేదలకు దుప్పట్లను దానంగా ఇస్తే మంచిది.

కుంభరాశి
కుంభరాశిపై కూడా అనుకూల ప్రభావం ఉంటుంది. మీ కెరీర్, వ్యాపారం విషయాల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఆర్ధికంగా కూడా లాభాలు పొందుదారు.

మీనరాశి
మీరు డబ్బును పొదుపు చేసే మార్గాలు తెలుసుకుంటారు. మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంతో తగినంత సమయాన్ని గడపలేరు.

నువ్వుల నూనె
ఆఫీస్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యాపారం మీకు చాలా లాభాలను తెస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నువ్వుల నూనె దానం ఇస్తే మంచిది.



Click it and Unblock the Notifications