Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదు
పట్నా జిల్లా పస్రా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు మహమ్మద్ సిర్మాన్ గా పోలీసులు గుర్తించారు. ఇతను మాధెపుర జిల్లాకు చెందిన వ్యక్తి అ
కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు వావి వరుసనే కాకుండా.. పశువుల కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులపైనే కాకుండా... వారి కామకోరికలు, పశువులపైనా చూపిస్తున్నారు. తాజాగా పట్నాలో జరిగిన ఘటన గురించి వింటే, యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ 28 ఏళ్ల వ్యక్తి, మేకపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఈ మేకకు తీవ్రంగా రక్తస్రావంది, తట్టుకోలేక తనువు చాలించింది.

పట్నాలో
పట్నా జిల్లా పస్రా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు మహమ్మద్ సిర్మాన్ గా పోలీసులు గుర్తించారు. ఇతను మాధెపుర జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిసింది.

కళ్లారా చూసిన చిన్నపిల్లలు
మేక యజమాని మహాజని దేవి ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనను కళ్లారా చూసిన చిన్న పిల్లలు, దేవికి తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన అతనికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పారని ఎస్ హెచ్ ఓ జై ప్రకాశ్ తెలిపారు. సిర్మాన్ అనే వ్యక్తి తన మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడని దేవి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు.

నేను ఏం చేయలేదు..
సిర్మాన్ పై ఐపీసీ సెక్షన్ 429, సెక్షన్ 377ల కింద కేసు బుక్ చేసినట్టు ప్రకాశ్ చెప్పారు. మేకపై నిజంగానే సిర్మాన్ అత్యాచారానికి పాల్పడ్డాడా... ? లేదా మరే ఇతర కారణాల వల్ల ఆ మేక చనిపోయిందా..? అనే విషయంపై విచారణ చేస్తున్నారు. నిందితుడు మాత్రం తాను ఏ నేరానికి పాల్పడలేదని చెబుతున్నాడు. దేవి చేస్తున్న ఆరోపణలను అతను కొట్టేస్తున్నాడు.

పున్ పున్ లో రోజువారీ కూలీ
చనిపోయిన మేకను పోస్టుమార్టం నిమిత్తం షేక్ పుర పశువుల ఆసుపత్రికి తరలించారు. సిర్మాన్ పున్ పున్ లో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతని ఫ్యామిలీ, మెడికల్ హిస్టరీని కనుగొంటున్నామని పోలీసులు చెప్పారు. సిర్మాన్ తనకు పెళ్లి అయిందని, ఇతర కూలీలతో కలిసి పున్ పున్ లో నివాసముంటున్నట్టు పోలీసులకు తెలిపాడు.



Click it and Unblock the Notifications