Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ధనుస్సు రాశి అమ్మాయి గుణగణాలు, భాగస్వామి తో ఎలా ఉంటుందంటే, ఆ విషయంలో కాస్త స్పీడ్
ధనుస్సు రాశి స్త్రీ చాలా విశ్వసనీయంగా ఉంటుంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలదు. అయితే, ఆమె కొన్నిసార్లు చాలా గర్వంగా కూడా ఉంటుంది. ధనస్సు రాశి అమ్మాయిలు ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటారు. మొత్తాన
ఒక్కొక్కరిది ఒక్కో రాశి ఉంటుంది. అయితే రాశుల వారీగా కొందరి ప్రవర్తన, గుణగణాలను కూడా అంచనా వేయొచ్చు. ఒక్కో రాశి అమ్మాయి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. ఇక ధనుస్సు రాశి అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందామా.
ధనస్సు రాశి వారు రాశి క్రమం ప్రకారం వీరు తొమ్మిదవ రాశిచక్రంలో ఉంటారు. ధనస్సు రాశి అమ్మాయిలు మంచి హాస్య చతురతను కలిగి ఉంటారు. ఆదర్శనీయంగా ఉంటారు. వీరికి నిజాయితీ ఎక్కువ.

చాలా ఉత్సాహంగా
ధనస్సు రాశి అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీళ్లు మంచి శక్తివంతులు కూడా. ధనస్సు రాశికి చెందిన ఆడవారు వారు చెయ్యాలనుకున్న పనిని కచ్చితంగా చేస్తారు.

బాగా చిరాకు
ఇతరులకు వేచి చూడడం అంటే ధనస్సు రాశి అమ్మాయిలకు బాగా చిరాకు. ఒక వేళ తను తన బాయ్ ఫ్రెండ్ కంటే ముందే పార్క్ కు వస్తే అక్కడ కూర్చొని అతను వచ్చే వరకు వెయిట్ చెయ్యడం అంటే ఆ రాశి అమ్మాయిలకు బాగా చిరాకు.

జంకడాలు.. బొంకడాలంటే
ధనస్సు రాశి అమ్మాయిల ప్రవర్తన కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. వీళ్లు ఇష్టపడ్డ అబ్బాయిలతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. మనస్సులో ఉన్న మాటను నేరుగా చెప్పేస్తారు. జంకడాలు.. బొంకడాలంటే వీళ్లకు అస్సలు నచ్చవు. అబ్బాయిలతో చాలా బోల్డ్ గా ఉంటారు ధనస్సు రాశి అమ్మాయిలు.

సంతోషంగా ఉండాలని
ధనుస్సు రాశి స్త్రీ బాంధవ్యాలకు ఎక్కువ విలువనిస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్లంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనసత్వం ధనస్సు రాశి అమ్మాయిలకు ఉంటుంది.

ప్రత్యేకత ఉండాలని
ధనస్సు రాశి మహిళలు తాము చేసే ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటారు. అందరిలోనూ తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఈ రాశి అమ్మాయి కోరుకుంటుంది.

భాగస్వామి తో ఎలా ఉంటుందంటే
ధనస్సు రాశి అమ్మాయి మీ ప్రియురాలు లేదా మీ భార్య అయితే మీతో ఎలా ఉంటుందో అని సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి ఆడవారు వ్యక్తిగతంగా చాలా మంచివారు.

ఆ సమయంలోనే
అయితే తనకోసం కాసింత జ్ఞానాన్ని, శక్తిని వెచ్చించలేని సమయంలోనే ధనస్సు రాశి అమ్మాయిలు అబ్బాయిలపై కాస్త ఆసక్తి కోల్పొతారు. తన ప్రియుడు లేదా భర్తతో అన్ని విషయాల్లో ఈ రాశి అమ్మాయి చాలా పారదర్శకంగా ఉండాలనుకుంటుంది.

డామినేషన్ చేస్తే
ఇక ధనస్సు రాశి అమ్మాయిని ప్రేమించి వారు ఆమెకంటే ఎక్కువగా డామినేషన్ చేస్తే మాత్రం కాస్త బాధపడుతుంది. అలాంటి అబ్బాయికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది.

తనతో మాత్రమే దాంపత్య సంబంధం
ధనస్సు రాశి అమ్మాయి తన భర్త కేవలం తనతో మాత్రమే దాంపత్య సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటుంది. పరాయి అమ్మాయిలతో అలాంటి సంబంధాలు తనను ప్రేమించే అబ్బాయికి ఉండదకూడదని బలంగా కోరుకుంటుంది

శృంగారంలో
ఇక ధనుస్సు రాశి అమ్మాయిని శృంగారంలో సంతృప్తిపరచడం కూడా మామూలు విషయం కాదు. ఈ రాశి అమ్మాయిలకు ఎక్కువ కోరికలుంటాయి.

ఎక్కువగా విసుగు చెందుతారు
ధనస్సు రాశి అమ్మాయిలు కాస్త ఎక్కువగా విసుగు చెందుతారు. అయితే జీవితంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశి అమ్మాయిలు వయస్సులో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు.

విశ్వసనీయంగా ఉంటుంది
ధనుస్సు రాశి స్త్రీ చాలా విశ్వసనీయంగా ఉంటుంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలదు. అయితే, ఆమె కొన్నిసార్లు చాలా గర్వంగా కూడా ఉంటుంది. ధనస్సు రాశి అమ్మాయిలు ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటారు. మొత్తానికి ఈ రాశి అమ్మాయిలు లక్షణాలు ఇవి. వారితోప్రేమలో ఉంటే ఈ విషయాలన్నీ కాస్త గుర్తించుకోండి.



Click it and Unblock the Notifications
