For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ మహిళ అడల్ట్ స్టార్ గా కనపడేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకుంది

|

తమ ప్రేమను నిరూపించుకోవటానికి ప్రజలు మొగ్గుచూపే అంశాలు ఈ ప్రపంచంలో అనేకం ఉన్నాయి. అలా కేవలం తన బాయ్ ఫ్రెండ్ను సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో, తన అసలు గుర్తింపునే కోల్పోయింది ఈ మహిళ.

ఈ యంగ్ యూట్యూబర్ తన బాయ్ ఫ్రెండ్ ఎంతో అభిమానించే ఒక అడల్ట్ స్టార్ వలె కనపడడానికి 30 శస్త్రచికిత్సలను చేయించుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు భాదపడుతుంది.

She Did 30 Surgeries To Look Like Her Boyfriend’s Fav Adult Star!

అసలేం జరిగిందో తెలుసుకోవడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

ఈ సంఘటన హాంగ్ కాంగ్ చైనాలో జరిగింది.

ఈ సంఘటన హాంగ్ కాంగ్ చైనాలో జరిగింది.

హాంగ్ కాంగ్ కు చెందిన 23 సంవత్సరాల బెర్రీ Ng అనే పేరుగల ఈ అమ్మాయి, మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకుంది. ఈ యువతి గత 6 సంవత్సరాలలో 30 కాస్మెటిక్ శస్త్రచికిత్సలు చేయించుకుంది.

ఆమెకు వాస్తవం అర్ధమయ్యేసరికి 6 సంవత్సరాలు పట్టింది ..

ఆమెకు వాస్తవం అర్ధమయ్యేసరికి 6 సంవత్సరాలు పట్టింది ..

ఆమె కేవలం 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండే ఈ శస్త్రచికిత్సలకు సిద్దపడింది. క్రమంగా బెర్రీ తన మొదటి సెషన్ దగ్గర నుండి ఇప్పటి వరకు, తన 30 శస్త్రచికిత్సలకుగాను సుమారుగా 3,000 USD ఖర్చు చేసినట్లు అంచనా వేసింది.

ఆమె రూపానికి విమర్శల పాలయ్యేది కూడా …

ఆమె రూపానికి విమర్శల పాలయ్యేది కూడా …

బెర్రీ తన ప్రియుడు తన శారీరక రూపాన్ని పదేపదే విమర్శించేవాడని, క్రమంగా ఆమెను సూపర్ మోడళ్లతో పోలుస్తూ ఆమె ఆత్మవిశ్వాసం దిగాజార్చేవాడని చెప్పుకొచ్చింది.

కనీసం ఆమెను శస్త్రచికిత్సలు వద్దని ఎప్పుడూ ఆపలేదు కూడా….

కనీసం ఆమెను శస్త్రచికిత్సలు వద్దని ఎప్పుడూ ఆపలేదు కూడా….

ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ తాను శస్త్రచికిత్సలకు పూనుకుంటున్నా కూడా, ఏరోజూ తనను ఆపలేదని బెర్రీ వెల్లడించింది. తనను ఒక్కసారైనా ఆపి ఉంటే, తాను ఇన్ని శస్త్రచికిత్సలకు పూనుకునేదానిని కాదని కూడా తెలిపింది. ఈ శస్త్రచికిత్సలలో భాగంగా ఆమె తన కళ్ళు, నుదురు, చెంపలు, ముక్కు, గడ్డం, వక్షోజాల పరంగా మార్పులను చేయించుకుంది.

ఆమె అనుకున్న ఫలితం దక్కలేదు ...

ఆమె అనుకున్న ఫలితం దక్కలేదు ...

ఆమె శస్త్రచికిత్సలను చేయించుకున్న తర్వాత బెర్రీ తల్లి, ఆమెను చూసి ఎంతో బాధపడి, దీనంతటికి కారణం ఆమె ప్రియునిగా గుర్తించింది. క్రమంగా అతను ఘోరమైన తప్పును చేసినట్లు తెలియజేసింది. అంతేకాక బెర్రీ అనుభవపూర్వకంగా చూసింది కూడా. ఇన్ని శస్త్రచికిత్సల తర్వాత కూడా తాను కోరుకున్న మార్పులను పొందలేని పక్షంలో చివరికి తన బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పింది. ఎప్పుడు కూడా ఒకరితో పోలికలు వేస్తూ, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసేవారు తమ ఉనికిని సైతం కోల్పోయేలా చేయగలరని చివరికి అర్ధం చేసుకుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, కామెంట్లను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

She Did 30 Surgeries To Look Like Her Boyfriend’s Fav Adult Star!

A YouTuber named Berry took an extreme measure to prove her love for her boyfriend. She decided to look like his favourite adult star and she underwent the first procedure when she was just 16 years old and has since spent an estimated total of USD 3,000 on her 30 cosmetic procedures.She was so much in love with her boyfriend that she underwent 30 cosmetic surgeries
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more