Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
మహిళ టాప్ దొంగిలింపబడినది, కానీ పట్టుబడిపోయింది
ఈ ప్రపంచంలో అనేక కేసులలో దొంగలు విచిత్రంగా పట్టుబడడం మనం వింటూనే ఉంటాం. క్రమంగా అనేక వీడియోలు, ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. అదే విధంగా ఈ సంఘటనలో ఒక మహిళ, ఒక టాప్ కొనుగోలు చేశానని, కాకపోతే దాని పరిమాణం తనకు సరిపోలేదంటూ ఎక్స్చేంజ్ కోరుతూ దుకాణానికి తిరిగి వచ్చింది. కానీ యజమానికి దొరికిపోయింది.
ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.

అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంఘటన చైనాలో జరిగింది
53 ఏళ్ల వయసు ఉన్న ఈ మహిళ అత్యంత తెలివిగా దొంగతనం చేసింది. ఈవిడ, మంగోలియాలో రద్దీగా ఉండే ఒక బట్టల స్టాండ్ నుంచి ' XXXXL' పరిమాణం ఉన్న ఎరుపు రంగు టాప్ ను దొంగిలించిందని స్పష్టంగా వెల్లడైంది.

తనకు సరిపడలేదని ఎక్స్చేంజ్ కోరుతూ తిరిగి దుకాణానికి వచ్చింది ...
పేరు తెలియని ఈ దొంగ, తాను దొంగతనం చేసిన ఆ టాప్ పరిమాణం చాలా పెద్దదిగా గ్రహించి, తనకు తగిన పరిమాణం కోసం, ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కొన్ని నిమిషాల తరువాత దుకాణానికి తిరిగి వెళ్ళింది.

కానీ ఒక సర్ప్రైజ్ ఎదుర్కొంది …
ఈ మహిళ ఎక్స్చేంజ్ నిమిత్తం యజమాని దగ్గరకు వెళ్ళినప్పుడు, అతను ఉదయం నుండి ఏ కస్టమర్ కు కూడా దానిని విక్రయించలేదని వెల్లడించాడు. క్రమంగా అది దొంగతనానికి గురైనట్లుగా గ్రహించి, వెంటనే పోలీసులకు కబురు పెట్టాడు.

ఆగ్రహావేశానికి లోనైన ఆ మహిళ ఆ యజమానిని చెంపపై కొట్టింది…
ఆమె దొరికిపోయిందని గమనించిన ఆ మహిళ ఆగ్రహావేశానికి లోనై, యజమానిని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టింది. కానీ పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమెను ప్రశ్నించినప్పుడు, కనీసం ఆలోచన చేయకుండా, అదే రోజు ఎక్స్చేంజ్ కోసం దుకాణానికి తిరిగి వచ్చి ఉండకూడదని చెప్పింది. ఈ సమాధానానికి అవాక్కవడం పోలీసుల వంతైంది.
చేసింది తప్పే అయినా, తప్పును ఇలా చేసి ఉంటే బాగుండేది అని సెలవిస్తున్న ఈ ఆ మహిళ వైఖరి ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా. మీకేమనిపిస్తుంది ? మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications