Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వీడియో చూస్తే షాక్ అవుతారు : ఆమె గొంతులో నుంచి బతికున్న జలగను బయటకు తీశారు, అక్కడికి ఎలా వెళ్లింది
ఇక ఆ మహిళ గొంతులో నుంచి బతికిన జలగను బయటకు తీసిన విధానాన్ని మొత్తం కూడా మెడికల్ స్టూడెంట్స్ కు ఉపయోగపడేలా రికార్డ్ చేశారు. ఆ వీడియో చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతోంది. వియత్నాంలో ఘటన ఈ ఘటన వియత
ప్రతి ఒక్కరి శరీరంలో చిన్నచిన్న క్రిములు ఉండొచ్చు. అవి ఏదో ఒక రూపంలో మీ శరీరంలోకి వెల్లి ఉండవచ్చు. బాడీలోకి పురుగులు ప్రవేశించి అవిలోపలంతా పాకుతున్నట్లు కొందరికి కలలు వస్తుంటాయి.
అయితే ఒక ఆమె గొంతులోకి ఏకంగా జలగ వెళ్లింది. ఆ జలగ బతికి ఉండడంతో అటు ఇటు తిరుగుతూ ఆమెను ముప్పు తిప్పలు పెట్టించింది.

రికార్డ్ చేశారు
ఇక ఆ మహిళ గొంతులో నుంచి బతికిన జలగను బయటకు తీసిన విధానాన్ని మొత్తం కూడా మెడికల్ స్టూడెంట్స్ కు ఉపయోగపడేలా రికార్డ్ చేశారు. ఆ వీడియో చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతోంది.

వియత్నాంలో ఘటన
ఈ ఘటన వియత్నాంలో చోటచేసుకుంది. ఆ మహిళ వయస్సు 63 సంవత్సరాలు. ఆమెది వియత్నాంలో హాయింగ్ ప్రావిన్స్. గత మూడు నెలలుగా కాంస్టాంట్ మైగ్రేన్స్ తో తాను ఇబ్బందులుపడుతున్నట్లు డాక్టర్లకు ఆమె వివరించింది. వైద్యులు వెంటనే ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేశారు.

గొంతులో గడ్డ
తాను గొంతులో గడ్డతో ఇబ్బందులుపడుతున్నాని ఆ మహిళ చెప్పడంతో వెంటనే డాక్టర్లు డయోగ్నోస్టిక్ ద్వారా ఆమె సమస్య తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె గొంతులో 2 ఇంచుల జలగ ఉన్నట్లు బయటపడింది.
బతికే ఉంది
డాక్టర్లు ఆమె గొంతులో జలగ ఉన్నట్లు కనుక్కున్న వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే ఆమె గొంతులో జలగ బతికే ఉన్నట్లు కనుక్కున్నారు వైద్యులు. ఇక బతికి ఉన్న దాన్ని అలాగే బయటకు తీశారు డాక్టర్లు. దాన్ని మొత్తం కూడా రికార్డ్ చేశారు.

గొంతులోకి ఎలా వెళ్లింది
అయితే ఆ మహిళ గొంతులోకి జలగ ఎలా వెళ్లిందనే విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. డాక్టర్లు చెప్పిన ప్రకారం.. ఆమె కొండప్రాంతంలో జీవిస్తుంది. ఆమె పారుతున్న నీటి కింద స్నానం చేసే సమయంలో అది ఆమె గొంతులోకి వెళ్లి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి డాక్టర్లు దాన్ని తొలగించి ఆమె సమస్యను తొలగించారు.



Click it and Unblock the Notifications
