Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
మీరు అవమానింపబడినప్పుడు మీరాశి ప్రకారం మీరు ఎలా స్పందిస్తారో తెలుసా
మీ గురించి ఎవరైనా నలుగురిలో చెడ్డగా చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేక మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఎవరైనా అసభ్యకరంగా కామెంట్ చేస్తే మీరు ఆ కామెంట్ మీద ఎలా ప్రతిస్పందిస్తారు ? వారి మీద దాడికి మీరు ఎలా సన్నద్ధమవుతారు ఇలాంటి అనేక విషయాలను రాశులు చెబుతాయి. మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేక సమస్యలు సృష్టించినా వారి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు లేక ఎలా ప్రతిస్పందిస్తారు అనే విషయాలను మీరు పుట్టిన జన్మనక్షత్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ శీర్షికలో భాగంగా మిమ్మల్న స్నేహితుడు కాని శత్రువులు కాని అవమానించినప్పుడు ఆయా రాశుల వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుపుతున్నాం. మీ రాశి ప్రకారం మీరు ఎలా స్పందిస్తారో అంచనా వేసుకోవడానికి రెడీ అవ్వండి మరి.

మేషరాశి
ఈ రాశిలో ఉన్నవారు వారిని ఎవరైనా అవమానిస్తే ఎంతకైనా తెగించి వేస్తారు. కోపం బాగా పెరుగుతుంది. మేషరాశి కలిగిన వారు ఎవరైనా అవమానిస్తే దాన్ని సైలంట్ గా తీసుకోకుండా వారి మీదకు ఎదురుదాడి చేసే స్వభావం కలిగి ఉంటారు. ఆ ఎదురుదాడి చాలా వ్యంగ్యంగానూ, కఠినమైన వ్యాఖ్యలతోనూ నిండి ఉంటుంది. అయితే ఆ పదాలు ఉపయోగించిన తరువాత కొంచెం ఎందుకు ఆ పదాలు వాడామని చింతిస్తారు కూడా..

వృషభ రాశి
వృషభం అంటే ఎద్దు అని అర్థం. వీరు అంత తొందరగా దేనికీ స్పందించరు. చాలా సౌమ్యంగా ఉంటారు. అవతలి వారు ఎంతగా రెచ్చగొట్టినా వారు దానిని సీరియస్ గా తీసుకోరు. అయితే అలాగని ఎప్పుడూ శాంతంగా ఉండరు. బాగా ఆవేశం వచ్చేలా అవతలి వారు ప్రవర్తించినప్పుడు వారిపై ప్రతీకారం తీర్చుకునే దాకా వదలరు. అవమానించిన వారిపై ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారనేది వారికే తెలియదు. అంత సీక్రెట్ గా పని కానిస్తారు.

మిధున రాశి
మిధున రాశి కలిగిన వారిని ఎవరైనా అవమానించినప్పుడు ఎక్కువ సంధర్భాల్లో వారు దానిని విస్మరించడానికే ఇష్టపడతారు. తనను ఎదుటివారి ముందు అవమానపరుస్తున్నారని తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వారితో స్నేహం కన్నా పగనే ఎక్కువగా కోరుకుంటారు. వారికోసం ప్రతిస్పందించడం అంటే టైం వేస్టుతో కూడుకున్న పని అని భావించి వదిలేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

కర్కాటక రాశి
వీరు చాలా ఆటోచన స్వభావం కలిగి ఉంటారు. విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించుకునే నేర్పును కలిగి ఉంటారు. ఎవరైనా అవమానించినప్పుడు వారు ఎందుకు అవమానించారో తెలుసుకునేందుకు ఓ చోట కూర్చుని ఆలోచించుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని వారిపై ప్రతీకార చర్యలు తీసుకుంటారు. వారు ఎక్కడ కనిపించినా పరుష పదజాలంతో వ్యంగ్యంగా వారిపై దాడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. అవసరమైన చోటల్లా వారిని అవమానించిన వారిపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

సింహరాశి
వీరు చాలా సరదాగా ఉంటారు. ఎదుటివారికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా దూసుకుపోతుంటారు. ఎదుటివారు ఈ రాశి వారిని అవమానించాలని ప్రయత్నిస్తే వారికి వీలైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అన్ని విషయాల్లో చొచ్చుకుపోయే గుణాన్ని కలిగి ఉంటారు.

కన్య రాశి
వీరు మిధునరాశి వారికి దగ్గరగా ఉంటారు. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకునే స్వభాం వీరి సొంతం. వీరు ఎదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఎవరు చేశారనేది ముందుగా ఆలోచన చేస్తారు. ఆ తరువాత ఆ ఫలితానికి అనుగుణంగా వారు కఠిన నిర్ణయం తీసుకుంటారు.

తుల రాశి
ఈ రాశి వారికి చాలా ఆవేశంతో కూడిన ఆలోచన ఉంటుంది. ఎవరైనా వారిని అవమానిస్తే ఈ రాశి కలిగిన వారు వెంటనే రియాక్ట్ కారు. ఓ చోట కూర్చుని అవమానానికి సంబంధించిన మొత్తం విషయాన్ని పరిశోధిస్తారు. అందులో నిజనిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఫలితం తేలిన తరువాత వారు దాని కనుగుణంగా పగతీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తారు. వీలైంనతగా ఆ విషయాన్ని మరచిపోవాలనుకుంటారు. చాలా మెచ్యూర్ మైండ్ ని కలిగి ఉంటారు. నెగిటివ్ విషయాలను సమస్యలు కలిగించే విషయాలను దూరంగా పెట్టే అంతటి మైండ్ వీరి సొంతం స్వతంత్రంగా ఆలోచిస్తుంటారు.

వృశ్చిక రాశి
వీరు చాలా షార్ప్ మైండ్ కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వారు అపరాధిని శిక్షించడం కన్నా అలా ఎందుకు చేశావని వారికి క్లాస్ పీకే స్థాయిలో ఉంటారు. అది ఎంత పెద్ద తప్పు వారికి తెలిపి అవమానించిన వారిని మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు.

ధనుస్సు రాశి
ఈ రాశి కలిగిన వారు అవమానించడానికి ప్రయత్నిస్తున్న వారిని కట్టడి చేస్తారు. వారితో వాదనలు, కొట్టుకోవడాలు,అపార్థం చేసుకోవడాలు పగల ద్వారా వారిని ఎదుర్కోవడం కష్టమని భావిస్తుంటారు. ఈ రాశి కలిగిన వారు తమకు ఎదుటి వారు ఎదైతే చెప్పారో అందులో దాగిన సానుకూల అర్థాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారే తప్ప అనవసరంగా వాదులాటకు దిగరు. తమను తాము అర్థం చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.

మకర రాశి
వీరు ఇటువంటి విషయాలను అసలు పట్టించుకోరు. కళ్లతో చూసి చూటనట్లుగానే వదిలేస్తారు.ఇటువంటి విషయాల్లో తల దూర్చడమంటే సమయం వృథా తప్ప మరేమి ఉండదనే ఆలోచన కలిగి ఉంటారు. ఎక్కువ వ్యాపార చతురతను కలిగి ఉంటారు.

కుంభ రాశి
ఈ రాశి కలిగిన వారు అవమానించిన వారిని అంత తేలికగా మరచిపోరు. అలాంటి వారు తమకు అవసరం లేదని భావిస్తారు. తమ లిస్టులో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల జాబితా నుండి వారిని తొలగిస్తారు. సంబంధాలను పూర్తిగా తెంచి వేసుకుంటారు.

మీన రాశి
ఈ రాశి కలిగిన వారు సున్నిత మనస్కులు అయి ఉంటారు. అవమానాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు. వారు దానిని మరచిపోయేందుకు ప్రయత్నిస్తారు కాని మరచిపోలేరు. అది అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. అయినా వారి భావోద్వేగాలను నియత్రించుకోవడంలో విజయాన్ని సాధిస్తారు.



Click it and Unblock the Notifications