Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
76th Independence Day:స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారు తెలుగు యోధులెవరో తెలుసా...
76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఓ సారి గుర్తు చేసుకుందామా
మనలో చాలా మంది పుడతారు.. మరణిస్తుంటారు. అయితే చనిపోయిన కూడా కొందరు మన మధ్యే ఉన్నట్టు ఉంటుంది. అలాంటి వారిని ఎన్నటికీ మరచిపోలేం. ఎందుకంటే వారు బతికి ఉన్నప్పుడు చేసిన సేవలు, పోరాటాలు, త్యాగాలు అందరి జీవితాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అలా తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోయిన వారిలో మన తెలుగు వారు అందులోనూ స్వాతంత్య్ర సమరయోధులెవరో ఇప్పుడు తెలుసుకుందాం...

కోటాను కోట్ల జనంలో అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1947 సంవత్సరానికి ముందు ఈస్టిండియా కంపెనీ వారు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చి నెమ్మదిగా మన సామ్రాజ్యాలన్నీ స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. అంతటితో ఆగకుండా మన దేశ ప్రజలను పన్నులు, కప్పం వంటి వాటితో చాలా ఇబ్బంది పెట్టారు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి మనపై ఆధిపత్యం, అజమాయిషీ చెలాయించడాన్ని ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్వాతంత్య్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగంలో తొలిసారిగా తిరుగుబాటు మొదలైంది. అలా స్వాతంత్య్రం రావడానికి మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటీష్ వారితో సమరం చేశారు. మరికొందరు తిరుగుబాటు చేశారు. గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజల స్వేచ్ఛ కోసం వారు చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వారి పోరాటం వల్లే మనం ఈనాడు స్వేచ్ఛగా గాలి, ఊపిరి తీసుకుంటున్నాం.

అల్లూరి సీతారామరాజు
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలబడిన యువ విప్లవకారుడు, మన్నెం పాలిట దైవం అల్లూరి సీతారామరాజు. ఈయనను నేటికీ యువత ఒక రోల్ మోడల్ గా భావిస్తారు. అల్లూరి సీతారామరాజు అప్పటి కాలంలోనే బ్రిటీష్ పోలీసు స్టేషన్లపై బాంబు దాడి చేసిన మన్యం వీరుడు. అందుకే అక్కడి ప్రజలు, గిరిజనులు ఆయనను గొప్ప నాయకుడిగా భావిస్తారు. నేటికీ ప్రతి సంవత్సరం అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈయన పేరిట అనేక సినిమాలు కూడా వచ్చాయి. అవి కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అల్లూరి 1924లో బ్రిటీష్ వారిని గుండెల మీద కాల్చమని ధైర్యంగా అడిగిన వీరుడు. వారి తుపాకి తూటాలకు వీరమరణం పొందాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ మండలంతో పాటు చుట్టుపక్కల ఎవ్వరినడిగినా నరసింహారెడ్డి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన చరిత్ర అంత ఘనమైనది. 1846 సంవత్సరంలో బ్రిటీష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడాడు. తల్లి లాంటి నా దేశాన్ని వదిలి వెళ్లమని ఆంగ్లేయులను హెచ్చరించాడు. ఈయన పేరిట కూడా ఇటీవలే ఓ సినిమా కూడా వచ్చింది. అందులో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు. ఈ సినిమా వల్ల కూడా చాలా మందికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసింది. అయితే చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాండ్ర పాపారాయుడు..
చరిత్రలో హీరోగా నిలిచిన పాపారాయుడు గురించి అతి తక్కువ మందికే తెలుసు. అది కూడా స్వర్గీయ ఎన్టీఆర్ సినిమా తర్వాత చాలా మందికి తెలిసింది. ‘నారు పోసావా.. నీరు కట్టావా.. ఎందుకు కట్టాలి రా.. కప్పం.. ఎందుకు కట్టాలి శిస్తు' అని బహిరంగంగా బ్రిటీష్ వారిని ప్రశ్నించిన ధీరుడు తాండ్ర పాపారాయుడు. ఈయనను బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన నేపథ్యంలో వీరమరణం పొందారు.

గొట్టిపాటి బ్రహ్మాయ్య
స్వాతంత్య్ర పోరాటానికి ముందు గొట్టిపాటి రియోతు పెద్ద (రైతుల నాయకుడు)గా పేరు గడించాడు. సైమన్ కమిషన్ పౌర అవిధేయత ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం యొక్క జమీందార్ల అల్లర్ల ఉద్యమం బహిష్కరించడంతో ఈయన తిరుగుబాటు చేశారు. ఈయన సేవలు గుర్తించిన ప్రభుత్వం 1982 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది.

కల్లూరి చంద్రమౌళి..
ఈయన ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, పరోపకారి, స్కాట్లాండ్ దేశంలో ఉన్నత చదువులు చదివిని మహా మేధావి. అంత గొప్ప చదువు చదివినా కూడా దేశానికి సేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో మన రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. స్వాతంత్య్రం కోసం పోరాటంలో పాల్గొన్నారు.

వావిలాల గోపాల క్రిష్ణయ్య..
1908వ సంవత్సరంలో వావిలాల గోపాల క్రిష్ణయ్య జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. అయితే అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉండటంతో ఆ పోరాటానికి ఆకర్షితులయ్యారు. అంతే వెంటనే ఆ పోరాటంలో చురుగ్గా పాల్గొని చరిత్రలో నిలిచిపోయారు.

కనేగంటి హనుమంతు..
బ్రిటీష్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ముఖ్యమైన స్వాతంత్య్ర సమరయోధుల్లో కనేగంటి హనుమంతు ఒకరు. అతను బ్రిటీష్ పాలనపై తిరుగుబాటు చేశాడు. బ్రిటీష్ వారు విధించిన పన్నుకు వ్యతిరేకంగా పల్నాడు తిరుగుబాటుకు నాయత్వం వహించాడు.

గౌతు లచ్ఛన్న...
ఉత్తరాంధ్రలో ఈయన పేరు తెలియని వారే ఉండరు. బ్రిటీష్ వారి కాలంలోనే వెనుకబడిన తరగతుల వారి కోసం ఎంతో క్రుషి చేశారు. అంతేకాదు ఈయన క్విట్ ఇండియా ఉద్యమం, మరియు స్వరాజ్ ఉద్యమం, పౌర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

టంగుటూరి ప్రకాశం..
టంగుటూరి ప్రకాశం పంతులుగా పేరు తెచ్చుకున్న ఈయన సైమన్ కమిషన్ మద్రాసు సందర్శన సమయంలో బ్రిటీష్ వారు కాల్పులు జరిపినా కూడా ఏ మాత్రం భయపడకుండా తన గుండెను చూపించిన ధైర్యశాలి. అందుకే ఆయన ‘ఆంధ్ర కేసరి' అనే బిరుదును సంపాదించారు. ఈయన నాన్ కో-ఆపరేషన్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.

గోగినేని రంగనాయకులు..
బ్రిటీష్ కాలంలోనే గోగినేని రంగనాయకులు రైతు తత్వశాస్త్రాన్ని అవకోశన పట్టాడు. అందుకే ఈయనకు అప్పట్లో భారతీయ రైతు ఉద్యమ పితామహుడిగా పేరొచ్చింది. ఈయన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతీయ రైతు ఉద్యమంలో పాల్గొన్నాడు.



Click it and Unblock the Notifications