Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
Air Force Day 2021 :ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు...
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు...
మన భారతీయ భాషలో భారతీయ వాయుసేనగా పిలువబడే భారత వైమానిక దళం(IAF) 89వ పుట్టినరోజు ఈరోజు(అక్టోబర్ 8వ తేదీ). అమెరికా, చైనా, రష్యా తర్వాత IAF ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరు గాంచింది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఈరోజున అద్భుతమైన ప్రదర్శనలకు సిద్ధమైంది IAF. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేడుకల్లో పాతకాలపు మరియు ఆధునిక రవాణా విమానాలు మరియు ఫ్రంట్ లైన్ యుద్ధ విమానాలను కూడా IAF ప్రదర్శించింది. ఈ ఏడాది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో రఫెల్ విమానాలు కూడా వచ్చి చేరాయి.

IAF 88వ వార్షితకోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం ధైర్యవంతులైన ఎయిర్ ఫోర్స్ యోధులకు వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. త్రివిధ దళాల్లో భాగమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932, అక్టోబర్ 8న బ్రిటీష్ పాలన కాలంలో ఏర్పాటైంది.
Air Force Day Parade 2020. Live from Air Force Station Hindan. https://t.co/QNWdvkvjZG
— Indian Air Force (@IAF_MCC) October 8, 2020
సెకండ్ వరల్డ్ వార్ లో మన వైమానిక దళం వీరోచితంగా పోరాడింది. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను తెలుసుకుందాం...

గగనతలంపై డేగ కన్ను...
భారతదేశం పరిధిలోని గగన తలంపై నిత్యం డేగ కన్నుతో నిఘా వేస్తూ మన దేశాన్ని కాపాడటంలో భారత వైమానిక దళానిది కీలక పాత్ర. అంతేకాదు యుద్ధం వంటి సమయాల్లో శత్రువులపై మెరుపు దాడులు చేయడంలో, ప్రక్రుతి విపత్తుల సమయంలో బాధితులను రక్షించడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలు వెలకట్టలేనివి.

ఎప్పుడు ఏర్పడిందంటే..
ఈ భారతీయ వైమానిక దళాన్ని 1932లో బ్రిటీష్ అధికారులు అక్టోబర్ 8వ తేదీన ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ భారతీయ వైమానిక దళం ఎంతో సాహసోపేతంగా పోరాడింది.

రాయల్ IAF
తొలి రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను.. రాయల్ IAFగా పిలిచేవారు. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భావించాక అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా మారింది.

దాయాదితో మూడు యుద్ధాలు..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటైనప్పటి నుండి పాకిస్థాన్ తో మూడు సార్లు యుద్ధంలో పాల్గొంది. చైనాతో 1960లో ఒకసారి పాల్గొంది. ఆపరేషన్ విజయ్, అపరేషన్ మేఘ్ దూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ పూమలై వంటి ఆపరేషన్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకంగా వ్యవహరించింది.

ఎయిర్ షో..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఎయిర్ షో నిర్వహిస్తారు. ఇందులో హెలికాఫ్టర్లు, ఎయిర్ ఫోర్స్ గరుడ కమెండోలు, ఆయుధాల ప్రద్శనతో పాటు పలు కార్యక్రమాలను చేపడతాయి. ఇప్పటికే దానికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

ట్విటర్లో అభినందనలు..
భారత వైమానిక దళానికి ధన్యవాదాలు తెలుపుతూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా దేశం గర్వించదగ్గ వైమానిక యోధులకు వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
భారతీయ వాయుసేన పుట్టినరోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications