Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీ సంతోషాన్ని పాడు చేసే ఈ రహస్యాలను ఎట్టి పరిస్థితిలో ఇతరులకు చెప్పకండి
మీ సంతోషాన్ని పాడు చేసే ఈ రహస్యాలను ఎట్టి పరిస్థితిలో ఇతరులకు చెప్పకండి
ప్రతి ఒక్కరూ ఇతరుల రహస్యాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ మన రహస్యాలు ఇతరులకు చెప్పడానికి మనం ఇష్టపడము. మనకు ఎంత దగ్గరివారైనా, ఎంత సన్నిహితులైనా చెప్పకూడాని కొన్ని రహస్యాలు మన దగ్గర ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. జీవితంలో కొన్ని రహస్యాలు మెయింటైన్ చేయడం వల్ల మన జీవితాలు బాగుంటాయి.
ప్రతి ఒక్కరూ జీవితంలో రహస్యాలు ఉంచడం మంచిది. కానీ చాలా ముఖ్యమైన విషయం రహస్యంగా ఉంచకూడదు. అవసరం లేని విసయాలను బయటకు చెప్పడం ఎంత ప్రమాకరమో, అతి ముఖ్యమైన విషయాలను దాచడంకూడా అంతే ప్రమాదకరం. కాబట్టి మీరు ఇతరులతో పంచుకోకూడని కొన్ని రహస్యాలున్నాయి. ఈ పోస్ట్‌లో మీరు ఏ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదో చూద్దాం.

మీ దీర్ఘకాలిక ప్రణాళికలు(ప్లాన్స్)
మీ ఆలోచనలను ఇతరులకు చెప్పడంలో తప్పు లేదు. కానీ మీ జీవితంలో మీరు పొందాలనుకునే వాటి ముఖ్యంగా స్థలం, ఆస్తులు, ఇల్లు, కార్ల ఏవైనా సరే ఖరీదైనవి లేదా విలువైన వాటి గురించి మీరు వేసుకున్న ప్లాన్స్ గురించి, ఎప్పుడు కొంటారు, ఎలా కొంటారన్న విషయాలను ఎట్టి పరిస్థితిలో ఇతరలకు చెప్పకూడదు. తమ ప్రణాళికలన్నింటినీ ఇతరులతో చర్చించడం వల్ల శాస్త్రీయంగా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిరూపించబడింది.

మీ కుటుంబ సమస్యలు
మీ కుటుంబ సమస్యలు లేదా మీ కుటుంబంలోని భార్య భర్త లేదా ఇద్దరు వ్యక్తుల మద్య సంబంధాలు బాగోలేకపోవడం, అత్తకోడళ్ల మద్య సంబందాలు బాగోలేకపోవడం, ఇతర కుటుంబ సమస్యలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోకండి. మీ కుటుంబ సమస్యలు ఎల్లప్పుడూ నాలుగుగోడల మధ్యే ఉండాలి. ఈ విధంగా ఇతరులతో చెప్పడం వల్ల తర్వాత మీకు సమస్యలను కలిగిస్తుంది. మరియు ఇది మీ కుటుంబంపై ఇతరుల అభిప్రాయాన్ని మారుస్తుంది.

మీరు చేసిన సహాయం లేదా దానం
ఇతరులకు ఇవ్వడం లేదా దానం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? కుడి చేతితో చేసిన దానం ఎడమ చేయి కూడా తెలికూడదని పెద్దలు చెబుతారు. ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే మీరు చేయాల్సిందల్లా చేయండి మరియు ప్రశాంతంగా ఉండండి.

అవతలి వ్యక్తిపై మీ దృక్పథం
పనిచేసే ప్రదేశంలో రకరకాల మనుషులు ఉంటారు . వారిలో కొంత మంది నుండి మీకు ఎక్కువ సమస్య ఉంటుంది. అయినా వారి గురించి ఇతరులకు చెడుగా చెప్పడం వల్ల మీరే సమస్యల్లో ఇరుక్కుంటారు. వ్యక్తిగత విమర్శలు తీవ్ర ప్రమాదానికి గురిచేస్తాయి. ఇతరులను విమర్షించడం , ఇతరుల గురించి మరికొరి దగ్గర మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. మరియు మీ మీద వారికి చెడు అభిప్రాయం కలుగుతుంది.

విలువైన వస్తువుల గురించి
మీరు క్రొత్త వస్తువును కొనుగోలు చేస్తే, మీరు దానిని ఇతరులకు చూపించవచ్చు, కానీ దాని ధర గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆస్తులు మీ ఇష్టం, ఇతరులకు చెప్పడం వల్ల ఏమి ఉపయోగం? ఇది మిమ్మల్ని గొప్పగా చెప్పుకునేలా చేస్తుంది మరియు ఇతరులు మీపై అసూయపడేలా చేస్తుంది.

సన్నిహిత సంబంధాలు
మీ సన్నిహిత సంబంధాలను లేదా మీ సన్నిహిత క్షణాలను మీ జీవిత భాగస్వామితో తప్ప మరొకరితో పంచుకోకూడదు. సన్నిహిత సంబందాలను గోప్యంగా ఉంచడం మీకే మంచిది. ఇటువంటి విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇది జంటలు విడిపోవడానికి కూడా కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications
