Latest Updates
-
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం
April Fool's Day 2023: మీ ఫ్రెండ్స్ ను ఫూల్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రే చేయండి...!
మరి కొద్ది క్షణాల్లో మనం ఏప్రిల్ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఏప్రిల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మన ఫ్రెండ్స్ ను, బంధువులను, కుటుంబసభ్యులను ఎలా ఫూల్స్ చేయాలా అనే ఆలోచనలు మన మదిని వెంటాడుతుంటాయి.

ఒకప్పుడు నీ కాళ్ల కింద క్రాకోచ్ ఉంది.. నీ డ్రస్ మీద బల్లి పడింది వంటి కాలం చెల్లిన మాటలు చెబితే నమ్మే కాలం పోయింది. ఎందుకంటే ట్రెండ్ మారినట్లు మనం కూడా ఫ్రెండ్స్ ను ఫూల్స్ చేయడానికి అప్ డేట్ అవ్వాలి. లేదంటే మనమే ఫూల్స్ అయిపోతుంటాం..

అలా మనం ఫూల్స్ అయి అమాయకపు ఫేస్ పెట్టడానికి బదులు.. మనమే మన ఫ్రెండ్స్ ను వెర్రి వెంగళప్పలను చేస్తే.. ఆ సమయంలో వారు చిరుకోపంతో మనల్ని అమాయకంగా చూస్తుంటే.. అప్పుడే వచ్చే కిక్కే వేరప్పా.

కాబట్టి ఈసారి కరోనా కాలంలో మీ ఫ్రెండ్స్ ను బకరాలను చేయడానికి కొన్ని చిట్కాలు మీ కోసం తీసుకొచ్చాం.. అవేంటో ఇప్పుడే చూసెయ్యండి... వెంటనే ఫాలో అవ్వండి...ఏప్రిల్ ఫూల్స్ డే 2021 :

ఆఫీసులో అలా..
ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఉండటంతో.. చాలా వరకు ఆఫీసులు, కంపెనీలు తెరచుకున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులు కూడా కార్యాలయంలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీ కొలిగ్ ని ఫూల్ చేయడానికి.. వాళ్లు పని చేసే డెస్క్ దగ్గర ఉండే మౌస్ కింద టేప్ అంటించండి. అకస్మాత్తుగా అది పని చేయక వారు తికమకపడుతుంటే.. అప్పుడు మీరు ఎంట్రీ ఇవ్వండి.. వెంటనే దాని కింద ఉన్న టేప్ తీసేసి ఏప్రిల్ ఫూల్ అనేయండి చాలు.. వారికి మీపై కోపం వచ్చేస్తుంది.

సినిమా వెళ్దామని..
మీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి.. మీ ఫేవరేట్ నటించిన హీరో సినిమా రిలీజ్ అని.. స్పెషల్ షో వేశారని.. సినిమాకు రమ్మనండి.. తీరా అక్కడికొచ్చాక ఏప్రిల్ ఫూల్ అని చెప్పేయండి.

బైక్ పంచర్ అయ్యిందని..
మీ ఫ్రెండ్ బైక్ లేదా మీకు తెలిసిన వారిది ఎవరిదైనా బైక్ ఉంటే.. వారు ఎప్పటిలాగే టిప్ టాప్ గా రెడీ అయి, బయటకు వెళ్తుంటే.. అప్పుడు మీరు వారితో బైక్ పంక్చరయ్యిందని చెప్పండి.. వారు నిరాశతో బైక్ దగ్గరికొచ్చినప్పుడు ఏప్రిల్ ఫూల్ చెప్పేయండి.

స్మార్ట్ ఫోన్ తో..
ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో జీవిస్తున్నాం. మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడాల్సిందే. కాబట్టి ఆ ఫోన్ తోనే ఫూల్స్ చేసేయండి. అయితే మీ ఇంట్లో ఉండే వారి ఫోన్లను తీసుకుని.. ఆన్ లైనులో హెచ్ డి క్రాక్ డ్ స్క్రీన్ ఇమేజ్ ని డౌన్ లోడ్ చేసి దాన్ని స్క్రీన్ లాక్, వాల్ పేపర్ గా సెట్ చేసేయండి. వారు ఉదయాన్నే నిద్ర లేచి చూడగానే ఫోన్ స్క్రీన్ బ్రేకప్ పగిలిపోయిందని బాధపడుతుంటే.. అప్పుడు మీరు వెళ్లి ఏప్రిల్ ఫూల్

ఫిబ్రవరి 30న పెళ్లి..
సాధారణంగా మనలో చాలా మందికి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే ఈ నెలలో కూడా మీకు ఇలాంటి ప్రశ్న ఎదురైతే.. ఇలా సమాధానం చెప్పండి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 30 అని చెప్పండి.. క్యాలెండర్ లో ఆ డేట్ ఉండదు కదా అంటే.. అప్పుడు ఏప్రిల్ ఫూల్ అని చెప్పేయండి.

ఐ లవ్ యు చెప్పండి..
మీకు నచ్చిన అమ్మాయికి, ఐ లవ్ యు చెప్పండి. వారు వాళ్ల ఇంట్లో పెద్దలను తీసుకొస్తే.. అప్పుడు వారికి చెప్పండి ‘ఏప్రిల్ ఫూల్' అని కవర్ చేసేయండి.
లాక్ డౌన్ అని చెప్పండి..
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ మళ్లీ ప్రారంభమైందని గూగుల్ లో ఓ ఫొటో ఇమేజ్ డౌన్ లో చేయండి. దాన్ని మీకు తెలిసిన వారందరితో షేర్ చేసుకోండి. వారు అది ఓపెన్ చేయగానే ఏప్రిల్ ఫూల్ అని వచ్చేలా సెట్ చేసుకోండి... దీంతో మీ ఫ్రెండ్స్ కచ్చితంగా ఫూల్స్ అవుతారు..
ముందుగా మీ అందరికీ హ్యాపీ ‘ఏప్రిల్ ఫూల్స్ డే' శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications