Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
మేష రాశి జాతకం 2020 : ఆ విషయంలో అనేక మలుపులు ఉంటాయట...!
ఈ నెలలో ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కొనసాగించాలి.
ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కోరిక, ఆసక్తి ఉంటుంది. అందుకే చాలా మంది హిందువులు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. రాశి చక్రాన్ని బట్టి.. వారి నక్షత్రాలు, గ్రహాలు, అనుగ్రహాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాం.

ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు మరియు యువతకు కెరీర్ లో కొన్ని మలుపులు ఉంటాయి. మీ కెరీర్ మెరుగుదల కోసం కొత్త కోర్సులు చేయడం.. కొత్త మార్గాలను అన్వేషించడం వంటి పనులను చేస్తారు.

ఈ సంవత్సరంలో మీరు మీ సామర్థ్యం చూపగలుగుతారు. మీరు ఈ సంవత్సరమంతా ధైర్యంగా మరియు నమ్మకంగా ఉండండి. ఉద్యోగుస్తులు ఆఫీసులో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ప్రశాంతంగా ఉండి వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో తోటి వారిని విస్మరించవద్దు. అలాగే సహోద్యోగులను కించపరచకండి లేదా అవమానం వంటివి చేయకండి.

ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. శని గ్రహ ప్రభావం కూడా మిశ్రమంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరంలో ఏదైనా కొత్త పనులు చేయాలనుకుంటే అందుకు మొదటి నాలుగు నెలలు అంటే జనవరి నుండి ఏప్రిల్ వరకు శుభ సమయం ఉంటుంది.

ఊహించని ఫలితాలు..
ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి - ఫిబ్రవరి నెలలో పంచగ్రాహి యోగా ఏర్పడటం వల్ల మీరు ఊహించని శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈ సయంలో మీరు అస్సలు ఊహించని సంఘటనలు మీకు ఎదురవుతాయి. ఇది మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఏదైనా సమస్య వస్తే మీరు చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మత పరమైన పనులపై ఖర్చులు చేయడం మరియు విదేశాలకు వెళ్లడం వంటివి చేస్తారు.

పోటీల్లో విజయం..
ఈ నెలలో ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. విద్యార్థులకు పోటీలలో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

ఆదాయం అద్భుతం..
ఈ నెలలో ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు వచ్చి పడతాి. అయితే కొంత కుటుంబ కలహాలు ఉంటాయి. వీటి వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఉపాధి పరంగా ఈ నెలలో మంచిగా ఉంటుంది.

చాలా ధైర్యంగా..
ఈ నెలలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీ శక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో వేగం చూపాలి. ఉపాధి ప్రయత్నాలు సఫలమవుతాయి.

ఎక్కువ ప్రయాణాలు..
ఈ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పోటీలో పాల్గొంటే మీరు ఊహించని విజయం దక్కుతుంది.

నిరాశ చెందొద్దు..
ఈ నెలలుగా కొన్ని పనులు పెండింగులో పడిపోతాయి. వ్యాపారంలో కొద్దిగా మందగమనం ఉంటుంది. అయితే నిరాశ చెందొద్దు. త్వరలో అన్ని సర్దుకుపోతాయి.

ప్రేమ మరియు వివాహా పరంగా..
ఈ నెలలో మీరు ఏదైనా ప్రణాళికలను రూపొందిస్తే, వాటిని రహస్యంగా ఉంచండి. ఎవ్వరితోనూ పంచుకోవద్దు. మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో సాహసపోతంగా ఉపయోగించాలి. ప్రేమ మరియు వివాహా పరంగా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది.

పరిస్థితులు అనుకూలంగా..
ఈ నెలలో మీరు వాహనాలను నడిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నడపాలి. అనవసరమైన ఆలోచనలనకు దూరంగా ఉండాలి. అయితే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. శాంతంగా మరియు ఓపికగా ఉండాలి.

ప్రతికూల పరిస్థితుల నుండి..
ఈ నెలలో ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు. మీ రాశికి సంబంధించిన గ్రహాలు ప్రయాణానికి అనుకూలమైనవి. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయం.

ఆదాయం పెరిగే అవకాశం..
ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. మూడో వారం నుండి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

బంధువుల నుండి..
ఈ నెలలో మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ బంధువుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా పూర్తిగా కలిసి వస్తుంది.

ప్రభుత్వం నుండి..
చివరి నెలలో మీకు ప్రభుత్వం నుండి కొంత మద్దతు వస్తుంది. మీకు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పని పెండింగులో ఉంటే, వాటిని పరిష్కరించుకోవడానికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications