Health Horoscope 2022: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి ఆరోగ్య పరంగా అదృష్టం వరిస్తుందట...!

2022 సంవత్సరంలో ఆరోగ్య పరంగా ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Horoscope 2022 in Telugu:ఈ ప్రపంచంలో ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయం సాధించగలరు. మన ఆరోగ్యం బాగా లేకుంటే జీవితంలోని ప్రతి రంగంలోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మనమంతా 2021 సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం.

Arogyam Rasi Palalu 2022: Health Horoscope 2022 For The 12 Zodiac Signs in Telugu

అదే సమయంలో 2022 సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో.. ఎన్నో ఆశయాలతో అడుగు పెట్టబోతున్నాం.. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సిన్ వల్ల ఉపశమనం పొందుతున్నామని ఆనందించేలోపే.. ఒమిక్రాన్ పేరిట మరో మహమ్మారి మన ముందుకు వచ్చింది. మరి దీనికి కూడా విరుగుడు కనిపెడతారా? లేదా మనం మునుపటిలా ఆరోగ్యంగా జీవించగలమా? అనేది తెలుసుకోవాలంటే మరి కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 కొత్త సంవత్సరంలో రాశిచక్రాల వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది.. ఏ రాశి వారు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు.. ఎవరెవరికి ఆరోగ్య సమస్యలు తలెత్తనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Arogyam Rasi Palalu 2022: Health Horoscope 2022 For The 12 Zodiac Signs in Telugu
మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుందట. మీరు ఈ సంవత్సరం చాలా వరకు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే, ఈ సమయంలో మీరు ఉపశమనం పొందొచ్చు. అయితే, మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సమయానికి భోజనం చేయండి, అలాగే మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి. ఈ కాలంలో మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉంటారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ఈ ఏడాది మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే.. సిగరెట్, ఆల్కహాల్, గుట్కా వంటి చెడు అలవాట్లు ఉంటే, వీలైనంత త్వరగా వదిలేయాలి. లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. ఇది కాకుండా, మీరు మీ దినచర్యను కూడా నిర్వహించుకోవాలి. ఈ సంవత్సరం మధ్యలో, మీపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పనులన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. పనితో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభంలో మీకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించే అవకాశం ఉంది. ఆహార అవాంతరాల వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు అధిక కొవ్వు ఆహారాన్ని నివారించాలి. ఈ సమయంలో, మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది, ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ కాలంలో, మీరు ఏదైనా గాలి సంబంధిత వ్యాధిని పట్టుకోవచ్చు. మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే సంవత్సరం మధ్యలో మీకు కొన్ని కాలానుగుణ వ్యాధులు రావొచ్చు. ఈ కారణంగా మీరు చాలా కలత చెందుతారు. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ ముఖ్యమైన పనికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఆహారంతో పాటు, మీరు మీ దినచర్యను నిర్వహించాలి. ఇది కాకుండా, మీరు ప్రతిరోజూ యోగా మరియు ధ్యానం కూడా చేయాలి. మీరు కచ్చితంగా దీని వలన మంచి ప్రయోజనం పొందుతారు. అలాగే మీరు ఎక్కువ ఒత్తిడిని తీసుకోకుండా ఉంటారు. అయితే మీరు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్య పరంగా చాలా మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా ఫిట్‌గా మరియు చురుకుదనంతో ఉంటారు. ఆ తర్వాత మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే, మీ ఆరోగ్యంలో భారీ క్షీణత ఉండొచ్చు. మీరు ఎక్కువగా చింతించకుండా ఉండండి. అలాగే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేస్తే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. అయితే సంవత్సరం ప్రారంభంలో, మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. కానీ మీరు త్వరలో మెరుగుదల చూడొచ్చు. అయితే, మీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి, మీరు డైట్‌కు భంగం కలిగించొద్దు. ఇది కాకుండా, మీరు మీపై అధిక పని ఒత్తిడిని కూడా నివారించాలి. ఈ కాలంలో మీకు ఎలాంటి పెద్ద మానసిక ఆందోళనలు ఉండవు.

తులా రాశి..

తులా రాశి..

ఈ రాశి వారికి ఇప్పటికే ఏదైనా కడుపు సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే, ఈ కాలంలో మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. మీ జీర్ణ శక్తి బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆహారం మరియు పానీయాల విషయంలో సమస్యలు ఉండొచ్చు. ఇది కాకుండా, మీరు కూడా గాయపడొచ్చు. వాహనం తదితరాలను ఉపయోగించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ బరువును అదుపులో ఉంచుకోకపోతే, మీరు తీవ్రమైన వ్యాధిని కూడా కలిగి ఉంటారు. మీ మానసిక బలం కోసం, మీరు ధ్యానం సహాయం తీసుకోండి. మీపై ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

2022 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీ మూడ్ స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కాకుండా, అధిక పనిభారం కారణంగా, మీకు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం లభించదు. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం పెద్ద సమస్య ఉండదు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా 2022 సంవత్సరంలో మంచిగా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే, ఈ కాలంలో మీరు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. పనిలో బిజీగా ఉన్నందున, మీపై దృష్టి పెట్టడానికి మీకు తగినంత సమయం లభించకపోవచ్చు, కానీ మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పనితో పాటు మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీకు కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమమయం మీకు మానసిక ఆందోళనలు పెరుగుతాయి, ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత మరియు గృహ జీవిత సమస్యల గురించి మీరు చాలా సమయం ఆందోళన చెందుతారు మరియు మీ ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది కాకుండా, మీరు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడొచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు 2022 కొత్త సంవత్సరంలో చిన్న సమస్యల కారణంగా చాలా సమయం ఇబ్బంది పడతారు. ఇది కాకుండా, ఈ కాలంలో మీరు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. పేలవమైన ఆరోగ్యం మీ పనిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా, మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. చాలా సార్లు మీరు నీరసంగా ఉంటారు. అదే సమయంలో, మీ బలహీనత కూడా పెరుగుతుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మీకు హానికరంగా నిరూపించొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి 2022 సంవత్సరంలో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఎలాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోరు. కానీ అజాగ్రత్త కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీకు కాలేయ సంబంధిత వ్యాధి ఏదైనా ఉంటే, మీ గురించి మరింత జాగ్రత్త వహించాలి. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతికూల ఆలోచనలకు కూడా దూరంగా ఉండాలి. మీరు బాగా ఆలోచిస్తే మీకు మంచి జరుగుతుంది.

Desktop Bottom Promotion