Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
Chanakya Niti: ఈ సమయాల్లో భార్య, స్నేహితుల నిజస్వరూపం బయటపడుతుందన్న చాణక్యుడు
వ్యక్తిగత సంక్షోభం, వృత్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎలా ఏవైనా మనల్ని బాధిస్తుంటే, మానసికంగా మెలిపెడుతుంటే వాటి నుండి కొంత ఉపశమనం కోసం మనకు దగ్గరైన వారి వద్దకు వెళ్తాం. అయితే మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో, నష్టాలు ఎదుర
కష్ట సమయాల్లో, మనం మద్దతు కోసం, ఓదార్పు కోసం మనకు ప్రియమైన వారి వద్దకు వెళ్తాం. ఇది వ్యక్తిగత సంక్షోభం, వృత్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎలా ఏవైనా మనల్ని బాధిస్తుంటే, మానసికంగా మెలిపెడుతుంటే వాటి నుండి కొంత ఉపశమనం కోసం మనకు దగ్గరైన వారి వద్దకు వెళ్తాం. అయితే మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో, నష్టాలు ఎదుర్కొంటున్నామో అప్పుడు ఎదుటి వారు వ్యవహిరించే తీరే ఇక్కడ ముఖ్యమైనది.

అప్పటి వరకు మనం బాగున్నంత వరకు వారు మనతో బాగానే ఉంటారు, మనం కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా వారు అలాగే మనకు మద్దతునిస్తే, అండగా నిలబడితే అది అసలు సిసలైన వ్యక్తిత్వం అని గుర్తించాలి.
భార్య, స్నేహితులు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. అయితే వాళ్లు ఎప్పుడూ ఒకేలా ఉంటారని, మనం బాగున్నప్పుడైనా, కష్టాల్లో ఉన్నప్పుడైనా ఒకేలా ప్రవర్తిస్తారన్న నమ్మకం ఉండటం సహజం. కానీ ఆ కష్ట సమయంలో మాత్రమే అది నిజమో, కాదో తెలుస్తుందని చెబుతాడు చాణక్యుడు.
కష్ట సమయాల్లో భార్య పాత్ర:
కష్ట సమయాల్లో భార్య స్థిరత్వం, సౌకర్యాన్ని అందించగలదు. ఆమె భావోద్వేగ మద్దతుకు మూలం మరియు ఆలోచనలు, పరిష్కారాల కోసం ఆమె కీలకం. ఆమె బాధ్యతల భారాన్ని మోయడానికి, ముఖ్యమైన పనులను చూసుకోవడంలో కూడా సహాయపడుతుంది.
అయితే భార్యలు వారి సొంత అవసరాలు, భావోద్వేగాలు కలిగిన వ్యక్తులు అని గుర్తుంచుకోవడం ముఖ్యం. సంక్షోభ సమయాల్లో మీ జీవిత భాగస్వామితో ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.
కష్ట సమయాల్లో స్నేహితుడి పాత్ర:
కష్ట సమయాల్లో స్నేహితులు విభిన్నమైన సహాయాన్ని అందించగలరు. వారు వినే చెవిని, ఏడవడానికి భుజాన్ని, అవసరమైనప్పుడు అన్ని రకాలుగా సహాయం అందించగలరు. వారు కావాల్సిన సమయంలో సలహాలు అందించగలరు.
అయితే కష్ట సమయాల్లో మాత్రమే అసలైన స్నేహం గురించి తెలుస్తుందని అంటాడు చాణక్యుడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఎప్పటిలాగా మీతో గడుపుతున్నా, మీకు మద్దతుగా నిలబడుతున్నా, మీ అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నా.. వారిది నిజమైన స్నేహంగా గుర్తించవచ్చు.
కష్ట సమయాలు, భార్య, స్నేహితుల నిజమైన స్వరూపాన్ని వెల్లడిస్తాయి. ఈ సంబంధాలు ఓదార్పు, మద్దతుకు మూలంగా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ ఒత్తిడిని విభిన్నంగా నిర్వహిస్తారని గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారితో ఏదీ దాచుకోకుండా, నిజాయితీగా మాట్లాడటం చాలా కీలకం. బలమైన సంబంధాలను కొనసాగించడానికి, ఏదైనా కష్ట సమయాన్ని ఎదుర్కోవడానికి నిజాయితీ, నమ్మకం చాలా కీలకం. కష్ట సమయాల్లో మీకు మద్దతు ఇచ్చే వారిని అభినందించడం చాలా కీలకమని గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications
