Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Basant Panchami 2022:మీ రాశిని బట్టి సరస్వతీ దేవిని ఎలా ఆరాధించాలో చూడండి...
వసంత పంచమి రోజు ఏ రాశి వారు సరస్వతీ దేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజున వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది.

వసంత పంచమి పండుగను సరస్వతీ పూజ, వాగీశ్వరి జయంతి, రతి కామ మహోత్సవం, వసంత ఉత్సవం ఇంకా అనేక రకాల పేర్లతో జరుపుకుంటారు. సరస్వతీ దేవిని అనేక సందర్భాల్లో పూజించినప్పటికీ, వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది భావిస్తారు.

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి సరస్వతీ పూజను ఎలా చేయాలి.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే.. మీరు పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటే.. వసంత పంచమి రోజున సరస్వతీ దేవి కవచాన్ని చదవాలి. దీని వల్ల మీకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

వృషభ రాశి..
ఈ రాశి వారు సరస్వతీ దేవి అనుగ్రహం కోసం, ఎలాంటి స్వార్థం లేకుండా అంటే నిస్స్వార్థంగా సరస్వతీ దేవిని ఆరాధించాలి. ఆ దేవి విగ్రహానికి తెల్లటి చందనం సమర్పించాలి. అలాగే ఆమె పాదాలపై తెల్లని పువ్వులు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జ్ణానం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

మిధున రాశి..
ఈ రాశి వారు తమ కోరికలు నెరవేరాలంటే, వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి గ్రీన్ కలర్ కలాన్ని సమర్పించాలి. దీని వల్ల మీకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అలాగే మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఆ దేవీ సంగీత వాయిద్యాన్ని సూచించే వీణా విగ్రహానికి తియ్యని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ సమయంలో సంగీతంతో సంబంధం ఉండే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహ రాశి..
వసంత పంచమి రోజున ఈ రాశి వారు 27సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువగా జపిస్తే అంత మంచి ఫలితలు వస్తాయి. విదేశాల్లో చదవాలనే లేదా చదువుకునే విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు విద్యార్థిగా ఉండి, ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే.. వసంత పంచమి రోజున సరస్వతీ దేవి పాదాల దగ్గర స్టడీ మెటీరియల్ ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు.

తుల రాశి..
ఈ రాశి వారు వసంత పంచమి రోజున బ్రహ్మాణుడికి బట్టలు దానం చేయాలి. సరస్వతీ దేవి ప్రసంగంతో ముడిపడి ఉన్నందున, ఆమె తన భక్తులను అనుగ్రహిస్తుందని చాలా మంది నమ్ముతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి ఈరోజు జ్ణాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదురైతే, వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించాలి. ఆ దేవికి ఎరుపు రంగు కలం సమర్పించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారిలో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే సరస్వతీ పూజ రోజున సరస్వతీ దేవికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

మకర రాశి..
ఈ రాశి వారు తమ తెలివిని పెంచుకోవాలనుకుంటే.. సరస్వతీ దేవిని పూజించాలి. వసంత పంచమి రోజున పేదలకు తెల్లని రంగులో ఉన్న ధాన్యాలను దానం చేయాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు సరస్వతీ దేవి ఆశీర్వాదం కావాలనుకుంటే.. వసంత పంచమి రోజున పిల్లలకు లేదా విద్యార్థులకు స్కూల్ బ్యాగులను దానం చేయాలి.

మీన రాశి..
ఈ రాశి వారు కెరీర్ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. ఉద్యోగంలో మీరు సంతోషంగా లేకపోతే.. వసంత పంచమి రోజున విద్యార్థినులకు పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం పొందొచ్చు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష్యశాస్త్ర పండితుల అభిప్రాయాలు, ఊహాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. ఈ కథనానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదని గుర్తుంచుకోగలరు. మీకు ఏవైనా పరిహారాలు కావాలంటే.. వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజున వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది.



Click it and Unblock the Notifications
