Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్‌వర్డ్‌లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
Baba vanga: బాబా వాంగ భవిష్య వాణి.. ఇప్పటి వరకు ఏమేం నిజమయ్యాయంటే..
Baba vanga: బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్టీ రామారావు నటించిన ఈ మూవీ ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ అనే చెప్పాలి.అయితే ఈ సినిమాలో బ్రహ్మం గారి పాత్ర భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందే చెబుతుంది. దీనిని నిజమని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. కొందరు ఎప్పటిలాగే దానిని కొట్టి పడేస్తూ ఉంటారు. ఇలా ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి చెప్పే వాళ్లని చాలా మంది చూసే ఉంటారు. కొందరు చెప్పే విషయాలు నిజమవుతుంటాయి కూడా.

ఫ్యూచర్ గురించి చెప్పే వారిలో బాబా వాంగ కూడా ఒకరు. బల్గేరియా కు చెందిన ఆమె ఒక అంధురాలు. ఈమె 1996లోనే చనిపోయారు. అయితే బాబా వాంగ బతికున్నప్పుడు భవిష్య వాణి చెప్పారు. అయితే ఇప్పటికీ అందులో కొన్ని నిజం అవుతున్నాయని చాలా మంది నమ్ముతుంటారు. అంధురాలైన బాబా వాంగ తన అతీంద్రియ శక్తులతో భవిష్యత్ లో జరగబోయే విషయాలన్నీ ముందే చెప్పేశారని తనను నమ్మే వాళ్లు చెబుతుంటారు.
బాబా వాంగ చెప్పిన వాటిలో ఏమైనా నిజమయ్యాయా?
* అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి బాబా వాంగ ముందే అంచనా వేశారు.
* EU నుండి బ్రిటన్ బయటకు(బ్రెగ్జిట్) వస్తుందని బాగా వాంగ ముందే జోస్యం చెప్పారు.
* 9/11 దాడుల గురించి ముందే చెప్పారు బాబా వాంగ.
* ప్రిన్సెస్ డయానా మరణం.
* సోవియ్ యూనియన్ రద్దు
* చెర్నోబిల్ విపత్తు
* 2018 నాటికి చైనా సూపర్ పవర్ అవుతుందని చెప్పారు.
* 2004 సంవత్సరంలో సునామీ వస్తుందన్నారు.

బాబా వాంగ ఎవరు?
బాబా వాంగ అసలు పేరు వాంజెలియా ప్యాండెవా గుస్తెరోవా. నిజమైన పేరు కంటే కూడా ఆమె బాబా వాంగ అనే పేరుతోనే చాలా మందికి సుపరిచితం. 1911వ సంవత్సరంలో పుట్టారు బాబా వాంగ. తన 12 ఏళ్లు వయస్సులో ఒక భారీ తుపాను కారణంగా ఆమె కళ్లు కోల్పోయారు. చూపు పోయింది కానీ.. భవిష్యత్తును చూసే శక్తిని ఆ దేవుడు తనకు ఇచ్చాడని చెప్పేవారు వాంగ. అది తనకు భగవంతుడు ఇచ్చిన వరమని చెప్పేవారు. ఆమె 85 ఏళ్ల వయస్సులో 1996లో ఆమె మరణించారు. ప్రపంచం అంత కాబోయే 5079వ సంవత్సరం వరకు ఆమె భవిష్యవాణి చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆమె చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం వరకు నిజం అవుతున్నాయి. 2022 సంవత్సరానికి సంబంధించి బాబా వాంగ భవిష్యవాణి చెప్పారు. 2022లో కొన్ని సంఘటనలు జరుగుతాయని చెప్పారు. ఆమె మొత్తం ఆరు ఘటనలు చెప్పగా.. ఇప్పటి వరకు 2 జరిగాయి.

బాబా వాంగ 2022 భవిష్యవాణి:
1. 2022లో ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాకు తీవ్రమైన వరదలు వస్తాయని చెప్పారు. ఈ విషయంలో బాబా వాంగ చెప్పిందే నిజం అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ఆస్ట్రేలియా తీవ్రమైన వరదలతో అతలాకుతలం అయింది. పెద్ద పెద్ద నగరాలు కూడా వరదలో తల్లడిల్లాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా మంది ఆస్ట్రేలియన్లు నీటిలో వారాల పాటు ఉండాల్సి వచ్చింది.సౌత్ ఈస్ట్ క్వీన్స్‌లాండ్, వైడ్ బే-బర్నెట్ మరియు న్యూ సౌత్ వేల్స్, బ్రిస్బేన్‌లతో సహా అనేక నగరాలు నీటమునిగాయి.
2. కరువు కారణంగా నగరాలు నీటి కొరతతో దెబ్బతింటాయని బాబా వాంగ హెచ్చరించారు. యూరప్‌లో అదే జరుగుతోంది. నివేదికల ప్రకారం, పోర్చుగల్ వారి నీటి వినియోగాన్ని పరిమితం చేయమని వారి పౌరులను కోరింది. ఇటలీ ప్రస్తుతం 1950ల నుండి వారి అత్యంత కరువును ఎదుర్కొంటోంది.
2022, రాబోయే సంవత్సరాల గురించి ఇంకేం చెప్పారు ?
* ఈ సంవత్సరం సైబీరియా నుండి కొత్త ప్రాణాంతక వైరస్ వస్తుందని బాబా వాంగ అంచనా వేశారు.
* ఏలియన్స్ దాడి చేస్తాయని చెప్పారు.
* భారత దేశంపై మిడతలు దాడి చేస్తాయని.. పంటలు, చెట్లు అన్నీ తుడిచి పెట్టుకు పోతాయని హెచ్చరించారు.
* 2023లో భూమి కక్ష్య మారుతుందని అంచనా వేశారు.
* వ్యోమగాములు 2028లో శుక్రునిపైకి ప్రయాణిస్తారని కూడా ఆమె చెప్పారు.
* అవయవ మార్పిడి సాంకేతికత వల్ల 2046లో ప్రజలు 100 ఏళ్లకు పైగా జీవిస్తారని ఆమె అన్నారు.
* 2100 సంవత్సరంలో అదృశ్యం అవుతుందని, కృత్రిమ సూర్య కాంతి భూమిలోని మరో భాగాన్ని ప్రకాశింపజేస్తుందని ఆమె పేర్కొన్నారు.
* 2022లో ప్రపంచంలోని చాలా నగరాల్లో తీవ్ర తాగు నీటి కొరత ఏర్పడుతుందని హెచ్చరించారు.
* చాలా ప్రాంతాల్లోని నదుల్లో కలుషితం పెరిగిపోతుందని చెప్పారు.
* చాలా మంది ఫోన్లు, ఇతర గాడ్జెట్ లతోనే సమయం గడుపుతారని ఆమె అప్పుడే చెప్పారు.
* జనాలంతా ఎక్కువగా కంప్యూటర్ తెరల ముందే గడుపుతారట. దీని వల్ల ఫాంటసీకి, రియాల్టీకి మధ్య తేడా గ్రహించలేక గందరగోళానికి గురి అవుతారని హెచ్చరించారు.
మరికొన్ని
1. ఐరోపా ఆర్థికంగా పతనం అవుతుంది.
2. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఐరోపాలు రసాయనిక దాడులు చేస్తారు.
3. పెట్రోల్ వెలికితీసే పనులు ఆగిపోయి భూమికి విశ్రాంతి దొరుకుతుంది.
4. డ్రాగన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. మూడు పెద్ద దేశాలు ఒక్కటి అవుతాయి.



Click it and Unblock the Notifications