Latest Updates
-
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా?
Chanakya Niti: విజయవంతమైన బంధానికి జంటలకు ఈ లక్షణాలు ఉండాలి
చాణక్యుడు చెప్పిన కొన్ని లక్షణాలు ఉన్న జంట మధ్య సంబంధం బలోపేతం అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ తమ సంబంధంలో సంతోషంగా ఉంటారు. చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు తన గ్రంథాల్లో ఎన్నో విషయాల గురించి వివరించాడు. మానవ జీవితం సాఫీగా సాగేందుకు అనేక అంశాలపై బోధనలు చేశాడు. అలాగే ప్రేమ జీవితాన్ని మెరురుపరచడానికి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనే విధానాల గురించి చెప్పాడు. చాణక్యుడు చెప్పిన కొన్ని లక్షణాలు ఉన్న జంట మధ్య సంబంధం బలోపేతం అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ తమ సంబంధంలో సంతోషంగా ఉంటారు. చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకరినొకరు గౌరవించుకోవడం:
విజయవంతమైన సంబంధానికి ముఖ్యమైనది, చాణక్యుడు విశ్వసించినది దంపతులు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం. ఆరోగ్యకరమైన సంబంధంలో, భాగస్వాములిద్దరూ ఒకరి విలువలు, అభిప్రాయాలు, ఎంపికల పట్ల మరొకరు గౌరవాన్ని కలిగి ఉండాలని చాణక్యుడు చెప్పాడు. దాంపత్యంలో ఒకరినొకరు విమర్శించుకోవద్దు. దానికంటే ఒకరి బలాలను, బలహీనతలను తెలుసుకుని మసులుకోవాలి.

నమ్మకం:
సంబంధానికి పునాది నమ్మకం. నమ్మకం లేకుండా సంబంధం వృద్ధి చెందదు. దంపతులు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. ఒకరి నిర్ణయాలను ఒకరు విశ్వసించాలి. నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు, సంబంధాన్ని సరిదిద్దడం కష్టం. నమ్మకం నిర్మించడానికి సమయం పడుతుంది. కానీ విజయవంతమైన సంబంధానికి ఇది చాలా అవసరం.

కమ్యూనికేషన్:
భార్యాభర్తలు ఇద్దరు తమ ఆలోచనలు, భావాలు, అవసరాలను ఒకరికొకరు బహిరంగంగా, నిజాయితీగా తెలియజేయాలి. భాగస్వాములు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు రక్షణాత్మకంగ, కొట్టిపారేయడం లేదాతీర్పు చెప్పడం మానుకోవాలి. ఒకరి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కలిసి పని చేయాలి.

షేర్డ్ గోల్స్:
భార్యాభర్తలు ఒకరకమైన లక్ష్యాలను, ఆకాంక్షలను పంచుకోవాలి. భాగస్వాములు ఒకే లక్ష్యాలపై కలిసి కష్టపడుతుంటే బంధం బలోపేతం అవుతుంది. ఒకరి ఎదుగుదల మరియు అభివృద్ధికి ఒకరికొకరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది.

నిబద్ధత:
భాగస్వాములు ఒకరికొకరు మరియు సంబంధానికి కట్టుబడి ఉండాలి. పని లేదా సామాజిక జీవితం వంటి ఇతర విషయాల కంటే వారు తమ సంబంధానికి ప్రాధాన్యత ఇస్తారని దీనర్థం. భాగస్వాములు తమ సంబంధాన్ని కొనసాగించడానికి త్యాగాలు మరియు రాజీలు చేయడానికి సిద్ధంగా ఉండాలి.



Click it and Unblock the Notifications
