మన సంకల్పబలమే కరోనా వైరస్ కు అసలైన విరుగుడు... పోరాడాల్సింది వ్యాధితో... రోగితో కాదు...

మన సంకల్పబలమే కరోనా వైరస్ కు అసలైన విరుగుడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

దాదాపు రెండు వారాలవుతోంది. రాత్రి పన్నెండు గంటలకు సడన్ గా వాట్సాప్ లో ఒక మెసెజ్ వచ్చింది. అది హైదరాబాదులో ఉండే ఫ్రెండ్ నుండి. కరోనా, లాక్ డౌన్ దెబ్బకి అసలు ఏమి తోచట్లేదు అని.

Courage is the real vaccine of coronavirus

ఏమైందని అడిగితే, డియర్ యాదగిరి.. మీరు వచ్చే వారం నుండి జాబ్ కు రావాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు మూడు రోజుల క్రితం చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది.

Courage is the real vaccine of coronavirus

అందుకే మీరు దయచేసి ఇక నుండి ఆఫీసుకు రావద్దని యజమాన్యం నుండి ఓ అఫిషియల్ లెటర్ కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా మతిపోయినంత పనయింది. నేను ఇంకా ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. నీకే ఫస్ట్ చెబుతున్నా.. ఎవ్వరికీ చెప్పొద్దు. మా ఇంట్లో వారికి అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే వారు తట్టుకోలేరు. ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి.

Courage is the real vaccine of coronavirus

మా ఫ్రెండ్ ఉండేది ఫిల్మ్ నగర్లో. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేవాడు. వాళ్ల ఆఫీసులో ఒకరిద్దరికీ కరోనా సోకడంతో అందరికీ టెస్టులు చేయించారు. నిజం చెప్పాలంటే మావాడికి ఎలాంటి కరోనా లక్షణాలే లేవంట. దీని గురించి డాక్టర్లు కూడా అసింప్టమాటిక్ అని అంటున్నారు. అంటే కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తుందంట.

Courage is the real vaccine of coronavirus

ఈ విషయాన్ని రూమ్ లో వాళ్లకు కూడా చెప్పకుండా.. హాస్పటల్ కు వెళ్లకుండా డాక్టర్లు చెప్పినట్లు మాత్రమే చేశాడు.

న్యాచురల్ రెమెడీస్..

న్యాచురల్ రెమెడీస్..

పాలల్లో పసుపు వేసుకుని తాగడం.. వేడి వేడి అల్లం నీళ్లను తాగడం.. నిమ్మకాయ, లవంగం, మిరియాల రసం తాగడం పండ్ల రసం ఎక్కువగా తాగడం వంటివి ఎక్కువగా చేశాడు. వీటితో పాటు పానడోల్ అనే మందు బిల్లలను వేసుకున్నాడు. గుడ్లను ఎక్కువగా తినేవాడు. ఇలా ప్రతిరోజూ చేసేవాడు. తన వివరాలన్నింటినీ డాక్టర్లకు ఎప్పటికప్పుడు చెప్పేవాడంట.

మొదట్లో భయం..

మొదట్లో భయం..

మొదట్లో వాడు చాలా భయపడ్డాడు. ఇక తన పని అంతా అయిపోయింది అనుకున్నాడు. వెంటనే తన వాట్సాప్, ఫేస్ బుక్, మెసెంజర్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిని బ్లాక్ చేసుకున్నాడు. కానీ రోజురోజుకు వాడికి తత్వం బోధపడుతూ వచ్చింది. రోగనిరధక శక్తి పెంచుకుంటే, కరోనా ప్రాణాంతకం కాదని తెలిసింది. అప్పటి నుండి కరోనాను ఎదుర్కోవడంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాడు.

పుకార్లను పట్టించుకోలేదు..

పుకార్లను పట్టించుకోలేదు..

కరోనా వైరస్ గురించి అప్పటికే ఏవేవో పుకార్లు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అది సోకిన వారు కొన్ని గంటల్లోనే చనిపోతారని... ఊపిరాడకపోవడం వంటివి జరుగుతుందనే ఫేక్ న్యూస్ చాలా వచ్చాయి. అయితే మా ఫ్రెండ్ ఇవేవీ పట్టించుకోలేదు.

మళ్లీ టెస్టు చేయించుకుంటే..

మళ్లీ టెస్టు చేయించుకుంటే..

ఇలా పదిహేను రోజులు అన్నింటినీ కఠినంగా పాటించి.. మళ్లీ టెస్ట్ చేయించుకున్నాడు. అయితే మళ్లీ పాజిటివ్ వచ్చింది. అంతే కథ మళ్లీ మొదటికి వచ్చింది. చాలా ఫీలయ్యాడు. అయితే 15 రోజుల పాటు కరోనా వచ్చినా కూడా నేను బాగానే ఉన్నాను కదా.. ఇంకో 15 రోజులు ఉండలేనా అనే సంకల్పం మొదలైంది. అప్పటి నుండి ఇంట్లోనే ఉండిపోయాడు. బయటికి అడుగే వేయలేదు.

మళ్లీ టెన్షన్..

మళ్లీ టెన్షన్..

అలా 28 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకున్నాడు. ఆ రిపోర్టులో ఏమోస్తుందో అని ఒకటే టెన్షన్ పడ్డాడు. అంతలోనే తన కంపెనీ హెచ్ఆర్ నుండి మళ్లీ ఒక మెసెజ్ వచ్చింది.

అదేంటంటే...

అదేంటంటే...

డియర్ యాదగిరి మీరు లాస్ట్ టైమ్ చేయించుకున్న కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. కంగ్రాట్య్చులేషన్స్.. మీకు అంతా ఓకే అనిపిస్తే, మీరు వచ్చే వారం నుండి ఆఫీసుకు రావచ్చు. టేక్ కేర్ అని ఉంది.

నిర్లక్ష్యం చేయకపోవడంతోనే...

నిర్లక్ష్యం చేయకపోవడంతోనే...

తొలిసారి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినప్పటి నుండి మూడోసారి నెగిటివ్ అని వచ్చేవరకూ ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. భయపడలేదు. మొన్నా మళ్లీ ఫోన్ చేశాడు. ప్రస్తుతం అంతా మంచిగుంది. ఇప్పుడు మస్తు ఆరోగ్యంగా ఉన్నా.. అన్నాడు.

కరోనాను జయించొచ్చు..

కరోనాను జయించొచ్చు..

కానీ ఒక్కమాట భయమే సగరం రోగం. కరోనా లక్షణాలున్నా.. ఉన్నా లేకపోయినా.. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చు. నేనదే చేశాను. అని సంతోషంగా చెప్పాడు.

ధైర్యంతోనే..

ధైర్యంతోనే..

తను చెప్పాక నాకు కూడా అది నిజమే అనిపించింది. ఎలాంటి వైద్యం లేకుండానే ధైర్యంతో మనోడు కరోనా మహమ్మారి నుండి తప్పించుకున్నాడు. ఇక్కడ మన సంకల్పమే పెద్ద వ్యాక్సిన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

పోరాడాల్సింది వ్యాధితో...

పోరాడాల్సింది వ్యాధితో...

కాబట్టి కరోనా వైరస్ సోకితే.. పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. అయితే కొందరు ప్రస్తుతం కరోనా వచ్చిన వారిని అంటరానివాళ్లుగా చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రస్తుతం కరోనా పరిస్థితి భయంకరంగానే ఉంది. కానీ మనమంతా ధైర్యంగా.. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కరోనాను కాటికి పంపొచ్చు.

Story first published: Monday, July 6, 2020, 10:16 [IST]
Desktop Bottom Promotion