For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (11-04-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

వాస్తు ప్రకారం, మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే స్త్రీలు ఈ విధంగా చేయాలి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తుంటే, మీరు వాయిదా వేయడం మంచిది. ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీపై చాలా ఒత్తిడి ఉంటుంది. మరోవైపు పనిలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తారు. కుటుంబ జీవితంలో కూడా శాంతి ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోరు. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పని చేస్తే మీ సీనియర్లలో కొన్ని తప్పుడు భావాలు ఉండవచ్చు. ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉందది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఓ విషయంలో భావోద్వేగానికి గురవుతారు. ఈరోజు చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధపెడతాయి. ఇది కాకుండా, కొన్ని పాత విషయాల గురించి కూడా అనేక ప్రతికూల ఆలోచనలు గుర్తుకు వస్తాయి. అయితే మీరు పాత విషయాలను పక్కనబెట్టి ప్రస్తుత పరిస్థితులపై శ్రద్ధ చూపాలి. మరోవైపు ఈరోజు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. మీ వైవాహిక జీవితంలో కూడా ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో కూడా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:10 గంటల వరకు

మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా గొప్పగా ఉంటుంది. ఇటీవల మీరు ఏవైనా అప్పులు చేసి ఉంటే, మీరు వాటిని తీర్చే అవకాశం ఉంటుంది. అయితే పని విషయంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీ పనిని ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి సాధారణంగానే ఉంటుంది. మరోవైపు మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు తక్కువ పని చేసినా కూడా ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఈరోజు ఓ శుభవార్త వినిపించవచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొంత పురోగతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ప్రేమతో వ్యవహరిస్తే మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ముఖ్యంగా శ్రామిక ప్రజలు అదనపు పని చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఒత్తిడిని అనుభవిస్తుంటే, మీకు ఓ మంచి అవకాశం రావచ్చు. కొత్తగా వివాహం అయిన వారికి ఈరోజు జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉండొచ్చు. మీ ప్రియమైనవారు మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీకు అనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయం సమయానికి రాకపోవడం వల్ల మీ ముఖ్యమైన పనులు పూర్తి కావు. అయితే దీని గురించి మీరు ఎక్కువగా చింతించకండి. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:50 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఏర్పడవచ్చు. దీని వల్ల మీరు మానసికంగా చాలా బాధపడతారు. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చాలా బిజీగా ఉంటారు. బహుశా ఈ రోజు మీరిద్దరూ ఒకరికొకరు తగినంత సమయం పొందకపోవచ్చు. పని విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు. అయితే మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో మీరు సంతృప్తి చెందకపోతే మరియు మంచి అవకాశం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ రోజు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. మరోవైపు, మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, సమయం ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. కానీ డబ్బుల విషయంలో ఎవ్వరినీ అంత సులభంగా నమ్మకండి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ సంబంధంలో కొత్త అభిరుచిని అనుభవిస్తారు. బహుశా ఈ రోజు మీరు మీ ప్రియురాలితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు శృంగార జీవితంలో ఆనందం మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామిని కలవడానికి అవకాశం పొందుతారు, ఇది మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మరపురాని రోజు అవుతుంది. మరోవైపు మీరు ఈరోజు పనికి సంబంధించి కొత్త మరియు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఈ రోజు మీరు క్రొత్తదాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఖర్చులపై నిఘా ఉంచాలి. కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మరోవైపు, నిరంతరం పనిచేయడం ద్వారా మీరు ఈ రోజు ఎక్కువగా అలసిపోవచ్చు. మీ తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీరు వారి అభిమానాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైనవారికి ప్రత్యేక బహుమతి ఇవ్వవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరగొచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా మీ పనిలో అడ్డంకులు ఎదురవుతాయి.ఈ సమయంలో మీరు ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఇటువంటి హెచ్చుతగ్గుల పరిస్థితులు వస్తూ ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. మరోవైపు, ఉద్యోగం చేసేవారు ఈ సమయంలో ఎటువంటి ప్రతికూల నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మీరు పూజలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీని వలన మీరు ఖచ్చితంగా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యంపై కూడా మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి. తద్వారా మీరు ఎక్కువ ఒత్తిడిని అనుభవించరు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. ప్రత్యేకించి మీరు త్వరలో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించబోతున్నట్లయితే, మీరు ఈ రోజు చాలా కష్టపడతారు. సరైన ఫలితాలను పొందడానికి మీరు కృషి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీ సంబంధాన్ని బలంగా ఉంచడానికి, మీరు వారితో ఎక్కువగా గడపాలి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు పొందవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి ఉదయం 10:25 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 11, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Saturday, April 11, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more