For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (18-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులు నెమ్మదిగా పని చేయడం వల్ల చాలా ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఈరోజు నిరాశ చెందవచ్చు. అయితే మీరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. త్వరలో మీ సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి. మీ మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు ఉంటే, వెంటనే వాటిని మార్చుకోండి. ఎందుకంటే త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీ భాగస్వామితో ఈరోజు కొంత మంచి సమయం గడపవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : రాత్రి 9:20 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుండి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు ఏదైనా కొత్త బాధ్యత తీసుకుంటే, వాటిని నెరవేర్చడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు బాగుంటాయి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో పరస్పర అనుబంధం పెరుగుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈ సమయంతో మీ సంబంధం మరింత బలపడుతుందని మీరు భావిస్తారు. పని విషయంలో ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు

కరోనా లాక్ డౌన్ : చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలు లాగా భావించకుండా ఉండాలంటే...కరోనా లాక్ డౌన్ : చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలు లాగా భావించకుండా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ జీవితంలో కొంత అసమ్మతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందుతారు. మీరు మీ సంబంధాలను మెరుగుపరిచేందుకు, మీరు చాలా కష్టపడాలి. అయితే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మరోవైపు పని విషయంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా సంతోషిస్తారు. మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు విశ్రాంతి తీసుకునేందుకు తగినంత సమయం లభిస్తుంది. పని విషయంలో ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు చాలా కష్టపడి పని చేయాలి. అప్పుడే ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. కుటుంబసభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ప్రేమికులకు ఈరోజు గొప్ప రోజు అవుతుంది. మీ భాగస్వామితో మీరు ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీకు ఒక సువర్ణావకాశం రావచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 10 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీకు తెలుస్తుంది. ఈరోజు మీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబసభ్యులలో ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది. మీరు మీ కష్టాలన్నీ మరచిపోయి, సంతోషంగా కుటుంబంతో కలిసి నవ్వుతూ గడుపుతారు. ఈరోజు చాలా రిఫ్రెష్ అవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఆ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు అధ్యయనాల పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. మరోవైపు ఈరోజు వ్యాపారులు చాలా పెద్ద ప్రయోజనాలు పొందుతారు. మీరు వ్యాపారంలో ఏదైనా పెద్ద ఒప్పందాలను చేసుకోవచ్చు. పని చేసే వారంతా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, మీ జీవిత భాగస్వామితో మీకు ఈరోజు కొంత వివాదం ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చాలా తెలివిగా పని చేయాలి. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఈరోజు ఒక స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు మీ పనులన్నీ బలమైన సంకల్పంతో పూర్తి చేయగలుగుతారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు ఏదైనా నిర్ణయాన్ని తెలివిగా తీసుకోవాలి. అప్పుడు మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎలాంటి సమస్య ఎదురైనా మీరు మీ ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే, ఫలితం మంచిగా వస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా సంబంధాలు బలంగా ఉంటాయి. వివాహితులకు ఈరోజు చాలాఅద్భుతంగా ఉంటుంది. అయితే ప్రేమికుల జీవితంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీ సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు ఈరోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలరు. అయితే ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. అయితే మీరు ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు పొదుపుపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగే అవకాశం ఉంది. పని విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు ఈరోజు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే, చివరి క్షణంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 18, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, April 17, 2020, 20:35 [IST]
Desktop Bottom Promotion