For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (19-04-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఏవైనా అపార్థాలుంటే, అవన్నీ ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఒకరి విషయంలో మొదటి చూపులోనే ప్రేమలో పడే వ్యక్తిని కలవొచ్చు. మీ పనిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు ఈరోజు మీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం కూడా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మీరు మీ సమస్యల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు శృంగార పరంగా ఈరోజు మధురమైన క్షణాలను గడుపుతారు. మీ భాగస్వామితో చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో శ్రద్ధగా ఉండాలి. మీరు అజాగ్రత్తగా ఉంటే, మీకు ఇబ్బందులు తప్పువు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, మీరు కారం తక్కువగా ఉండే, ఆహారం తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపే అవకాశం ఉంటుంది. వివాహితులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ప్రేమ విషయంలో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ కొనుగోళ్లు చేయకుండా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ కావాలంటే, మీపై అధికారులను ఆకట్టుకుంటే, మీరు కోరుకున్న అవకాశం రావచ్చు. మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కరోనా లాక్ డౌన్ : చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలు లాగా భావించకుండా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఎవరికైనా ఆదాయపరంగా సహాయం చేయాలని అనుకుంటే, సమయం మీకు అనుకూలంగా ఉండదు. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నతాధికారులు ఈరోజు మీపై కఠినంగా వ్యవహరిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఈరోజు చాలా సరదాగా గడుపుతారు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో కొన్ని ఇబ్బందులు పడొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. దీని వల్ల మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఇలాగే ప్రతిరోజూ కొనసాగాలంటే, మీరు కొంత సమయం ధ్యానం చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు ఆదాయ పరంగా ఏదైనా కొత్త అవకాశం వస్తే, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మొత్తంగా ఈరోజు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగుల పనితీరును చూసి ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మరోవైపు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. పని విషయంలో మీరు విజయవంతం కావాలంటే, మీరు కొంచెం సీరియస్ గా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు వారి పని విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో శృంగారపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఉండటం ద్వారా మీ ఆనందం పెరుగుతుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వారి భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ శృంగార జీవితంలో కొన్ని సానుకూల మార్పులు జరగొచ్చు. ఈరోజు మీరు మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతి కూడా ఇవ్వొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. సకాలంలో డబ్బు అందకపోవడంతో మీ పనులన్నీ పెండింగులో పడిపోవచ్చు. అయితే మీరు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. మీ సీనియర్లు మీకు కొత్త మరియు ముఖ్యమైన పనిని అప్పగించవచ్చు. మీరు త్వరలో పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఫలితాలు కూడా ఊహించిన విధంగానే ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. మీ మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అధ్యయనాలలో మీ ధోరణి పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో చేయండి. త్వరలో మీకు సరైన ఫలితాలు వస్తాయి. వ్యాపారవేత్తలు ఈ రోజు కొంత ఉపశమనం పొందవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యానికి మీరు ప్రాధాన్యత ఉండాలి. మీరు పనిలో పడి ఆహారం తీసుకోవడం కూడా మరచిపోవచ్చు. మీరు కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని విభేదాలు రావచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చేసే పనిలో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాన్ని పొందవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ సమయంలో చిన్న పెట్టుబడి పెడితే, మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక పరంగా మీకు బలంగా ఉంటుంది. మరోవైపు మీకు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాలి. మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య అయినా ఈరోజు పరిష్కరించబడుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు మీకు నిరాశ ఎదురుకావచ్చు. అనవసరమైన విషయాలపై వివాదం జరగొచ్చు. వ్యాపారులు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. కుటుంబం విషయంలో మీరు చేసే పనికి, మీ ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 19, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Sunday, April 19, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more