For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (26-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 26, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

<strong>ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...</strong>ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పని విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే ఖర్చులు ఎక్కువగా చేయాలనుకుంటే, మాత్రం సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబంలో మీరు చేస పొరపాటు వల్ల కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు చాలా ఇబ్బందుల్లో పడొచ్చు. అందుకే మీరు నిర్లక్ష్యంగా ఉండకపోవడమే మంచిది. ఈ రోజు మీకు మీ తండ్రితో కొన్ని విభేదాలు ఉండవచ్చు. మీ అజాగ్రత్త వైఖరిని తీవ్రంగా విమర్శిస్తారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీలైతే, ఈ రోజు కొంత సమయం కేటాయించి, మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. జీవిత భాగస్వామితో ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు. ఈరోజు మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు కొన్నిముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఓవర్ టైమ్ కూడా పని చేయవచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా చాలా మంచిది. మీరు నిరంతర ప్రయత్నాలు చేయడం వల్ల మీకు గొప్ప విజయం దక్కుతుంది. నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగావకాశం గురించి ఓ శుభవార్త వినిపించవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొత్త అవకాశాలు రావొచ్చు. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వివాహితులు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ సంబంధంలో దూరం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా పెట్టుబడి పెడితే, మీకు ఫలితం ఉండొచ్చు. ఈ రోజు ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు మీకు పెద్ద ఇబ్బంది కలిగిస్తారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. నిర్ణయం తీసుకోవడంలో మీకు చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ప్రశాంతంగా ఆలోచించి, నిర్ణయం తీసుకుంటే సానుకూల ఫలితం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు సమయానికి డబ్బు అందే బలమైన అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమలో ఉన్న జంటలకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులను తిరిగి ప్రారంభించడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు చాలా తెలివిగా పని చేయాలి. కానీ తొందరపడకండి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీకు డబ్బు సంపాదించడానికి బలమైన అవకాశం ఉంది. కానీ పెరుగుతున్న ఖర్చులు మీ ఒత్తిడిని పెంచుతాయి. పని విషయంలో ఈరోజు మీకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఏదైనా సమస్య తలెత్తితే, మీరు ఉన్నతాధికారుల సహాయంతో మీ పనిని పూర్తి చేయగలరు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మరియు మానసిక స్థితి రెండూ బాగుంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్లు మరియు సహోద్యోగులతో సంబంధాలు బాగా ఉంటాయి. దీని వల్ల మీకు కొంత ప్రయోజనం కూడా కలుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబం మరియు జీవిత భాగస్వామి మద్దతుతో మీరు మానసికంగా బలంగా ఉంటారు. శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వాములు మీ కోసం ప్రత్యేకంగా ఏదో చేయబోతున్నారు. ఇది ఈ రోజును మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. ఈరోజు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి ఉదయం 11 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు శృంగార మానసిక స్థితిలో ఉంటారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా గడుపుతారు. మీరు మునుపటిలా ప్రేమను అనుభవించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు

కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరోవైపు, కొంతమంది సహోద్యోగులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా తెలివిగా పనిచేయాలి. ఆరోగ్యంగా ఉండటానికి, రోజూ తేలికపాటి వ్యాయామం మీకు చాలా ముఖ్యం.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు కలవరపెడతాయి. దీని వల్ల రోజువారీ అవసరాలను తీర్చుకోవడంలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు పనిలో అలసట పోయి అనుభూతి చెందుతారు. వ్యాపారులు ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేయకపోతే మంచిది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి 9:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఇలాంటి వాటికి చింతించకుండా సానుకూలంగా ఆలోచించాలి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. మీకు సమస్య మరింత తీవ్రమైతే, మీ కుటుంబం మరియు స్నేహితులు అండగా నిలబడతారు. ఈ రోజు మీరు మీ ప్రియమైనవారి యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ఇది మీ పరస్పర సంబంధాన్ని బలపరుస్తుంది. మరోవైపు, వ్యాపారవేత్తలు ఈ రోజు పెద్ద ఆర్థిక బేరం చేయడానికి అవకాశం పొందవచ్చు. ఈరోజు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి 8:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు చాలా సంయమనం పాటించాలి. మీరు ఈరోజు ప్రియురాలి సహాయంతో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. వ్యాపారులు ఆశించిన విధంగా కొత్త ప్రాజెక్టుల కల ఫలించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ముఖ్యమైన పనులు పెండింగులో పడిపోతాయి. ఉద్యోగులపై ఉన్నతాధికారులు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు శృంగార మానసిక స్థితిలో ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతును కూడా పొందుతారు. అంతేకాదు ఈరోజు మరపురాని రోజు గడుపుతారు. మీరు ఉద్యోగం చేస్తే, మీ పనిపై దృష్టి పెట్టండి. ఇక్కడ మరియు అక్కడ విషయాలను అధ్యయనం చేయడం ద్వారా మీ సమయాన్ని, శక్తిని వృథా చేయకండి. ఈ రోజు వ్యాపారులకు పెద్ద లాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 26, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, April 25, 2020, 18:05 [IST]
Desktop Bottom Promotion