Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
బుధవారం మీ రాశిఫలాలు (29-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతును ఆశించవచ్చు. ఉద్యోగులు మరియు వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఈరోజు లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:40 నుండి రాత్రి 8:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. ఈరోజు మీరు మీ మీద ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రోజు మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల పూర్తి మద్దతు పొందుతారు. వారితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ రోజు మీరు స్నేహితుడు లేదా సహోద్యోగి నుండి ప్రయోజనాలను పొందవచ్చు. మీ వివాహ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. దీని వల్ల మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. మీరు మీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆ సందర్భంలో ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక విషయాల గురించి కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిమితుల కారణంగా మీ పనులు పెండింగులో పడిపోతాయి. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అదృష్టం ఉండొచ్చు. పని విషయంలో ఈరోజు ఒత్తిడి తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. అయినా కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆచితూచి అడుగు వేయాలి. మీ వైవాహిక జీవితంలో మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. మీ మానసిక శాంతిని కాపాడుకోవడానికి ఈరోజు ధ్యానం చేయాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో శాంతి కావాలంటే, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉండాలి. దీనివల్ల మీ భాగస్వామితో మీతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు సానుకూలంగాఉంటుంది. మీరు మానసిక శాంతిని కూడా అనుభవిస్తారు. అయితే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేముందు బాగా ఆలోచించండి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి రాత్రి 8:10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత ఉంటుంది. మీరు సానుకూల శక్తితో చుట్టుముట్టారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా సంపద పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. మీరు వారితో ఉండటం వల్ల ఈరోజు మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు మీ కుటుంబంతో ఎక్కువ గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల మీకు ప్రతికూల ఆలోచనలు గుర్తుకొస్తాయి. వ్యాపారులు ఈరోజు ఏదైనా లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రశాంతంగా పని చేయాలి. ఆరోగ్య పరంగా ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పనిపై మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్య పరంగా ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. మరోవైపు మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. మీ ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం ఉంది. కానీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో కోపం తెచ్చుకుంటారు. చిన్నవిషయాలకే కలత చెందుతారు. పని ఒత్తిడి మీ వివాహ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక పరంగా మీరు మెరుగవ్వాలంటే, మీరు చాలా తెలివిగా పని చేయాలి. అప్పుడే మీరు అదనపు డబ్బు సంపాదించవచ్చు. ప్రేమ విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు చాలా అసౌకర్యం కలుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ప్రత్యర్థుల పట్ల, ఎందుకంటే వారు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆలోచించకుండా ఖర్చు చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుంది. విద్యార్థులు కూడా ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లాలనుకుంటే, మీరు నిరంతం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మీకు సానుకూల ఫలితాలు వస్తాయి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 42
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారులకు ఈరోజు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మీరు లాభాలను కూడా పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో మీ మనస్సును పంచుకోవడం ద్వారా చాలా తేలికగా భావిస్తారు. ఆరోగ్య విషయాలు అద్భుతంగా ఉంటాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈరోజు అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరోవైపు ప్రేమ విషయంలో ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications