Latest Updates
-
టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్.. అప్పటికప్పుడు వేసుకునే కరకరలాడే మొక్కజొన్న దోశ -
బంగారం రేట్లు మరింత తగ్గుతాయా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి అంచనా! -
ఈరోజు రాశి ఫలాలు (24.03.26): మంగళవారం నాడు ఈ రాశుల వారికి ధనయోగం! -
కామద ఏకాదశి 2026 తేదీ, పూజా ముహూర్తం, విష్ణుమూర్తి ఆశీస్సులు పొందే శక్తివంతమైన మంత్రం -
అన్నంలోకి అమృతంలా ఉండే పెరుగు వంకాయ గ్రేవీ.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ! -
నోటికి పండగలా అనిపించే దహీ సమోసా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
భారత్ లో పెరుగుతున్న రెండో పెళ్లి ధోరణి..జీవన్ సాథి సర్వేలో ఆసక్తికర నిజాలు -
వంకాయ-బంగాళదుంప గుజ్జు..ఇడ్లీ,దోశలకు సరైన జోడి! -
డైట్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు తినాల్సిన 4 సూపర్ స్నాక్స్ ఇవే! -
అచ్చమైన పల్లెటూరి స్టైల్ పచ్చి మామిడికాయ చట్నీ..చపాతీ, రోటీ, అన్నం దేనిలోకైనా అదుర్స్!
గురువారం మీ రాశిఫలాలు (30-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
ఈ వారం మీ రాశి ఫలాలు 26 నుండి మే 2వతేదీ వరకు...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగుదల ఉండొచ్చు. మీరు ఈరోజు ఆర్థిక పరంగా లాభం పొందవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో శ్రద్ధగా పని చేయాలి. ఈరోజు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఈ రోజు మీరు మీ కుటుంబంతో చాలా సంతోషకరమైన రోజు గడుపుతారు. మీరు చేసే పనిలో కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ భాగస్వామితో ఈరోజు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు బాగుంటాయి. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు ఈరోజు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, వాటన్నింటినీ సులభంగా అధిగమించగలరు. దీనికి గాను మీ తండ్రి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు ఊహించని లాభం పొందే అవకాశం ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు నిరంతరం పని చేయడం వల్ల అలసిపోవచ్చు. మీరు విశ్రాంతిపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. కుటుంబంలో కూడా ఓ అనుకోని సంఘటన వల్ల ఇంటి వాతావరణం మారుతుంది. ఆరోగ్య పరంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు మీపై ఆధిపత్యం చేస్తాయి. ప్రేమ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎవరినైనా ఆకర్షించవచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు పనిలో ఒత్తిడి కారణంగా ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతాయి. దీంతో మీకు పని భారంగా అనిపిస్తుంది. ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు. అయితే మీరు కష్టపడి పనిచేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఆదాయం పొందేందుకు కొత్త ప్రణాళికలు వేయొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కలహాలు ఉంటాయి. మీ ఇంటి సభ్యుల మధ్య పరస్పరం సమన్వయం చెడిపోవచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 29
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 2:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ప్రేమ విషయంలో కూడాఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో శృంగార పరంగా ఆనందంగా గడుపుతారు. అంతేకాదు మీ ప్రియమైన వారి నుండి మీరు కొన్ని శుభవార్తలు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఎక్కువ ఖర్చులుంటాయి. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఇది మీ సీనియర్లను సంతోషపరుస్తుంది. మరోవైపు మీరు కుటుంబంతో సంతోషకరమైన జీవితం గడుపుతారు. ముఖ్యంగా తోబుట్టువుల మద్దతు మరియు ప్రేమతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మానసిక స్థితి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యంగా ఉండటం వల్ల ఈ రోజు మీరు ప్రతి పనిని సులభంగా పూర్తి చేయగలరు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ లో సాన్నిహిత్యం పెరుగుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. మీరు నిరంతరం చేసే ప్రయత్నాల వల్ల మీకు అదనపు ఆదాయం కూడా లభించవచ్చు. అంతేకాదు మీరు కొత్త ఆర్థిక ప్రణాళికలను కూడా చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 9:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు వారు చేసిన పనికి ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. మీ ఉన్నతాధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మరోవైపు, వ్యాపారులు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. మీ వైవాహిక జీవితం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ తప్పు వైఖరి మీ మధ్య విభేదానికి కారణమవుతుంది. ఇది కాకుండా, ఇంటి కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు హాయిగా కూర్చుని ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పెరుగుతున్న అసమ్మతి వల్ల మీ మానసిక శాంతికి భంగం కలగవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు చాలా ధైర్యం మరియు సహనంతో ఎదుర్కోవాలి. పని విషయంలో ఈరోజు మీకు చాలా కఠినంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ వివాహ జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 4:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు మీ కుటుంబం విషయంలో ఆనందం మరియు శాంతిని కోరుకుంటే, మీరు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీకు సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు పేదవారికి ఆర్థికంగా కూడా సహాయపడవచ్చు. ఈ రోజు వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది. ఇది మీ వివాహ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు ఈ రంగంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, మీరు మీ ఉన్నతాధికారులతో మాట్లాడాలి. ప్రేమ విషయంలో ఈరోజు చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీరు కొంత ఇబ్బంది పడొచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:15 నుండి రాత్రి 7 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications










![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)
