Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఈ వారం మీ రాశి ఫలాలు 26 నుండి మే 2వతేదీ వరకు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి.

మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం పని పరంగా చాలా ముఖ్యమైనది. ఈ వారం మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మీరు ఈ వారం పూర్తి సామర్థ్యంతో ఎంత కష్టపడి పని చేస్తున్నారో నిరూపిస్తారు. మీరు ఈ వారం పురోగతి సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు స్థిరమైన వ్యాపారం మరోసారి పురోగమిస్తుంది. అయితే వ్యాపారులు ఈ వారం కొత్తగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నవారికి సమయం అనుకూలంగా లేదు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం వల్ల మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంంది. అయితే వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్: కుంకుమ
లక్కీ నంబర్ : 9
లక్కీ డే : గువారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. అయితే ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. కాబట్టి మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. అయితే ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితిలోకి వస్తాయి. మరోవైపు ఉద్యోగులు అనుభవాల నుండి ఏదైనా కొత్తగా నెర్చుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ కాలంలో మీరు గొప్ప ఆర్థిక విజయాన్ని పొందలేకపోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలు ఉండవు. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈ కాలంలో మీకు మీ తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్: పర్పుల్
లక్కీ నంబర్ : 42
లక్కీ డే : ఆదివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం పనితో పాటు ఆరోగ్య పరంగా చాలా ముఖ్యమైనది. మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యం మరింత బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో మీరు తాజాగా మరియు శక్తివంతంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉద్యోగులకు ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు రావచ్చు. ఈ వారం వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బు గురించి ఆలోచించి ముందుకు సాగితే మంచిది. ఈ వారం కుటుంబ జీవితానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మీరు బాధ్యతారహితమైన చర్యలకు దూరంగా ఉండాలి.
లక్కీ కలర్: ఎల్లో
లక్కీ నంబర్ : 25
లక్కీ డే : శనివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)
ఈ వారం ఈ రాశి వారికి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ విశ్వాసం మరియు అనుకూలత మీ ఉన్నతాధికారులను బాగా ప్రభావితం చేస్తాయి. మరోవైపు వ్యాపారులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. వివాహితులకు ఈ వారం కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో కూడా, శృంగార జీవితంలో చిన్న సమస్యలు ఉండవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో మీ భాగస్వాములు తప్పు చేయవచ్చు. ఈ వారం ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అలాగే డబ్బుకు సంబంధించిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.
లక్కీ కలర్: బ్లూ
లక్కీ నంబర్ : 2
లక్కీ డే : బుధవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం చాలా సందర్భాలలో మంచిగా ఉంటుంది. ఈ వారం మీరు గొప్ప ఉపశమనం పొందొచ్చు. ఈ వారం మీరు ఊహించిన ప్రకారమే పనులన్నీ జరుగుతాయి. మీరు మీ ఆలోచనలతో కష్టమైన పనులను కూడా ఈ వారం సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల ప్రోత్సాహం ఉంటుంది. అయితే వ్యక్తిగత జీవితంలో ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే, మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో మీ వివాహ జీవితాన్ని ఆనందిస్తారు. మీరిద్దరి మధ్య పరస్పర అవగాహన మరియు ప్రేమ మీ ఆనందాన్ని పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 19
లక్కీ డే : మంగళవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)
ఈ వారం మీకు చాలా ఆనందంగా ఉంటుంది. సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. దీంతో మీరు ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరంగా కూడా ఈ వారం మెరుగుదల ఉంటుంది. అయితే మీరు ఎలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా బాగుంటుంది. మీ మానసిక స్థితి కూడా బాగానే ఉంటుంది.మరోవైపు ఈ వారం మీరు మీ పనిని ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఈ వారం వ్యాపారులకు కూడా మేలు కలుగుతుంది. ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఈ కాలంలో మీరు మీ ప్రత్యర్థులకు కఠినమైన పోటీని ఇవ్వవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని కలవడం ద్వారా, మీరు మీ చింతలన్నీ మరచిపోతారు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ డే : ఆదివారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)
ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరమైన సంబంధిత అంశాల గురించి ఆందోళన చెందుతారు ఆర్థిక పరిమితుల కారణంగా మీ పనులన్నీ పెండింగులో పడొచ్చు.ఇలాంటి సమయంలో మీరు ఆర్థికంగా బలంగా ఉండాలంటే మీరు కొంచెం భిన్నంగా ఆలోచించాలి. వ్యాపారులు ఈ వారం కొత్త వాటి గురించి అస్సలు ఆలోచించకూడదు. అధిక పని ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిద్రలేమి సమస్య వల్ల మీరు కూడా ఇబ్బంది పడతారు. మీ వైవాహిక జీవితం మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్: పింక్
లక్కీ నంబర్ : 30
లక్కీ డే : బుధవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఈరోజు ప్రతి సవాలును ఎంతో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. వీరి ప్రతిభను సీనియర్లు గుర్తించి అభినందిస్తారు. నిరుద్యోగులకు వారం చివర్లో ఉద్యోగావకాశం లభిస్తుంది. వ్యాపారులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. మీరు ఈ వారం లాభాలు పొందే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. శృంగార జీవితంలో ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 26
లక్కీ డే : శుక్రవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం అనేక విషయాల్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు పెరగొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే, మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక సమయంలో ఒక పని చేయడం మంచిది. ఈ వారం ఆర్థిక విషయంలో సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో తొందరపడకండి. మీరు మీ బడ్జెట్ ను బట్టి ఖర్చులు చేస్తే, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటా. మరోవైపు ఈ వారం ఆరోగ్య పరంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి.
లక్కీ కలర్: బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ డే : సోమవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)
ఈ రాశి వారికి ఈ వారం జీవితంలో కొత్త మలుపు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. దీని వల్ల మీ అప్పులను తీర్చేందుకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఈ కాలంలో మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. ఆర్థిక స్థితి ఈ వారం బలంగా ఉంటుంది. ఈ వారం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. వివాహితులు ఈ సమయంలో మీపై ఒకరికొకరు నమ్మకం బలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో బాగానే ఉంటుంది.
లక్కీ కలర్: స్కై బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ డే : ఆదివారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)
ఈ రాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. వివాహితులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయితే మీరు చిన్న విషయాలపై అతిగా స్పందించడం వంటివి మానుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగులతో కలిసి వేగవంతంగా పని చేయడం మంచిది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం, మీరు మీ అధ్యయనాలకు సంబంధించి కొన్ని కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్: బ్రౌన్
లక్కీ నంబర్ : 2
లక్కీ డే : శనివారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనది. ఆదాయ సంబంధిత సమస్యలు ఈ వారంలో పరిష్కరించబడతాయి. అంతేకాదు మీరు కొన్ని పాత అప్పులను కూడా తీర్చే అవకాశం ఉంది. ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులలో ప్రేమ మరియు ఐక్యత కనిపిస్తుంది. మీ తోబుట్టువులతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది. ఈ వారం మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్: ఎల్లో
లక్కీ నంబర్ : 20
లక్కీ డే : మంగళవారం
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications











