For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రోజు మీ దినఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ సరికొత్త భవిష్యత్తు గురించి తెలుసుకోండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు విద్యలో ఏవైనా సందేహాలుంటే మీరు గురువుల సహాయంతో, మీరు సమస్యలన్నింటినీ అధిగమిస్తారు. పని విషయంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. మీ కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీరు మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఈ రోజు మీ ప్రియమైన వారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే, ఈ రోజు ఆమె ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 46

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ శత్రువులు ఏదైనా ఆటంకం ఏర్పరిచే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తెలివిగా పని చేయాలి. ఉద్యోగులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ చేసే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పని భారం అకస్మాత్తుగా పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ పరిస్థితులు నెమ్మదిగా మారతాయి. చాలా కాలం తర్వాత ఈరోజు మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

<strong>అమ్మో! కరోనా వైరస్ ఇంకా అన్ని రోజుల పాటు ఉంటుందా? </strong></p><p>అమ్మో! కరోనా వైరస్ ఇంకా అన్ని రోజుల పాటు ఉంటుందా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరొచ్చు. అయితే మీరు సమస్యలను పెంచుకోకుండా పరిష్కారం దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో మీ భావాలను కలిగి ఉంటారు. ఉద్యోగులు లేదా వ్యాపారులు ఈరోజు మీ బాధ్యతలను నిజాయితీగా నెరవేరుస్తారు. ఆర్థిక పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీరు బెట్టింగులు మరియు లాటరీలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 7 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటే, నిరాశకు గురవ్వాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరోవైపు పని విషయంలో ఈరోజు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. మీరు పనిని క్రమ పద్ధతిలో చేస్తే, సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ బడ్జెట్ ను బట్టి మీరు డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు వ్యాపారులకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొన్ని గొప్ప అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు నిరాశకు గురవుతారు. అలాగే శృంగార జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 45

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామికి ఏదైనా మంచి చేసేందుకు ప్రయత్నించండి. దీని వల్ల మీ వివాహ జీవితంలో ఉత్సాహంగా ఉంటుంది. పని విషయంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ సీనియర్లు మీ పనితీరుతో చాలా సంతోషంగా ఉంటారు. త్వరలో మీరు పెద్ద ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 4:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు చాలా క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కొన్ని ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. మీ పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులకు ఈరోజు కొంత ఆందోళన ఉండొచ్చు. అయితే మీరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఆరోగ్యంగా ఉండేందుకు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో అసమ్మతి ఉంటుంది. వివాహితులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. పిల్లల నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వారు ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటారు. పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయాలి. దీని వల్ల మీరు త్వరలో మంచి విజయాన్ని సాధించగలరు. మీరు మీ మానసిక శాంతిని కాపాడుకోవాలనుకుంటే, మీరు నిగ్రహంగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా సరదాగా గడుపుతారు. ఈరోజు పనిలో చాలా తేలికగా ఉంటుంది. మీరు ఈరోజును పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహనతో నడుచుకుంటే, మీ ఇద్దరి మధ్య ప్రతిదీ సాధారణమవుతుంది. ఈరోజు ఓ ముఖ్యమైన పని సమయానికి పూర్తవుతుంది. మీరు ఈరోజు కొన్ని సందర్భాల్లో రాజీ పడాల్సిన పరిస్థితి రావచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సొంత గుర్తింపు వంటి కల ఈరోజు నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ గురించి ఓ శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వివాహిత జంటలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో గొప్ప సమయాన్ని గడపడానికి అవకాశం పొందవచ్చు. మీ మనసులో ఏమైనా సందిగ్ధత ఉంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచి రోజు అవుతుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపార అవకాశాలను పొందుతారు. అయితే ఆర్థిక విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ చేతిలో నుండి డబ్బు సులభంగా జారిపోతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని మధురమైన క్షణాలను ఆనందివచ్చు. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు మీ భాగస్వామితో గొడవపడకుండా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 6, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Sunday, April 5, 2020, 12:48 [IST]
Desktop Bottom Promotion