For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (01-08-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope August 1, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పని విషయంలో ఈరోజు బిజీగా ఉంటుంది. అయితే ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని గొప్ప ఆఫర్లు రావచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామి కోపం తగ్గడంతో మీ మధ్య అంతా సాధారణంగా ఉంటుంది. ఈ రోజు, మీరు మీ ప్రియమైన స్వభావంలో కొన్ని మార్పులను చూడవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చేసే పనులన్నీ చాలా సహనంతో మరియు ప్రశాంతంగా పూర్తి చేయాలి. మీరు పని ఒత్తిడి కారణంగా, మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. ఇది మీకు చాలా కోపం తెప్పిస్తుంది. ఆర్థిక రంగంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ బడ్జెట్ కు తగ్గట్టే ఖర్చులుంటాయి. మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా ఒత్తిడికి లోనవుతారు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా సరైన సమయానికి తినడం మరియు తాగడం వంటివి చేయాలి. లేదంటే, మీరు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడొచ్చు. పని విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ఈ సమయంలో మార్పు గురించి ఆలోచించకూడదు. వ్యాపారులకు ఈరోజు లాభం వంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆస్తి పరమైన విషయాల్లో మీరు ఏదైనా ప్రయోజనం కూడా పొందొచ్చు. మీ కుటుంబ కలహాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 8 గంటల వరకు

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, మీ కృషి ఫలించదు. కానీ మీ పని విజయవంతంగా పూర్తవుతుంది. మరోవైపు, ఈరోజు వ్యాపారులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీని వల్ల మీరు నష్టాలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అంతా సాధారణంగా మారిపోతుంది. మీరు మీ కుటుంబ సభ్యుల ద్వారా ఈరోజు ఆర్థిక సహాయం పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్దతు కూడా లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, తొందరపడకండి. లేకపోతే మీరు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు మార్కెటింగ్‌తో సంబంధం కలిగి ఉంటే, ఈ రోజు మీ లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. మీరు ఆఫీసులో ఉన్నత పదవిలో పనిచేస్తుంటే, ఇతర ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇవి మీ పనిని ప్రభావితం చేస్తాయి. మీరు వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు పెద్ద ప్రయోజనాలు ఏమి లభించకపోవచ్చు. మీకు లభించే చిన్న లాభాలతో సంతృప్తి చెందాలి. అయితే, పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. కాబట్టి మీరు నిరుత్సాహపడకూడదు. మరోవైపు, శ్రామిక ప్రజలు తమ యజమానిని సంతోషపెట్టడానికి తమపై అధిక ఒత్తిడి పెట్టకుండా ఉండాలి. ఒకేసారి పలు పనులు చేయడం వల్ల మీ ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు తప్పులు చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీరు పరిస్థితులను మెరుగుపరచడానికి మీ ఖర్చులను నియంత్రించాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటారు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతుంటే, ఈ రోజు మీ సమస్యకు పరిష్కారం దొరకొచ్చు. పని విషయంలో ఈరోజు ఆనందం కలుగుతుంది. ఈ రోజు మీరు మీ ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. వ్యాపారులు స్వల్ప లాభం పొందవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఇంటి పెద్దలతో మంచి సంబంధం కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. వీలైతే, కొన్ని రోజులు ఇంటి నుండి పని చేయండి. వ్యాపారులకు పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీ సమస్యలు కూడా పెరుగుతుాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన బాగా ఉంటుంది. మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ మానసిక శాంతిని కాపాడుకోవడానికి ఒత్తిడికి దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పనులను పెండింగులో ఉంచకూడదు ఎందుకంటే మీ యజమాని అకస్మాత్తుగా మీ పనిని తనిఖీ చేయవచ్చు. సహోద్యోగులతో చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో కొంత సమస్యగా ఉంటుంది. అయితే నెమ్మదిగా పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పని ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకోవడం మంచిది. వ్యాపారులు ఈరోజు కొంత ఓపికగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు పెద్దగా ఖర్చు చేయాలనే మానసిక స్థితిలో ఉంటే, అయితే ఈరోజు అందుకు అనుకూలంగా ఉండదు. మరోవైపు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పనులు చేయాలనుకుంటే, ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారులకు కూడా ఈరోజు కొంత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారితో గొడవ పడొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈ రోజు ఆరాధనపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇది కాకుండా, మీ సామర్థ్యం ప్రకారం మీరు అవసరమైన వారికి కూడా సహాయం చేస్తారు. ఈ రోజు శ్రామిక ప్రజలకు పవిత్రంగా ఉంటుంది. మీరు మంచి ప్రదర్శన ఇస్తారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అదే సమయంలో, వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

English summary

Daily Horoscope August 1, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, July 31, 2020, 18:07 [IST]
Desktop Bottom Promotion